బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
1971చివర వరకు జమీన్ రైతు లో పనిచేసి, మద్రాసులో USISలో బి.యస్.ఆర్. కృష్ణ సంపాదకత్వంలో వెలువడుతున్న American Reporter పత్రిక లో పనిచేశాడు. ఆ ఉద్యోగం ఒక ఏడాది మించి సాగలేదు.ఈ సమయంలోనే మద్రాసు GOMLలో పరిశోధించి "సి.పి. బ్రౌన్ జర్నలిజం చరిత్ర 1831-1857" పుస్తకాన్ని రాసి Nellore Historical Society పక్షాన అచ్చువేశాడు.1974లో మద్రాసు నుంచి వెనక్కి వచ్చి, నెల్లూరు వారపత్రిక యూత్ కాంగ్రెస్ లో సంపాదకుడుగా చేరి ఒక యాడాది పని చేసాడు. ఈ సమయంలోనే డాక్టర్ జే.మంగమ్మ పుస్తకం " బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియా" ను ప్రచురించాడు.
 
=== శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు అధికారిగా (1975-1979) ===
బండి గోపాలరెడ్డి 1975 లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో తెలుగుశాఖలో C.P.Brown Project లో రీసెర్చ్ ఆఫీసర్ గా నియమించబడ్డాడు.
 
ఈ కృషిలో భాగంగానే "బ్రౌన్ జాబులు, ఆధునికాంధ్ర సాహిత్య శకలాలు " పుస్తకం వెలుగు చూచింది(1977 ఫిబ్రవరి). దీనికి ప్రొఫెసర్ జి.యన్. రెడ్డి ప్రధాన సంపాదకుడుగా, బంగోరె సంపాదకుడుగా వ్యవహరించారు వీరిద్దరు కలిసి " Literary auto biography of C.P.Brown" ను యస్.వి. విశ్వవిద్యాలయం పక్షాన 1978లో తెచ్చారు. 1977లో ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే 'ఆంద్ర గీర్వాణ ఛందము"ను వెలువరించాడు.ఈ పరిశోధన లోంచే "బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు: కడప జాబుల సంకలనం" కూడా తయారుచేసి, అచ్చువేసాడు. మద్రాసు ఆర్కైవ్స్ లో పరిశోధించి, "మాలపల్లి నవలఫై ప్రభుత్వనిషేధాలు"పుస్తకం తెచ్చాడు(1979). ఇది తన సొంత ప్రచురణ. ఈ ప్రాజెక్ట్ కాల పరిమితి ముగియడంతో నెల్లూరు వచ్చేసాడు.
 
=== వేమన ప్రాజెక్టు, సి.ఆర్.రెడ్డి పరిశోధన ప్రాజెక్టు (1980-1982) ===
"https://te.wikipedia.org/wiki/బండి_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు