జస్టిస్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
ప్రారంభంలో ఈ పార్టీ ఆంగ్ల పరిపాలనా విభాగాల్లో బ్రాహ్మణేతరులకు ఎక్కువగా ప్రాతినిథ్యం కల్పించేలా బ్రిటిష్ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. 1919లో [[మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము|మాంటేగ్ షెమ్స్ ఫర్డ్ సంస్కరణల]] ఫలితంగా మద్రాసు ప్రెసిడెన్సీ లో ద్వంద్వ పరిపాలనా విధానం (Diarchy) అమల్లోకి వచ్చింది. అలా మొదటి సారిగా జస్టిస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనింది. 1920 లో జరిగిన ప్రెసిడెన్సీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 17 ఏళ్ళలో ఐదుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు అయితే అందులో నాలుగు సార్లు ఈ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసి 13 ఏళ్ళు అధికారంలో ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ ఇదొక్కటే. 1937లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోలేకపోయింది. తర్వాత ఇది ఆత్మగౌరవ నినాదంతో [[ఇ.వి. రామస్వామి నాయకర్|పెరియార్ రామస్వామి]] నాయకత్వం కిందకు వచ్చింది. 1944లో పెరియార్ ఈ పార్టీని ''ద్రవిడర్ కళగం'' అనే పేరుతో సామాజిక సంస్థగా మార్పు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం విరమింపజేశాడు. 1952లో ఈ సంస్థలోని కొంతమంది తిరుగుబాటు దారులు ఎన్నికల్లో పోటీ చేశారు.
 
జస్టిస్ పార్టీ అవలంభించిన కొన్ని వివాదాస్పద విధానాల వల్ల భారత రాజకీయాల్లో ఏకాకిగా మిగిలిపోయింది. ఈ పార్టీ ముఖ్యంగా సివిల్ సర్వీసుల్లో, రాజకీయాల్లో బ్రాహ్మణులను వ్యతిరేకించింది. బ్రాహ్మణ వ్యతిరేకతనే తమ పాలసీలుగా ఏర్పాటు చేసుకున్నారు. [[అనీ బిసెంట్|అనీబిసెంట్]] ప్రారంభించిన [[హోమ్ రూల్ స్వరాజ్యోద్యమము|హోం రూల్ ఉద్యమం]] బ్రాహ్మణులకు మేలు చేసిదిగా ఉందంటూ దాన్ని వ్యతిరేకించారు. తమ ప్రెసిడెన్సీ లో [[సహాయ నిరాకరణోద్యమం|సహాయ నిరాకరణోద్యమాన్ని]] కూడా వ్యతిరేకించారు. బ్రాహ్మణత్వాన్ని సమర్ధించినందుకు మహాత్మా గాంధీతో విబేధించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జస్టిస్_పార్టీ" నుండి వెలికితీశారు