గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
*'''[[మునిమాణిక్యం నరసింహారావు]]''' ఆ నిమిషానికి కులాసాగా చదవడానికి పనికి వస్తాయి. .All sentiment and tawdriness ప్రస్తుత కాలపు కుటుంబ జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. కాని disgustingly small.
*'''[[విశ్వనాధ సత్యనారాయణ]] '''- ''ఆయన కవిత్వం నాకు అర్ధం కాదు. తప్పిదం చాలా వరకు నాదేననుకుంటాను. ఆయన నాటకాలలో యేవీ గొప్పవి కావు. Quite disappointing.''
*'''[[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]'''- ''ఆయన వూర్వశి is disappointing . ఇంకా వెన్నెముక గట్టిపడి, సూనృతమూ, ఉత్సాహమూ అతని జీవితంలోకి-తద్వారా, కవిత్వంలోకీ వొస్తే-తను ఏమి అనుభవించానని ప్రజలు అనుకోవాలనుకుంటున్నాడు అది కాక-తను నిజంగా ఏమి ఎట్లా అనుభవించాడో అది వ్రాస్తే-అతను అద్భుతమైన గీతాలు వ్రాయగలడు.నా ఉద్దేశంలో ప్రస్తుతపు రచకుల్లో అతను అగ్రగణ్యుడని.కాని అతని రచనలు అస్పష్టము, అనవసరంగా అయోమయం.కాని స్వంతంగా, నాకు గొప్పగా వుంటాయి. అతని రచనలు.అతని-fine delicate tochestouches at the heart.హృదయం మీద అతనిచ్చే నాజూకు నొక్కులు''
*'''బసవరాజు అప్పారావు'''-''ఒక గొప్ప కవిత్వపు పంక్తి కోసం నూరు డబ్బాల చెత్త రాస్తాడు.ఇప్పటికే అతన్ని మర్చిపోవడం న్యాయంగా తోస్తుంది''
*'''[[రాయప్రోలు సుబ్బారావు]] '''-''కొత్త యుగాన్ని ప్రారంభించాడు. మంచి శైలి .Thought (కొత్త అభిప్రాయాలు) సున్న''.
పంక్తి 139:
 
===చలం రచనలు - సినిమాలు===
తెలుగు చిత్రపరిశ్రమ ఆవిర్భావం మొదలు, ముఖ్యంగా పరిశ్రమ తొలి దశల్లో,[[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]] వంటి పలు తెలుగు రచనలు చలనచిత్రాలుగా దృశ్యరూపం పొందినప్పటికీ చలం కథలుగాని, నవలలుగాని సినిమాగా తియ్యడానికి ఎవరూ సాహసించలేదు. చలం రచనలు ఎంతో మంది చదివినా, సమాజంలో అతను వ్రాసిన కథలు అనేక వక్ర భాష్యాలకు గురి కావడం, ఇంతాచేసి సినిమా ఎంతో శ్రమ పడి, డబ్బు ఖర్ఛు చేసి తీస్తే ఏమవుతుందో అన్న అనుమానం, భయం ముఖ్య కారణం కావచ్చును. పైగా, ఆ కథలు గానీ, నవలలు గానీ సినిమాలుగా తీసి జనంలోకి తీసుకెళ్ళగలిగిన నటులు గాని, దర్శకులు గాని ముఖ్యంగా నిర్మాతలు గాని కరువయ్యారనే చెప్పవచ్చు. 2005 వ సంవత్సరంలో చలం [[దోషగుణం]] కథ ఆధారంగా, [[ఇంద్రగంటి మోహనకృష్ణ]] దర్శకత్వంలో [[గ్రహణం]] చిత్రం వచ్చింది. ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైన ఈ చిత్రం ఆర్థికంగా లాభాలు ఆర్జించలేదు. అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు, పలు పురస్కారములు పొందింది. ఆ తర్వాత చలం [[మైదానం]] నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత మరియు నటుడు [[తనికెళ్ళ భరణి]] ప్రయత్నం చేసి పరిశ్రమ నుండి సరైన స్పందన లభించక మానుకున్నాడట <ref> [http://www.hindu.com/2005/11/11/stories/2005111101780200.htm]</ref>.1980 ల ద్వితీయ అర్థ భాగంలో, [[హైదరాబాదు]] [[దూరదర్శన్]] వారు (DD-8), మైదానం నవలను ఒక టెలీ ఫిల్ముగా రూపొందింపచేసి ప్రసారం చేసారు. కానీ, తీసిన పద్ధతి, దర్శకత్వం, నటన పేలవంగా ఉండటం వలన, ప్రాచుర్యం పొందలేదు.
 
==చలంగురించి ఇతర ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు