అణువు గర్భంలో ధనావేశమైన (positively charged) కణిక (nucleus) ఉంటుంది. ఈ [[కణిక]] లేక [[కేంద్రకం]]లో [[ప్రోటాన్]]లు (protons), నూట్రానులు (neutrons) అనే పరమాణువులు (atomic particles) ఉంటాయి. ఈ కణిక చుట్టూ పరివేష్టితమై ఒక ఎలక్ట్రాను మేఘం (electron cloud) ఉంటుంది. కణికలో ఎన్ని ధన విద్యుదావేశమైన (positively charged) ప్రోటానులు ఉన్నాయో ఈ మేఘంలో అన్ని రుణ విద్యుదావేశమైన (negatively charged) ఎలక్ట్రానులు ఉంటాయి. అందువల్ల అణువుకి ఏ రకమైన విద్యుదావేశమూ ఉండదు.