నేరెళ్ళ వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
పరిచయ పాఠ్యం మరికొంచెం
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
}}
 
'''నేరెళ్ళ వేణుమాధవ్''' ( [[డిసెంబరు 28]], [[1932]] - [[జూన్ 19]], [[2018]] ) [[తెలంగాణ]]కు చెందిన ప్రఖ్యాత [[మిమిక్రీ]] కళాకారుడు.<ref>{{Cite web|url=http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=4|title=మూగవోయిన వేయి గళాలు|date=20 June 2018|accessdate=20 June 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180620082008/http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=4|archivedate=20 June 2018}}</ref><ref>{{Cite web|url=http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=7|title=ప్రతిధ్వనించిన ఖ్యాతి|date=20 June 2018|accessdate=20 June 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180620082453/http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=7|archivedate=20 June 2018}}</ref><ref>{{Cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=Hyderabad&info=hyd-gen1|title=వేణు గాత్రంలో వేల గళాలు|date=20 June 2018|accessdate=20 June 2018|website=Eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180620081335/http://www.eenadu.net/district/inner.aspx?dsname=Hyderabad&info=hyd-gen1|archivedate=20 June 2018}}</ref> వీరికి ''ధ్వన్యనుకరణ సామ్రాట్'' అనే బిరుదు కూడా ఉంది. 1947 నుంచే ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు.<ref>{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201808/magazine.html#/40|title=ఆయన ఓ అద్భుతం|date=1 August 2018|accessdate=17 September 2018|website=http://ramojifoundation.org|publisher=రామోజీ ఫౌండేషన్|last=మిమిక్రీ|first=శ్రీనివాస్}}</ref> ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు.<ref>{{Cite web|url=http://lit.andhrajyothy.com/sahityanews/nerella-venumadhav-is-died-13569/page/1|title=మూగబోయిన.. వేయి గొంతుక|date=20 June 2018|accessdate=20 June 2018|website=Andhrajyothi|publisher=ఆంధ్రజ్యోతి}}</ref>
 
==జీవిత సంగ్రహం==
[[వరంగల్]] పట్టణం లోని మట్టెవాడలో శ్రీహరి మరియు శ్రీలక్ష్మి దంపతులకు [[1932]] [[డిసెంబరు 28]]న జన్మించారు. తండ్రి గారు ప్రముఖ వ్యాపారవేత్త. [[సాహిత్యం]]<nowiki/>లో మంచి అభినివేశం ఉండడం వల్ల, ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అట్లా వీరింట్లో బస చేసిన వారిలో చెళ్ళపిళ్ళ[[చెళ్లపిళ్ల వెంకట శాస్త్రివేంకటశాస్త్రి]], వావిలకొలను[[వావిలికొలను సుబ్బారావు]], [[వడ్డాది సుబ్బారాయుడు]], [[రాయప్రోలు సుబ్బారావు]], [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]], [[కాశీ కృష్ణాచార్యులు]], యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి ఉద్ధండులున్నారు. వీరితో జరిగిన సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ గారి మీద పడింది. తన 8 వ ఏట లక్ష్మయ్య పంతులు గారి వద్ద అక్షరాభ్యాసం చేసి, రాఘవయ్య మాష్టారు గారి వద్ద కొంతకాలం ప్రైవేటుగా చదివి గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతిలో చేరి బోల్తా ఉభాయిదా (పెద్ద బాలశిక్ష) చదవడం ప్రారంభించారు. సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ కాలంలో వచ్చిన [[చిత్తూరు నాగయ్య]] గారి [[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]], [[వందేమాతరం (1985 సినిమా)|వందేమాతరం]], [[దేవత (1965 సినిమా)|దేవత]], [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]], [[బమ్మెర పోతన|పోతన]], [[వేమన]] సినిమాలు చూసి నాగయ్య గారిమీద అభిమానం పెంచుకున్నారు. ఇవేకాకుండా వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య గారలు నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలయ్యింది వారి మిమిక్రీ ప్రస్థానం. ఏవీవీ (ఆంధ్ర విద్యాభివర్ధిని) హైస్కూల్లో చదువుతున్నప్పుడు హరి రాధాకృష్ణ మూర్తి గారి శిష్యరికంలో [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారి ప్రహసనాల్లో నటించడం ద్వారా తన రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు. మిగతా గురువులు కందాళై శేషాచార్యులు గారు, యద్దనపూడి కోదండ రామ శాస్త్రి గారు వీరి అభివృద్ధికి తోడ్పడ్డారు. 1950 లో మెట్రిక్యులేషన్, 1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు గారు మిగతా లెక్చరర్లు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ గారికి ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ ( బర్సరీ ) మంజూరు చేశారు. దానితో వీరు ముప్పయి [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] సినిమాల్ని తనివిదీరా చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపిస్తే, రామనర్సు గారు పరమానందభరితులై "యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్" అని, ఇకనుండి నీకే అవసరం వచ్చినా నువ్వెవరినీ అడగకు. నా పెద్ద కుమారుడు విఠల్ ( బీ. పీ. ఆర్. విఠల్ గారు అనంతరకాలంలో [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు) అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా ఎదిగేలా చేసాయి. 1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవెశించిప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ మరియు శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం పాసయ్యారు. తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. చెప్పుకోదగిన మలి ప్రదర్శన 1953 లో [[రాజమండ్రి]]<nowiki/>లో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీ గారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు,స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు. [[తెనాలి]] పట్టణంలోని అభ్యుదయ భావాలున్న స్వాతంత్ర్య సమరయోధులు కొల్లా కాశీవిశ్వనాధం, తయారమ్మ దంపతుల కుమార్తె శోభావతి గారితో వీరి వివాహం 3-2-1957 న జరిగింది. దీనికి సంధాన కర్తగా వ్యవహరించిన వారు స్థానం నరసిం హారావు గారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు శ్రీనాథ్, రాధాకృష్ణ. ఇద్దరు అమ్మాయిలు లక్ష్మీతులసి, వాసంతి.
 
వేణుమాధవ్ సినిమా, సాహిత్యం, కళలు లాంటి పలురంగాల ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/నేరెళ్ళ_వేణుమాధవ్" నుండి వెలికితీశారు