హడూప్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
అంతేనా?
 
కాదు. హడూప్ కథ ఇంకా ఉంది. ఇలా హడూప్ లో దాచుకున్న పెద్ద పేద్ద దస్త్రాలలో ఉండే దత్తాంశాలతో కలనం చెయ్యవలసి వచ్చినప్పుడు ఏమి చేస్తాం? ఈ దస్త్రాలని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, మన కంప్యూటరులోకి దింపుకుని కలనం చెయ్యవచ్చు. ఇంత పెద్ద దస్త్రాలని అంతర్జాలం ద్వారా దింపుకుందుకి చాల సమయం కావాలి కదా. కనుక పని జరగడానికి ఎంతో సేపు పట్టడమే కాకుండా ఈ దత్తాంశ రవాణాకి బోలెడు ఖర్చు అవుతుంది. అందుకని కలనం చెయ్య గలిగే స్థోమతని దత్తాంశాలు ఎక్కడ ఉంటే అక్కడికే తీసుకెళితే? హడూప్ ఈ పని కూడ చేస్తుంది. ఇలాఇddehలా కలనం చెయ్యగలిగే స్థోమతని దత్తాంశాల దగ్గరకే తీసుకెళ్లడం అనేది “మేప్‌రెడూస్” అనే భాగం చేస్తుంది.
 
కనుక హడూప్ అంటే పెద్ద దస్త్రాలని దాచుకోడానికి వీలుగా నిర్మించిన పెద్ద పరిచారిక (సర్వర్), ఆ దత్తాంశాలతో జోరుగా, సమర్ధవంతంగా కలనం చెయ్యడానికి వీలయిన కలన కలశం (ప్రోసెసర్). ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్న పరిచారికని టూకీగా "హడూప్ ఫైల్ సర్వర్" అని అందాం. నిజానికి దీని అసలు పేరు హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సర్వర్ (HDFS). అలాగే ఈ ప్రత్యేక కలన కలశాన్ని "మేప్ రెడూస్" (MapReduce) అంటారు. ఈ రెండింటిని కలిపి హడూప్ (Hadoop) అంటారు.
"https://te.wikipedia.org/wiki/హడూప్" నుండి వెలికితీశారు