బంగారం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 7:
శిలాజ త్రవ్వక నిపుణులు స్పానిస్ లోని 40,000 ఏళ్ల క్రితం పాలియోలిథిక్ కాలానికి చెందిన మానవులు నివసించిన గుహలో స్వాభావిక బంగారుముక్కలను గుర్తించారు. కొందరి అంచనా ప్రకారం బంగారం క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలనాటికి సిర్కా (Circa ) లో గుర్తించినట్లు తెలుస్తున్నది. క్రీ.పూ.3000 నాటికి పురాతన ఈజిప్టు సిర్కాలోని ఫారోలు మరియు దేవాలయ పూజారులు బంగారాన్ని ఆభరణాలుగా ధరించారని తెలుస్తున్నది. అయితే ఆకాలంలో వస్తుమారకానికి బంగారాన్ని కాక [[బార్లీ]]ని మారక ద్రవ్యంగా వాడేవారు. మొట్టమొదటి సారిగా పశ్చిమ టర్కీకి చెందిన లైడియ (lydia ) లో బంగారాన్ని ధనంగా క్రీ.పూ. 700 సంవత్సరం నుండి ఉపయోగించడం మొదలైనది. పురాతన నాగరికతకాలం నాటి చేతివృత్తుల అలంకార కళాకారులు దేవాలయాలను, రాజవంశీయుల సమాధులను అత్యంత శోభాయమానంగా బంగారంతో అలంకరించేవారు. ఈజిప్టులో 5000 వేల సంవత్సరాల క్రితమే బంగారపు వస్తువులను తయారుచేసి వాడినట్లుగా తెలుస్తున్నది. క్రీ.శ.1922 లో ఈజిప్టు రాజు తుతంఖామన్ (Tutankhamun ) సమాధిలో ఉంచిన బంగారువస్తువులను హోవార్డ్‌కార్టర్ మరియు లార్డ్ కార్నర్‌వోన్ అనేవారు గుర్తించారు.
 
==బంగారపు రసాయనిక, భౌతిక గుణ గణాలు ==
బంగారం చాలా వరకు చాలా ఆమ్లాల విడి చర్యకు గురికాదు, కరుగదు కానీ నైట్రిక్ ఆమ్లం, మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపి తయారుచేసిన ఆక్వా రెజియా అనే ద్రవంలో కరుగుతుంది. పై రెండు ఆమ్లాల మిశ్రమ ద్రవం బంగారాన్ని టెట్రా క్లోరైడి అయానుగా పరివర్తనం చెందిస్తుంది. అలాగే సైనైడ్ యొక్క క్షార ద్రావణాలలో బంగారం కరుగుతుంది. బంగారం పాదరసంలో కరుగుతుంది. బంగారం పాదరసంలో కరుగుట వలన ఏర్పడిన మిశ్రమ ధాతువును అమాల్గం (Amalgam) అంటారు. తెలుగులో ''పారదమేళనము '' లేదా రసమిశ్రలోహము మరియు నవనీతమూంటారు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పాదరసంలో బంగారం కరిగి రసమిశ్రలోహము మిశ్రమ ధాతువుగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ఆమాల్గం నత్రికామ్లం (నైట్రిక్ ఆసిడ్) లో కరుగదు. (వెండి మరియు క్షారలోహాలు నత్రికామ్లంలో కరుగుతాయి). ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల పలుచని రేకు /పత్రంలా సాగ గొట్టవచ్చును. అత్యంత పలుచని రేకులుగా సాగే భౌతిక ధర్మాన్ని కలిగివున్నది. అంతే కాదు కేశముల కన్న సన్నని తీగెలుగా సాగుతుంది. ఒక ఔన్సు బంగారం నుండి 50 మైళ్ళ పొడవున్న తీగెను తీయవచ్చును. కేవలం ఒకగ్రాము భారమున్న బంగారాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యంగల రేకుగా సాగతీయ వచ్చును. పలుచగా సాగగొట్ట బడిన బంగారు పత్రంనుండి వెలుతురు పచ్చని ఛాయగలిగిన నీలిరంగుగా వెలువడుతుంది. ఒకగ్రాము బంగారాన్ని 20 మైక్రో మీటర్లు మందమున్న, 165 మీటర్ల పొడవున్న తీగెలా సాగతీయ వచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/బంగారం" నుండి వెలికితీశారు