గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
పంక్తి 60:
చలం వ్యక్తిగత జీవితంలో పెద్దగా సుఖపడలేదని చెప్పవచ్చు. భార్య అతని ప్రవర్తనతో విసుగెత్తి, అతనితో ఉండలేక బంధువులదగ్గరకు వెళ్ళలేక మానసిక క్షోభ అనుభవించిందట. కొంతకాలానికి, ఆమె తీవ్ర విచారంలో (Depression)మునిగిపోయిందట. పెద్ద కొడుకు చిన్నతనంలోనే జబ్బు చేసి మరణించాడు. రెండవ కొడుకు దురలవాట్లకు బానిసై, ఇల్లు వదలి ఎటో వెళ్ళి పోయాడు. కూతురు సౌరిస్ వివాహం చేసుకోలేదు, సన్యాసినిగా మారింది. పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం మీద "[[బిడ్డల శిక్షణ]]" అనే పుస్తకం వ్రాసిన చలానికి ఈ పరిస్థితి ఎదురు కావటం విచిత్రం!
 
సమాజం తన పట్ల చూపుతున్న ఏహ్యభావం, తన రచనల పట్ల వచ్చిన వివాదం, చివరకు అతనికి ఎంతగానో దగ్గరైన వదిన (వొయ్యిగా పిలుచుకున్న పెద్ద రంగనాయకమ్మ, అతని భార్య సవతి సోదరి. ఈమె బెజవాడలో వైద్యురాలు, ఆమెకు వైద్య విద్య చలమే చెప్పించాడు) [[మరణం]] చలాన్ని కుంగతీసి, ఆంధ్ర దేశం నుండి వెళ్ళిపోయి ఏదైనా ప్రశాంత [[వాతావరణం]]<nowiki/>లోవాతావరణంలో బతుకుదామన్న నిర్ణయం తీసుకునేలా చేసాయి. 1950 ఫిబ్రవరి 9న చలం [[బెజవాడ]]<nowiki/>లోని తన సొంత ఇంటిని అమ్మివేసి, తన [[కుటుంబము]]<nowiki/>తోకుటుంబముతో [[అరుణాచలం]] వెళ్ళిపోయాడు. అప్పటివరకు ధార్మిక విషయాలమీద విముఖత చూపిన చలం, ఒక్కసారిగా [[రమణ మహర్షి]] ఆశ్రమానికి వెళ్ళటం చర్చనీయాంశమయ్యింది. చలాన్ని [[రమణ మహర్షి]] దగ్గరకు, అతని మిత్రుడు, సహోద్యోగి దీక్షితులు [[1930]]లలో తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుండి చలం అప్పుడప్పుడు రమణాశ్రమానికి వెళ్ళివస్తూండేవాడట. ప్రముఖ సినీ రచయిత [[పింగళి నాగేంద్రరావు]]కు చలానికి ఈ విషయంలో జరిగిన సంభాషణ:
{| cellpadding="1" style="left; border: 0px solid #8888aa; background: #fffea0; padding: 5px; font-size: 100%; margin: 0 5px 0 10px;"
| style="background: #d3ff73; text-align: center;" |
పంక్తి 94:
చలం తన చివరి కాలంలో, తన కూతురు సౌరిస్ లో ఈశ్వరుణ్ణి చూసుకున్నాడట. ఏపని చేసినా 'ఈశ్వరుడు చెప్పాలి' అనేవాడట. "ఈశ్వరుడు" అంటే అతని దృష్టిలో సౌరిస్. ఆమె ప్రభావంలోనే చలం 1961లో "ప్రళయం" వస్తుందని ప్రచారం చేసాడు. తెలిసిన వారందరికి ఉత్తరాలు వ్రాసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని, లేదా అరుణాచలం వచ్చేయమని సలహా ఇచ్చాడు. అతని అభిమానులు కొంతమంది సహాయ శిబిరాలను కూడా ఏర్పరిచారట. కాని, అటువంటి ప్రమాదం ఏమీ జరగక పోవటంతో, చలం నవ్వులపాలైన మాట నిజం.
 
ఈయన వెళ్ళిన అతికొద్ది కాలానికే రమణ మహర్షి ఇహలోక యాత్రను చాలించారు. చలం అక్కడి ప్రశాంత వాతావరణంలో కొంత ధార్మిక విషయాల మీద సాధన చేశాడు. అక్కడే [[భగవద్గీత]]<nowiki/>కు చక్కటి వివరణ వ్రాశాడు. ఎందరో మోసపోయిన స్త్రీలకు ఆశ్రయం కల్పించాడు. అతని భార్య హృద్రోగంతో అరుణాచలంలోనే మరణించింది. చివరి రోజులలో అతని కూతురు సౌరిస్, ఎంతగానో సేవ చేసింది. అరుణాచలంలో మూడు దశాబ్దాలు జీవించి, 1979 మే 4న [[అనారోగ్యం]]<nowiki/>తోఅనారోగ్యంతో చలం మరణించాడు. అతని అంత్యక్రియలు కూతురు సౌరిస్ జరిపించింది. ఆతని మరణం తరువాత కొన్ని నెలలపాటు, ఆతని రచనల గురించి దిన/వార పత్రికలలో తీవ్ర చర్చలు జరిగాయి.
 
==చలం - రచనా వ్యాసంగం==
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు