బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆత్మహత్యలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
 
==జీవిత సంగ్రహం==
బంగోరె జననం 1938 అక్టోబర్ 12.. మరణం 1982 అక్టోబర్ 31. నెల్లూరు వి. ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ , అనంతరం [[ఆంధ్ర విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో యం కాం ఆనర్స్ చదివాడు. 1960లో కొద్దికాలం స్రవంతి పత్రికలో, తర్వాత మరి కొన్ని నెలలు ఆంధ్రజ్యోతి దినపత్రిక, విజయవాడలో ఉద్యోగం చేసి, కడప కో ఆపరేటివ్ బ్యాక్ లో సెక్రటరీగా పని చేసాడు. 1964లో నెల్లూరు [[జమీన్ రైతు]] వార పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేసాడు. జమీన్ రైతు పత్రికలో వారం వారం "కూనిరాగాలు" శీర్హిక నిర్వహించి నెల్లూరు జిల్లా ప్రజాబాహుళ్యంలో విశేషమైన కిర్తి పొందాడు. ఈ శీర్షికను "లోకలిస్ట్ " కలంపేరుతో నిర్వహించాడు. ఈ పత్రికలో బంగోరె, బండి గోపాలరెడ్డి పేర్లతో కూడా వ్యాసాలు రాసేవాడు. స్థానిక చరిత్ర పైన పరిశోధించి వందల వ్యాసాలు రాసాడు. నెల్లూరు వీధుల చరిత్ర, పాతకాలం సత్రాలు, పాథశాలలు, మిషనరీ సంస్థల చరిత్ర ఇట్లా అనేక విషయాలమీద రాసాడు. పుస్తకాలమీద, సినిమాల మీద, నెల్లూరు గోప్పవారిమీద రాసాడు. నేలనూతల శ్రీకృష్ణమూర్తి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం కూడా ఇతని రచనా వ్యాసంగానికి ప్రోత్శాహం కలిగించింది. స్థానిక చరిత్ర రచనకు ఒంగోలు వెంకటరంగయ్య గారి "కొందరు నెల్లూరు గొప్పవారు" వ్యాసాలు దారి చూపాయి.
 
1967 ప్రాంతంలో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యాడు. ఈ సమాజం ప్రతి సంవత్సరం కవిపండితుల జయంతులు జరుపుతుంది. ఆవిధంగా ఎందరో ప్రసిద్ధవ్యక్తుల పరిచయం, స్నేహం లభించింది. కావలి కళాశాల అద్యాపకులు కే.వి. ఆర్ స్నేహం తనపయి గొప్ప ప్రభావం కలిగించింది. 1969 మార్చి నెలలో [[గురజాడ అప్పారావు]] గారి మొదటి కన్యాశుల్కం ప్రతి సంపాదించి, దానికి నోట్సు రాసి, ఆరుద్ర ఉపోద్ఘాతంతో ప్రచురించాడు. ఈ పుస్తకం పరిశోధకుడుగా ఆయనకు అజరామరమయిన కీర్తి తెచ్చిపెట్టింది.ఇందులో గురజాడవారి జన్మదినాన్ని నిర్దుష్టంగా నిరూపించాడు.
పంక్తి 16:
1975 లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో తలుగుశాఖలో C.P.Brown Project లో రీసెర్చ్ ఆఫీసర్ గా నియమించబడ్డాడు.
 
ఈ క్రుషిలో భాగంగానే "బ్రౌన్ జాబులు, ఆధునికాంధ్ర సాహిత్య శకలాలు " పుస్తకం వెలుగు చూచింది. బహుశా ప్రొఫెసర్ జి.యన్. రెడ్డిగారి ప్రోత్సాహం, అభిమానం దీని వెనుక ఉండి ఉండవచ్చు.1977లో ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే 'ఆంద్ర గీర్వాణ ఛందము"ను వెలువరించాడు.ఈ పరిశోధన లోంచే "బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు:కడప జాబుల సంకలనం" కూడా తయారుచేసి, అచ్చువేసాడు. మద్రాసు ఆర్కైవ్స్ లో పరిశోధించి, "మాలపల్లి నవల మీద ప్రభుత్వనిషేధాలు"పుస్తకం తెచ్చాడు. ఇది తన సొంత ప్రచురణ. ఈ ప్రాజెక్ట్ కాల పరిమితి ముగియడంతో నెల్లూరు వచ్చేసాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తనకోసం వేమన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి, హైదరాబాద్ పిలిపించింది. 24-April 1980 లో ఈ కొత్త ఉద్యోగంలో చేరాడు. అప్పటికే బంగోరెలో చాలా అసంతృప్తి, తలపెట్టిన పరిశోధనలు అర్దాన్తరం గా ముగిసిపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండడం వంటి అనేక అంశాలు అతనిమీద ప్రభావం చూపి ఉండవచ్చు. ప్రభుత్వశాఖల్లో ఉండే పరాధీనత, బాసిజం ఏవీ అతని ప్రవృత్తికి సరిపడేవి కావు. ఏమయినా తనకున్న పరిమిత అవకాశాల్లో వేమన గురించిన సమస్త విషయాలను సేకరించి ఒక సమగ్ర భండాగారాన్ని భవిష్యత్ పరిశోధకులకోసం ఎర్పాటు చెయ్యాలని పూనుకొన్నాడు.సుడిగాలి పర్యటనలు చేసి బోలెడంత భోగట్ట రాసిపోసాడు. కోర్ట్ స్టే లతో 1981లో ఆ పదవిలో కొన్నాళ్ళు సాగినా , ప్రాజెక్ట్ ముగిసిపోయింది. ఈ నిస్సహాయ పరిస్తితుల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి మీద ఒక పరిశోధనకు బంగోరె నియమించబడ్డాడు. 1982 అక్టోబర్ లో ఆ ఉద్యోగము ముగిసింది. అలసిపోయి, నిరాశతో నెల్లూరు చేరాడు.అతనిలో ఘనీభవించిన అసంతృప్తి, జీవితేచ్చ కోల్పోవడం వంటి వైక్లబ్యాలను సన్నిహిత మిత్రులు కూడా గమనించలేదు. ఎవ్వరికీ చెప్పకుండా నెల్లూరు విడిచి, ఢిల్లీ, హరిద్వార్, హ్రిషికేశ్ తదితర ప్రదేశాలు ఒక గమ్యంలేకుండా తిరిగి, చివరకు, భాక్రానంగల్ డాం మీదినుంచి దూకి ప్రాణాలు విడిచిపెట్టాడు. అతని జీవితంలోను, మరణంలోను అన్ని విషాద విస్మయాలే.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/బండి_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు