"కాన్సర్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(Normal_cancer_cell_division_from_NIH.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ymblanter. కారణం: (per c:Commons:Deletion requests/Files on User:Josve05a/Jeanne Kelly of Aaardvark Inc.).)
చి
ట్యాగు: 2017 source edit
సాధారణంగా మన శరీరంలో [[కణ విభజన]]లు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల [[కణాలు]] చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని [[కేన్సర్]] అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు.
క్యాన్సర్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి.క్యాన్సర్‌ మహమ్మారి ఏటా రూ.41, 17, 000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.మూడింట రెండొంతుల క్యాన్సర్‌ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి.అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయంచేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.
 
== పేర్ల వెనక కథ ==
 
ఇంగ్లీషులో 'టుమర్‌' అన్న మాటకి 'వాపు' అన్నది వాచ్యార్ధం. కణాలు విభజన చెంది అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపు ఇది. అప్పుడప్పుడు ఈ వాపు చిన్న 'కాయ' రూపంలో తారస పడుతుంది. అప్పుడు దానిని 'కంతి' అంటారు. ఈ కంతి అన్నది రెండు స్వరూపాలలో తారసపడవచ్చు: నిరపాయమైన కంతులు (benign tumors), ప్రమాదమైన కంతులు (malignant tumors) . నిరపాయమైన కంతులని మూడు లక్షణాల ద్వారా గుర్తు పట్టవచ్చు.
* అవి నిరవధికం (unlimited) గా, దూకుడుతనం (aggressiveness) తో పెరిగిపోవు
* అవి ఇరుగు పొరుగు కణజాలం (tissue) మీదకి విరుచుకు పడవు (do not invade neighboring tissue)
* శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు (do not metastasize)
'''అయితే'''
విటమిన్ B 17 లోపం అనే ఒక్ వాదన ఉంది. <ref>https://www.google.co.in/imgres?imgurl=https://images-na.ssl-images-amazon.com/images/I/519aXD3-uVL._SX258_BO1,204,203,200_.jpg&imgrefurl=https://www.amazon.in/World-Without-Cancer-Story-Vitamin/dp/1943499039&h=260&w=260&tbnid=jYjlgPxET0DaDM:&q=world+without+Cancer+book&tbnh=122&tbnw=122&usg=AFrqEzd7MpH7xli1QO2ZrJhq3Base_mJqA&vet=12ahUKEwjwgN-Gv7_dAhWJOI8KHZJ0BQ8Q_B0wHHoECAYQFA..i&docid=OE8CgM_-KM3c_M&itg=1&sa=X&ved=2ahUKEwjwgN-Gv7_dAhWJOI8KHZJ0BQ8Q_B0wHHoECAYQFA</ref>. అంతే గాని ఇది జబ్బు కాదని. ఒక రచయిత '''world without Cancer book''' పుస్తకాన్ని రాశాడు.
 
కొన్ని రకాల కేన్సర్ల పేర్లు -ఓమా శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి (tumor) రూపంలో ఉందని అర్ధం. [[మెలనోమా]] (melanoma) అంటే మెలనోసైట్‌ (melanocytes) లు (అంటే మెలనిన్‌ కణాలు) విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్‌ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించ గలవు. అందుకనే [[పుట్టుమచ్చలు|పుట్టుమచ్చల]] కైవారం అకస్మాత్తుగా పెరిగిందంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2455286" నుండి వెలికితీశారు