గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

చి మూస అభివృద్ధి
పంక్తి 41:
[[బొమ్మ:CHALAM FAMILY PHOTO.jpg|right|200px|thumb|చలం భార్య, కుమారునితో(అరుదయిన చిత్రం)]]
===చలం - ఆత్మ కథ===
తనమీద తానే ఒక పుస్తకాన్ని వ్రాసి (1972), దానికి "చలం" అని పేరు పెట్టాడు. అదే అతని [[ఆత్మకథలు|ఆత్మకథ]]. తన ఆత్మకథలో చలం తనతండ్రి తనను కొట్టడం గురించి వ్రాసాడు, కానీ ఆయన పేరు మాత్రం వ్రాయలేదు. తన తల్లి భర్తతోను పిల్లలతోను పుట్టింటనే అవస్థ పడటం గురించి వ్రాసాడు, కానీ ఆవిడ పేరు కూడా రాయలేదు. (చలం ఆత్మకథలో ఇద్దరి పేర్లు లేవు). ఈ [[ఆత్మకథ]]కుఆత్మకథకు ముందుమాట తనే వ్రాసుకున్నాడు. ఆ ముందుమాట చలం అంతర్గతాన్ని తెలియజేస్తుంది -
{{వ్యాఖ్య|<big>ఆత్మకథలంటే నాకసహ్యం. ఆత్మకథ వ్రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషైనట్టు, తానేదో ప్రజలకి తీరని ఉపకారం చేసినట్టు, తన సంగతి చెప్పుకోకపోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు, తెలియకపోతే లోకానికి నష్టమైనట్టు అనుకొంటున్నాడన్నమాట, రాసినవాడు. ఎందుకు పుట్టానా? పుట్టినవాణ్ణి చప్పున చావక ఎందుకింత కాలం తన పరిసరాలని ఇంత కల్మషం చేశానా అనుకునే నావంటివాడు తనకథ [[సిగ్గు]]లేకుండా చెప్పుకొంటున్నాడంటే ఏమాత్రం క్షమించదగిన విషయం కాదు</big>|||చలం|}}.
 
===జననం - బాల్యం===
చలంగా ప్రసిద్ధి చెందిన గుడిపాటి వెంకటచలం [[1894]],మే నెలలో 18న [[మద్రాసు]] నగరంలో జన్మించాడు. చలం [[అమ్మ|తల్లి]] వేంకటసుబ్బమ్మ, తండ్రి [[కొమ్మూరి సాంబశివరావు]]. అయితే తన తాతగారు గుడిపాటి వేంకటరామయ్య దత్తత తీసుకోవడంతో, ఇంటిపేరు మారి గుడిపాటి వెంకటచలంగా పేరొందాడు . చిన్నతనంలో సంధ్యావందనం వంటి ఆచారాలను నిష్టగా పాటించాడు. ఉన్నత పాఠశాల చదువులు పూర్తి కాకముందే ఇతిహాస పురాణాలను క్షుణ్ణంగా చదివాడు. తన తండ్రి, తల్లిని వేధించే తీరు ఆ చిన్నవాని హృదయంపై బలమైన ముద్ర వేసింది. తన చెల్లెలు 'అమ్మణ్ణి' పెళ్ళి ఆగిపోవడం కూడా స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలపైకి అతని దృష్టిని గాఢంగా మళ్ళించింది.
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు