మొఘల్ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83:
== హుమాయూన్ ==
{{main|హుమాయూన్}}
బాబరు మరణముతో, అతని కుమారుడు [[హుమాయూన్]] (1530–56) రాజ్యానికి వచ్చేనాటికి రాజ్యం క్లిష్టపరిస్థుతులలో ఉంది. ఢిల్లీ గద్దెపై ఆఫ్ఘన్లు దాడిచేయటం మరియు తన రాజ్యసంక్రమణ వివాదాస్పదం కావటంతో అన్నివైపుల నుండి హుమాయున్‌కు ఒత్తిడి ప్రారంభమయ్యింది. [[షేర్ షా సూరీ]] సేనలచే [[సింధ్]] వరకూ తరమబడిన హుమాయున్, 1540లో పర్షియాకు పారిపోయి, పదునైదు సంవత్సరాల పాటు సఫవిద్‌ల అతిధిగా [[షా తహమస్ప్]] సభలో అవమానముతో తలదాచుకున్నడు. షేర్షా సూరీ పాలనలో సామ్రాజ్యాన్ని సమైక్య పరచటం మరియు పాలనా యంత్రాగాన్ని వ్యవస్థీకరించడం జరిగాయి. ఇవి ఆ తరువాత అక్బర్ పాలనలో మరింత అభివృద్ధి చెందాయి. అంతేకాక షేర్షా సూరీ యొక్క సమాధి శిల్పకళా తార్కాణమై ఇండో-ఇస్లామిక్ సమాధుల శిల్పశైలిని చాలా ప్రభావితం చేసింది. 1545లో సఫవిదుల సహాయముతో హుమాయున్ కాబూల్ పై పట్టుసాధించి, 1545 మేలో షేర్షా సూరీ మరణముతో బలహీనపడిన ఆఫ్ఘన్ల అధికారాన్ని ఆసరాగా తీసుకొని భారత్‌పై తిరిగి తన హక్కును చాటాడు. హుమాయన్ 1555లో ఢిల్లీని తిరిగి చేజిక్కించుకున్నాడు. కానీ తిరిగివచ్చిన ఆరు నెలలకే తన గ్రంథాలయ మెట్లపై జారిపడి మరణించాడు. ఢిల్లీలోని [[హుమాయూన్ సమాధి]] మొఘల్ శిల్పశైలి అభివృద్ధికి, మెరుగుకు అత్యద్భుత ఉదాహరణ. దీన్ని హుమాయున్ మరణించిన ఎనిమిది సంవత్సరాలకు 1564లో ఆయన విధవరాలు [[హాజీ బేగం]] రూపకల్పన జేసినది. ethani ki adrustavathudu ani bhavistharu
 
== అక్బర్ ==
"https://te.wikipedia.org/wiki/మొఘల్_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు