తెలుగు లిపి: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., మొదలగు → మొదలైన, కూడ → కూడా (2), ) → ) (11), ( using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
[[దస్త్రం:1410-srinatha time - telugu inscription.jpg|thumb|250px|right|1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనం]]
తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరమున ఉన్న [[భట్టిప్రోలు]] గ్రామమందు క్రీ.పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది <ref>The History of Andhras, Durga Prasad; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf</ref>. ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడా అచటకు చేరినది<ref>[http://www.buddhavihara.in/ancient.htm Ananda Buddha Vihara<!-- Bot generated title -->]</ref>. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవులనుండి తూర్పు ఆసియా లోని బర్మా, థాయిల్యాండ్, లావోస్ మొదలైన దేశాలకు కూడా చేరి అచటి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది<ref>[http://www.sepiamutiny.com/sepia/archives/002554.html థాయ్ లిపి ఆవిర్భావ వివరాలు]</ref><ref>[http://www.omniglot.com/writing/balinese.htmబాలి భాష ఆవిర్భావ వివరాలు]</ref>. క్రీ.శ. ఐదవ శతాబ్దము నాటికి [[భట్టిప్రోలు లిపి]] పాత తెలుగు లిపిగా పరిణామము చెందింది<ref>The Blackwell Encyclopedia of Writing Systems by Florian Coulmas, p. 228</ref><ref>Vishwabharath by K. N. Murthy and G. U. Rao, http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf</ref><ref>Indiain Epigraphy: a guide to the study of inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan languages, by Richard Solomon, Oxford University Press, 1998, p.40, ISBN 0-19-509984-2</ref><ref>Indian Epigraphy by Dineschandra Sircar, Motilal Banarsidass, 1996, p.46, ISBN 81-208-1166-6</ref><ref>The Dravidian Languages by Bhadriraju Krishnamurti, 2003, Cambridge University Press, pp.78-79, ISBN 0-521-77111-0</ref><ref>K. Raghunath Bhat, http://ignca.gov.in/nl001809.htm</ref>.
 
తెలుగున [[నన్నయ్య]] కావ్యవ్యాకరణచ్చందసంప్రదాయములకేకాక, తెలుగు లిపి సౌందర్యము నావిష్కరించుటయందు ప్రధమాచార్యుడు.నన్నయకు పూర్వము తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది.దానిని వేంగీచాళుక్య లిపి అని దానిపేరు.నన్నయకు ముందు శాసనములన్నియు వేంగీచాళుక్య లిపిలోనే వ్రాయబడినవి.ఆ లిపి చతురస్రముగాను, తలకట్లు గీతలవలె నుండుటచేతను, వ్రాతసాధనములు మారుటచే సంస్కరనము ఆవశ్యకమయ్యెను. నన్నయ కాలమునకే తాటాకు గంటము వ్రాతకు సాధనముగా ఏర్పడినది. తాటాకుపైనగాని గంటముతో వ్రాయునప్పుడు తలకట్లు అడ్డుగీతలుగా వ్రాసిన తాటాకు చినిగిపోవును. తలకట్టు-అనగా ఆకారమునకేగాక, ఆ దీర్ఘము వ్రాయవలసివచ్చినప్పుడు, ఆ దీర్ఘమును ఇప్పటివలె ా వ్రాయక --- అని నిలువుగీతగా వ్రాసెడివారు.ఒ కార చిహ్నమగు కొమ్ము ''' ొ''' ''' ా ''' అని గీతగానే యుండేది. వర్గ సంయుక్తాక్షరములు-జ్క, ణ్బ, న + తవత్తు, ం + ప వత్తు, ఞ + చ వత్తు -అను రీతిగా వ్రాసెడివారు. ఇట్టివి తాటియాకుపైన వ్రాయుట కష్టసాధ్యము.
 
నన్నయ వీటిని పరిశీలించి, తెలుగు లిపిని చతురస్ర స్వరూపమునుండి గుండ్రదనమునకు మార్పు చేసి పలు మార్పులు చేసినాడు. అవే తలకట్టు నకు ా గాక ప్రస్తుత తలకట్టు లాగా, కొమ్ముల మార్పు ప్రస్తుత వరుసగా, ర్గ సంయుక్తాక్షరములు అనునవి పంకచంక-ఖండ-నంద-డింబ-అనురీతి పూర్ణబిందువులుగా వ్రాయుట, రకార సంయుక్తాక్షరములను ర్క,ర్త,ర్చ మొదలగునవి అర్క-అర౬, కర్త-కర్౬, కర్చ-కర౬ గా వ్రాయుట మొదలుచేసినాడు. ౬ ఈ చిహ్నమునకే '''వలపలగిలక''' అని పేరు. ఈవలపలగిలక వలన రకార సంయుక్తాక్షరములుగా నుండక ఏకాక్షరములుగా ఉండును.ఇందువలన లిపికి సమత ఏర్పడినది, అంతకుముందున్న ఒక అక్షరము శకటరేఫముకన్నా భిన్నమైనది, ష్జ గా పలుకునదానిని "డ" గా మార్చినాడు. ఈ మార్పుల వలన తెలుగు లిపికి గుండ్రనిదనము, సౌందర్యము చేకూరునవి. తెలుగులిపినందు ఈమార్పులు చేయుటయేకాక నన్నయ, తాను వ్రాసిన '''నందంపూడి శాసనము''' నందు తాను ప్రతిపాదించిన సంస్కరణలిపిని ప్రవేశపెట్టి-ఆవెనుక తాను వ్రాసిన [[మహా భారతము]] ను ఆలిపిలోనే వ్రాసినాడు.తెలుగు అక్షరములకు అంతకుముందులేని రమ్యతను-లేక మనోహరత్వమును తాను ప్రతిపాదించుటచేత-నన్నయ తెలుగులిపి సౌందర్యమును వ్యక్తపరిచినాడు.అర్ధ ముక్తి శబ్ద సంబంధమైనది అక్షర రమ్యత లిపి సంబంధమైనది-రెండింటి సమ్మేళనము నన్నయ కవితలో కలదు.
 
తెలుగులిపి సౌందర్యమును తరతరాలుగా వంశపారంపర్యముగా, చెక్కుచెదరక నిల్పి, సంరక్షించినవారు శిష్టుకరణ కులజులు.వీరాంధ్రదేశమున నేటి [[శ్రీకాకుళము]] లో నివసించెడి కరణలు.వీరు చిత్రగుప్తుని వమ్శీయులగుటచే తెలుగు లిపిని ఒక కళలాగా ఉపాసించినారు. వీరి తాళపత్ర లేఖన నైపుణ్యమసమానమైనది. వీరినే శిష్టలేఖకులు అందురు. పూర్వకాలమున కవికి ఎంత ప్రాధాన్యము కలదో లేఖకునకు అంతప్రాధాన్యము కలదు. మునుపు కవిత్వము చెప్పుట-లేఖకుడు వ్రాయుటేకాని-కవి తాను స్వయంగా వ్రాయు ఆచారములేదు. [[తిక్కన]] కు గురుబాధుడను లేఖకుడు ఉండినట్లు మనకు తెలియుచున్నది. తెలుగులిపి సౌందర్యమునకు ముగ్ధులై తంజావూరి మహారాష్ట్ర రాజులు-వారిలో ముఖ్యముగా [[శివాజీ రాజా]] తెలుగు లేఖకులకు తన రాజ్యాంగమున నొక ప్రత్యేక నిబంధనము చేసియున్నాడు.వందలకొద్దీ తాళపత్రాలను వీరిచే వ్రాయించినాడు.
 
మౌర్యులకాలపు (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీలిపి పట్టికలోని రెండవ వరుసలో ఇవ్వబడింది. అటు పిమ్మట భట్టిప్రోలు ధాతుకరండముపై కొద్దిమార్పులుగల బ్రాహ్మీలిపి మూడవ వరుసలో చూడవచ్చును.
Line 120 ⟶ 126:
!colspan="2" style="font-weight:normal;"| -
|}
 
===తెలుగులిపి-కవుల వర్ణనలు===
తెలుగు సాహిత్యములో తొలుత లిపి ప్రసక్తి తెచ్చినవాడు మంచెన. అతడు '''కేయూర బాహు''' చరిత్రలో కృతిపతి గుండమంత్రి ప్రతిభను తెలుగు లిపి గుండ్రత్వము సౌందర్యముతో పోల్చినాడు. అటుపై వెన్నెలకంటి సిద్దనమంత్రి, అటుపై జక్కన తెలుగు లిపిని ఆనిముత్యములతో పోల్చినారు.వాగ్దేవి లిపి స్వరూపిణి. అఖిలవర్ణమయిమగు ఆమె మూర్తిని అప్పకవి వర్ణించినాడు (అప్పకవీయము -2-393).
 
అ- తలకట్టు
ఆ - నుదురు
ఇ,ఈ- చెవులు
ఉ,ఊ- కన్నులు
ఋ,ౠ- చెక్కులు
ఌ ౡ- దంతములు
ఏ,ఐ - భుజములు
ఓ,ఔ- కక్షములు
అం- కంఠము
అః- స్తనములు. (మొత్తం 16)
 
క వర్గము-
చ వర్గము- చేతుల వ్రేళ్ళు (10)
 
ట వర్గము-
త వర్గము- పృష్ఠము (10)
 
ప వర్గము- ఉదరము (5)
అంతస్థలు,ఊష్మములు పాదములు (9)
 
మొత్తము అక్షరములు 50- సంస్కృత వర్ణ సమామ్నాయము 50 అక్షరములు. సరస్వతి లిపి స్వరూపి. ఒకచేత ఆమెకు పుస్తకము కలదు. లిపి స్వరూపము పుస్తకము.అదియే సరస్వతీ స్వరూపము. అందువల్నా మనము విజయ దశమినాడు పుస్తకమునకు పూజింతుము.
 
 
'''గుణింతము-స్త్రీ వర్ణన''' :
 
గుణింతములో స్రీ వర్ణన చేసిన మహాకవి ప్రౌఢిమ చూడుడు.అకారాది గుణింతాలతో స్త్రీ వర్ణన:
 
తలకట్టు - స్త్రీ నొసలు
దీర్ఘము (ా)- కనుదోయి
గుడుసు-గుండ్రము (ి) -నాభి
గుడిదీర్ఘము (ీ)- నూగారు
కొమ్ము - రెండు చేతులు
వట్రసుడి (ు)- నితంబము
ఏత్వము- జడ
ఐత్వము- తొడలు
ఓత్వము - కనుబొమలు
ఔత్వము- చెవులు
సున్న- నడుము (శున్యము)
విసర్గ ః - స్తనములు.
వలపలగిలక ౬- భుజములు.
సంస్కృతములో లిపి శబ్దము స్త్రీలింగము.
 
 
== తెలుగు లిపి గురించి కొన్ని అభిప్రాయాలు ==
Line 126 ⟶ 178:
== మూలాలు ==
{{మూలాలజాబితా}} ఆఋఓఝూ
* 1971 భారతి మాస పత్రిక- వ్యాసము -తెలుగు లిపి-వ్యాస కర్త-నిడదవోలు వేంకటరావు.
 
== వనరులు ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_లిపి" నుండి వెలికితీశారు