బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

corrections
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
1975 లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో తలుగుశాఖలో C.P.Brown Project లో రీసెర్చ్ ఆఫీసర్ గా నియమించబడ్డాడు.
 
== ఈ క్రుషిలో భాగంగానే "బ్రౌన్ జాబులు, ఆధునికాంధ్ర సాహిత్య శకలాలు " పుస్తకం వెలుగు చూచింది. బహుశా ప్రొఫెసర్ జి.యన్. రెడ్డిగారి ప్రోత్సాహం, అభిమానం దీని వెనుక ఉండి ఉండవచ్చు.1977లో ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే 'ఆంద్ర గీర్వాణ ఛందము"ను వెలువరించాడు.ఈ పరిశోధన లోంచే "బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు:కడప జాబుల సంకలనం" కూడా తయారుచేసి, అచ్చువేసాడు. మద్రాసు ఆర్కైవ్స్ లో పరిశోధించి, "మాలపల్లి నవల మీద ప్రభుత్వనిషేధాలు"పుస్తకం తెచ్చాడు. ఇది తన సొంత ప్రచురణ. ఈ ప్రాజెక్ట్ కాల పరిమితి ముగియడంతో నెల్లూరు వచ్చేసాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తనకోసం వేమన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి, హైదరాబాద్ పిలిపించింది. 24-April 1980 లో ఈ కొత్త ఉద్యోగంలో చేరాడు. అప్పటికే బంగోరెలో చాలా అసంతృప్తి, తలపెట్టిన పరిశోధనలు అర్దాన్తరం గా ముగిసిపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండడం వంటి అనేక అంశాలు అతనిమీద ప్రభావం చూపి ఉండవచ్చు. ప్రభుత్వశాఖల్లో ఉండే పరాధీనత, బాసిజం ఏవీ అతని ప్రవృత్తికి సరిపడేవి కావు. ఏమయినా తనకున్న పరిమిత అవకాశాల్లో వేమన గురించిన సమస్త విషయాలను సేకరించి ఒక సమగ్ర భండాగారాన్ని భవిష్యత్ పరిశోధకులకోసం ఎర్పాటు చెయ్యాలని పూనుకొన్నాడు.సుడిగాలి పర్యటనలు చేసి బోలెడంత భోగట్ట రాసిపోసాడు. కోర్ట్ స్టే లతో 1981లో ఆ పదవిలో కొన్నాళ్ళు సాగినా , ప్రాజెక్ట్ ముగిసిపోయింది. ఈ నిస్సహాయ పరిస్తితుల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి మీద ఒక పరిశోధనకు బంగోరె నియమించబడ్డాడు. 1982 అక్టోబర్ లో ఆ ఉద్యోగము ముగిసింది. అలసిపోయి, నిరాశతో నెల్లూరు చేరాడు.అతనిలో ఘనీభవించిన అసంతృప్తి, జీవితేచ్చ కోల్పోవడం వంటి వైక్లబ్యాలను సన్నిహిత మిత్రులు కూడా గమనించలేదు. ఎవ్వరికీ చెప్పకుండా నెల్లూరు విడిచి, ఢిల్లీ, హరిద్వార్, హ్రిషికేశ్ తదితర ప్రదేశాలు ఒక గమ్యంలేకుండా తిరిగి, చివరకు, భాక్రానంగల్ డాం మీదినుంచి దూకి ప్రాణాలు విడిచిపెట్టాడు. అతని జీవితంలోను, మరణంలోను అన్ని విషాద విస్మయాలే. ==
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/బండి_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు