పాండవ వనవాసం: కూర్పుల మధ్య తేడాలు

చి పరిచయం
పంక్తి 22:
 
== పరిచయం ==
పౌరాణికాలు తెలుగువారి సొత్తు. అలాగే పౌరాణిక పాత్రలను సమర్ధవంతంగా పోషించగల నటులు మన దగ్గరే ఉండటం నిజంగా మనకు గర్వ కారణమే. ఎన్ టి ఆర్ వంటి మహా నటుడు తెలుగువాడు కావడం జాతి చేసుకున్న అదృష్టమైతే, అనితరసాధ్యమైన రీతిలో ఆయన పౌరాణికాలను పోషించి తెలుగువారి స్థాయిని పెంచారు. అందుకే పౌరాణిక చిత్రం అనగానే అందులో ఎన్ టి ఆర్ ఉన్నారా అని ప్రశ్నించేవారు సగటు ప్రేక్షకులు. తన నటనతో పౌరణిక పాత్రలకు అంత ప్రతిష్ట తీసుకొచ్చారు ఎన్ టి ఆర్. ఆయన నటించిన పాండవ వనవాసం చిత్రం పౌరాణికాలలో తలమాణికంతలమానికం అని చెప్పవచ్చు. తెలుగువారు మాత్రమే ఇలాంటి పౌరాణికాలను గొప్పగా తీయగలరు అనే భావనను చూసిన ప్రతీసారీ కలిగించే ఆ చిత్ర విశేషాలు:-
 
మహా భారతంలోని అజ్ణాతవాస ఘట్టంతో నర్తనశాల చిత్రం రూపు దిద్దుకోగా (11-10-1963 విడుదల), వనవాస వృత్తాంతంతో (కొంత వరకూ సభా పర్వం కలిపి) పాండవ వనవాసం సినిమా తయారైంది. ఈ రెండు చిత్రాలకూ కమలాకర కామేశ్వర రావు గారు దర్శకులు కావడం గమనార్హం. ఆ సినిమాలో విజయుడిగా నటించిన ఎన్ టి ఆర్ ఇందులో భీమసేనుడిగా నటించారు. అంతకుముందు అనేక పౌరాఇక పాత్రలను పోషించిన ఎన్ టి ఆర్ ఈ సినిమాలో తన అభినయంతో భీముని పాత్రకు వన్నె  చేకూర్చి పాండవ వనవాసం చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోవడానికి కారకులయ్యారు. అన్నమాట జవదాటని అనుంగు సోదరుడిగా నడకలో, చేతల్లో, మాటల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అనితర సాధ్యమైన రీతిలో నటించారు ఎన్ టి ఆర్. ముఖ్యంగా మాయా జూద సన్నివేశం, ద్రౌపదీ వస్త్రాపహరణం సన్నివేశాల్లో ఎన్ టి ఆర్ రౌద్ర రసాన్ని అభినయించిన తీరు అభినందనీయం.
పంక్తి 36:
ధారుణి రాజ్య  సంపద, కురు వృద్ధుల్ అంటూ అక్కడ ప్రతిజ్ణలు చేసిన రెండు పద్యాలకూ ఎన్ టి ఆర్ చేసిన రౌద్రాభినయం వంద ఏళ్ళ తర్వాత కూడా ఎవ్వరూ చేయలేని అపురూపాభినయం. ఘోషయాత్ర సందర్భంలో గంధర్వునికి బంధీగా చిక్కిన దుర్యోధనుని విడిపించమని ప్రక్కనే ఉన్న భీమసేనునితో చెబుతూ అన్న ధర్మజుడు అనునయంగా భీముని తాకబోగా ఆ చేతికి అందక అలవోకగా ప్రక్కకు ఒరుగుతాడు ఎన్ టి ఆర్. భీమసేనుని మనస్థత్వాన్ని తెలియచేసే ఆ చర్య ఓ అద్భుతం. పాత్రలో ఒదిగిపోయే ఆ తీరు మహాద్భుతం.
 
