మొహర్రం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
 
==ఆషూరా==
యజీద్ సేనలు హుసేన్ ఇబ్నే అలీ గారిని చాలా క్రూరంగా హత్య చేసి వారి తలను ఇనుప చువ్వల పై ఊరేగిస్తూ ఒక ర్యాలి తీశారు, ఇప్పుడు దానిని తలపించేలా పీరీలు ఊరంతా ఊరేగించడం చాలా బాధాకర విషయం, ముస్లింలు ఆ పీరీల ను ఊరేగించడం ఒక మహా పుణ్య కార్యంగా భావిస్తుంటారు, కానీ అది పూర్తిగా ఇస్లామ్ ధర్మానికి విరుద్ధం అని ముస్లింలకు తెలియడం లేదు, అదేవిధంగా ఆ పీరీలు మోసే వారి కాళ్ళ కు నీళ్ళు పోయడం కూడా ఇస్లామ్ ధర్మమ్ లో ఎక్కడ లేదు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా దురాచారాలు ఇలా వాడుకలో ఉన్నవి, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం నుండే యౌమే ఆషురా నాడు అనగా మొహరం 9,10 లేకపోతే 10,11 దినములలో రోజా(ఉపవాస దీక్ష)పాటించే వారు, ఇది ప్రవక్తముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అసలు సున్నత్,
 
ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. [[ముహమ్మద్]] ప్రవక్త మనుమడైన [[హుసేన్ ఇబ్న్ అలీ]], [[కర్బలా యుద్ధం]]లో అమరుడైన రోజు. ముహర్రం నెలను, "[[షహీద్]] " ([[అమరవీరుల]] ) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. [[షియా ఇస్లాం]]లో ఈ ముహర్రం నెల మరియు "ఆషూరా", [[కర్బలా]] [[యుద్ధం]]లో మరణించిన వారి జ్ఞాపకార్థం, [[శోకం|శోక]] దినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ (శోక ప్రకటన) జరుపుతారు. తెలంగాణలో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను [[పీర్ల పండుగ]] అనే పేరుతో జరుపుకుంటారు. [[హైదరాబాద్‌]] పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, [[చార్మినార్]]‌, [[గుల్జార్‌ హౌస్]]‌, మీరాలం మండీ, [[దారుల్‌ షిఫా]]ల మీదుగా కొనసాగి [[చాదర్‌ ఘాట్‌]] వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన [[ఏనుగు]]పై ఈ వూరేగింపు సాగుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/మొహర్రం" నుండి వెలికితీశారు