శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి
+{{Authority control}}
ట్యాగు: 2017 source edit
చి (+{{Authority control}})
 
==జననం==
కృష్ణమూర్తి [[పశ్చిమ గోదావరి]] జిల్లా దేవరపల్లికి చెందిన [[ఎర్నగూడెం]] లో [[1866 ]] సంవత్సరంలో అక్టోబరు 29 వ తేదీనాడు (అక్షయ సం. ఆశ్వయుజ బహుళ షష్థీ సోమవారము) రాత్రిజాము గడిచిన పిదప పునర్వసు తృతీయ చరణమున వెలనాటి వైదిక [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] వంశంమున వెంకట సుబ్బమ్మ వెంకట సోమయాజులను పుణ్యదంపతులకు జన్మించారు/
 
పదుగురు [[పిల్లలు]] గతించిన పిదప వల్మీక ప్రాంతమున శ్రీకృష్ణారాధనము చేసిన ఆనంతరము జనించి, విషూచివలన రెండేళ్ళ ప్రాయమున అస్తమించి, శ్వశానవాటికలో పునర్జన్మ నంది, గర్భాష్థనము దాటిన పిదప ఉపనయన దీక్షారాంభమందే శ్రౌతస్మార్తముల నెరంగి కావ్యపఠనము సాగించి, [[రఘువంశము|రఘువంశ]] పరిశీలనమందె సంస్కృత కవనపుజాడలు గ్రహించి, 16వయేట [[తెలుగు]] కవిత్వమును చెప్పనేర్చి, బహుళశ్లోకములందు స్వీయచరిత్రను వ్రాసి, తండ్రి యజ్ఞములో అధ్వర్యమును సలిపి, బాల్యమును కాటవరమున గడిపి, శ్రీ ఇవటూరి నాగలింగశాస్త్రి గారిని ఆశ్రయించి, శ్రీ మధిరసుబ్బన్న దీక్షితులను సహాధ్యాయముతో బహుళశాస్త్రాంశము లెరిగి, వాగ్దేవి నారాధించి శాస్త్రులుగారు దీర్ఘోపాసనకు పూనుకొనిరి.. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా [[గ్రంథాలు]] రచించారు. వానిలో [[నాటకాలు]], [[కావ్యాలు]], జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి. వీరి కుమార్తె [[కల్లూరి విశాలాక్షమ్మ]] కూడా కవయిత్రి. ఈమె శతకాలు, కావ్యాలు 30కి పైగా వ్రాశారు.
==పదబంధ నేర్పరి శ్రీపాద వారు==
గోదావరి తీరం,[[రాజమహేంద్రవరం]] తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త [[పదాలు]] వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు.'మరందం, మకరందం' వంటి పదాలు అందుకు [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]. సజాతి,విజాతి, విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు.ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో [[రామాయణము|రామాయణ]], [[మహా భారతము|మహాభారత]], భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంథాలను రాసారు. [[పద్యం]], గద్యం, లలితపదాలు అన్నీ ఆయన [[రచన]]<nowiki/>లో స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్తం, వేదం, శ్రౌతం ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు. ఇంటికి వచ్చినవాళ్ళు చివరకు కోర్టుకేసులు వేసినవాళ్లు వచ్చినాసరే ఆతిధ్యం ఇచ్చి అన్నంపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం ఈయనిది.
 
 
==పత్రికా సంపాదకుడిగా==
 
==ఇతర విశేషాలు==
[[రాజమహేంద్రవరం]] మున్సిపల్ కార్పొరేషన్ [[సంగ్రహాలయం|మ్యూజియం]] పార్కులో శ్రీపాద వారి విగ్రహాన్ని గతంలోనే ఏర్పాటుచేశారు.
 
ఇక శ్రీ రామేన ఆదినారాయణకు శ్రీపాద వారంటే ఎనలేని భక్తిప్రపత్తులు వుండేవి. అందుకే శ్రీ ఆదినారాయణ జీవించివున్నంతకాలం శ్రీపాద వారి జయంతికి మేళతాళాలతో ఊరిగింపు నిర్వహించేవారు. శ్రీపాద వారి విగ్రహానికి [[పూల మాల|పూలమాల]] వేసి భక్త్యంజలి ఘటించేవారు.
* [https://archive.org/details/in.ernet.dli.2015.387583 డి.ఎల్ః.ఐలో చెళ్ళపిళ్ళ వారి చెరలాటము(మొదటి భాగము) పుస్తక ప్రతి]
* [https://archive.org/details/in.ernet.dli.2015.390019 డి.ఎల్ః.ఐలో చెళ్ళపిళ్ళ వారి చెరలాటము(రెండవ భాగము) పుస్తక ప్రతి]
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
1,82,236

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2445110" నుండి వెలికితీశారు