దుర్యోధనుని విడిపించిన తర్వాత బంధీగా ఉన్న కురు రాజును చూచి ఎన్ టి ఆర్ చెప్పిన డైలాగులు దుర్యోధనుడే కాదు, చూసిన ప్రేక్షకులు సైతం ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారంటే ఆ ప్రాభవం ఎన్ టి ఆర్ స్వంతం. దుర్యోధనుని బంధనాలను విడువమని ధర్మరాజు ఆజ్ణాపించినప్పుడు ఇష్టం లేని బెట్టుతనం మొహంలో ప్రతిఫలింపచేసిన వైనం నయనానందకరం. అడవిలో భీముడు కిమ్మీరుని వధించటం, ఆంజనేయుడు భీముని పరీక్షించే సమయంలో ఆంజనేయుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాభినయం, భార్యను అవమానించిన సైంధవుని పరాభవించిన సందర్భంలోనూ, అలాగే పతాక సన్నివేశాల్లోనూ మహోదృతంగా సాగే నదిలా ఎన్ టి ఆర్ నటన పరవళ్ళు త్రొక్కింది. భీమసేనుడి పాత్రలో ఎన్ టి ఆర్ చేసిన పరకాయ ప్రవేశం చరిత్ర మరువని అపురూప స్మృతి చిహ్నం. చిత్రం ఆసాంతం ఎన్ టి ఆర్ అభినయంతో ప్రేక్షకులు ఓ విధమయిన ఉద్వేగానికి లోనయిపోవడం జరిగింది. కమలాకర కామేశ్వర రావుగారు సైతం ఆ ట్రాన్స్ లోంచి చాలాకాలం బయటపడలేకపోయారుబయటపడలేక పోయారు.
 
అలాగే సంగీత దర్శకుడు ఘంటసాల రీ రికార్డింగులో ఎన్ టి ఆర్ కు ప్రత్యేకంగ మ్యూజిక్ బిట్ కంపోజ్ చేశారు. ఎన్ టి ఆర్ కనిపించినప్పుడల్లా ఆ బిట్ ప్లే చేశారు ఘంటసాల.
 
హావభావ ప్రదర్శనలో , డైలాగ్ మాడ్యులేషన్లో ఎన్ టి ఆర్ కు ధీటుగా నిలిచి దుర్యోధనుడి పాత్రను ఎస్ వి ఆర్ పోషించారు.
 
కురు సభలో ఎన్ టి ఆర్, ఎస్ వి ఆర్ పోటీపడి నటిస్తూ పాడిన పద్యాలకు తమ గాత్రాలతో మరింత గంభీరత్వాన్ని తీసుకొచ్చారు ఘంటసాల, మాధవపెద్ది.
పంక్తి 54:
శశిరేఖ, అభిమన్యుల ప్రణయ గాధతో రూపు దిద్దుకున్న మాయా బజార్ చిత్రాన్ని తెలుగువారెవరూ మరిచిపోలేరు. అంత గొప్పగా ఆ చిత్రాన్ని తీర్చి దిద్దారు కె వి రెడ్డి. అదే కధను ఈ సినిమా ద్వితీయార్ధంగా ఎన్నుకోవడం ఒక సాహసమే. అయినా కె వి రెడ్డి స్కూల్ విధ్యార్ధే కనుక ఎలాంటి లోటూ లేకుండా చిత్రీకరించారు కామేశ్వర రావు. ఇందులో శశిరేఖగా ఎల్ విజయ లక్ష్మి, అభిమన్యుడుగా హరనాధ్, లక్ష్మణకుమారుడిగా పద్మనాభం, ఘటోత్కచుడిగా సత్య నారాయణ నటించారు. శశిరేఖ, అభిమన్యులపై చిత్రీకరించిన రాగాలు మేళవింప, నా చందమామ పాటలు కూడా ఆకట్టుకున్నాయి.
 
ఈ సినిమాలో దుర్యోధనుడిగా ఎస్ వి ఆర్, శకునిగా లింగమూర్తి, ధర్మరాజు గా గుమ్మడి, భీముడిగా ఎన్ టి ఆర్,  అర్జునుడిగా బాలయ్య, ద్రౌపదిగా సావిత్రి, దుశ్శాసనుడిగా మిక్కిలినేని, ఆంజనేయుడిగా అజిత్ సింగ్, కృష్ణుడిగా కాంతారావు, చిత్రసేనుడిగా ధూళిపాళ, కర్ణుడిగా ప్రభాకర రెడ్డి, దూర్వాసుడిగా ముక్కామల, అభిమన్యుడిగా హరనాధ్, శశి రేఖగా ఎల్ విజయ లక్ష్మి, ఘటోత్కచుడిగా సత్యనారాయణ, సత్య భామగా వాణిశ్రీ, కిమ్మీరుడిగా నెల్లూరు కాంతారావు, సైంధవుడిగా రాజనాల, బ్రహ్మాండం గా రమణా రెడ్డి, అండం గా అల్లు రామ లింగయ్య, పిండం గా సీతారాం, విదురునిగా నాగయ్య, భానుమతిగా సంధ్య
, లక్ష్మణ కుమారుడిగా పద్మనాభం ఇంకా ఇతర పాత్రలలో రాజ సులోచన, ఋష్యేంద్రమణి నటించారు.
 
తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని పాండబేర్ బనవాస్ పేరుతో బెంగాలీలోకి అనువదించబడిన తొలి తెలుగు చిత్రం ఇదే. చిత్ర నిర్మాత ఏ ఎస్ ఆర్ ఆంజనేయులు, నవ శక్తి గంగాధర రావు ఈ సినిమాని అనువదించారు. గంగాధరరావు సోదరుడు పర్వతనేని సాంబశివరావు డబ్బింగ్ బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలలు కలకత్తాలో ఉండి డబ్బింగ్ చేశారాయన. ఒక తెలుగు చిత్రం డబ్బింగ్ జరుగుతోందని విని సత్యజిత్ రే, ఉత్తమ కుమార్ వంటి ప్రముఖులు డబ్బింగ్ థియేటర్ కు రావడం విశేషం. అంతవరకూ బెంగాళీ పాద ధూళి కధలు తెలుగు లో సాంఘికాలుగా కొన్ని వచ్చాయి. పాండవ వనవాసం తెలుగునుండి బెంగాళీకి అనువదించబడిన తొలి తెలుగు చిత్రం.
Line 64 ⟶ 65:
కవిత్రయం పద్యాలు కేవలం ఘంటసాల ఆలాపన వల్లే ఈనాటికీ సంగీత కచేరీల్లో రాణిస్తున్నాయి. ఎంతోమంది గాయనీ గాయకులకు నర్తనశాల, పాండవ వనవాసం చిత్రాల్లోని పద్యాలు బ్రతుకుతెరువును కల్పించాయండంలో అసత్యం లేదు. భీమసేనుని శౌర్య ప్రతాపాలను, దుర్యోధనుడి అసూయ ఈర్ష్యలను చక్కగా చేస్తాయా పద్యాలు. దుర్యోధనుడి పద్యాలు మాధవపెద్ది, భీముడి పద్యాలను ఘంటసాల రసోచితం గా పోటీలు పడి ఆలపించారు. పి లీల గారు పాడిన దేవా దీన బాంధవా మనసును ద్రవింప చేసే శోక గీతం. భీం ప్లాస్ రాగం లో అతి దీనం గా, మధురం గా ఉంటుందీ పాట. ఇది వింటుంటే పాంచాలి పరాభవ దృశ్యం కన్నులముందు ప్రత్యక్షమై కన్నీటి పర్యంతమౌతాము. పి లీల గారి గాత్రంలో జాలి, ఆవేదన, నిస్సహాయతా మిళితమై వ్యధాభరిత జలపాతంలా ప్రవహిస్తుంటాయి. ఈ పాటలో గజేంద్ర మోక్షం, ప్రహ్లాద రక్షణ గాధల్ని సముచితంగా ప్రస్తావించడం ఎంతో సముచితం గా ఉంటుంది.
 
పాండవ వనవాసం సంక్రాంతి కానుకగా 14-01-1965 న 23 కేంద్రాలలో విడుదలయ్యి, విడుదలైన అన్ని కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. రెండు కేంద్రాలలో రజతోత్సవాలు జరుపుకుంది. బెంగాళీ బాషలోకి డబ్ అయితే అక్కడ కూడా రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రానికి 1970 ప్రాంతాలలో ఎం ఎస్ రెడ్డి (మల్లె మాల) పంపిణీ హక్కులు తీసుకున్నారు. అప్పటికి ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయనను మళ్ళీ పరిశ్రమలో నిలబెట్టిన చిత్రమిది. కొమ్మినేని వేంకటేశ్వర రావు గారు 1990 ప్రాంతాలలో ఈ చిత్రం మళ్ళీ విడుదల చేశారు. ఆ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్లను రంగుల్లో డిజైన్ చేయించారు. శాటిలైట్ ప్రదర్శనల్లో కూడా ఈ చిత్రం ఆర్ధిక విజయాన్ని సాధించింది. ఈ చిత్ర నిర్మాతలు తమ తదుపరి చిత్రంగా అక్కినేని, జమునలతో బంధిపోటు దొంగలు చిత్రం తీశారు.
 
==సంక్షిప్త చిత్రకథ==
"https://te.wikipedia.org/wiki/పాండవ_వనవాసం" నుండి వెలికితీశారు