ప్లాస్టిక్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
2405:204:631F:5289:0:0:1EC:D0A1 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2459848 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 6:
 
ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్‌ వాడకం లేని పర్యావరణ ప్రపంచం శ్రేష్టమైనది. .ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు ఏడు 7 మిలియన్‌ బ్యారెల్స్‌ పెట్రోలియం ఖర్చవుతుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియంను ఉపయోగించి ప్లాస్టిక్‌ తయారుచేసే ఖర్చుతో పాటు, పర్యావరణానికి హాని కలుగుతోంది. క్యారీబ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్‌ [[భూమి]]లో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
 
==సమస్యలు==
ప్లాస్టిక్ స్వతహాగా విషపూరితం లేదా హానికరం కాదు. కాని సేంద్రీయ మరియు రసాయనాల రంగులు, పిగ్ మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటి ఆక్సిడెంట్లు, స్టెబిలైజర్లు మరియు ధాతువులు వంటి ఎడిటివ్లతో ప్లాస్టిక్ సంచులు తయారుచేస్తారు. ప్లాస్టిక్ సంచులకి తళతళ లాడే రంగుని ఇవ్వడానికి ఉపయోగించే రంగులు మరియు పిగ్ మెంట్లు, పారిశ్రామిక ఎజోడైలు. ఇందులో కొన్ని కేన్సరు కలుగచేసే పధార్థాలు ఉన్నాయి. ఈ సంచులలో ఆహార పదార్థాలు కట్టినప్పుడు అవి కలుషితమౌతాయి. పిగ్మెంట్లలో ఉండే [[కాడ్మియం]] వంటి బరువైన ధాతువులు కూడా చేరి ఆరోగ్యానికి హానికరమౌతాయి
 
ప్లాస్టిసైజర్లు అనేవి తక్కువ బాష్పశీల స్వభావముగల సేంద్రీయ [[ఎస్టర్లు]]. అవి, ఆహార పదార్థాలకి శ్రవించిడం ద్వారా వలస పోగలుగుతాయి. ప్లాస్టిసైజర్లలో కూడా [[కేన్సరు]] కలుగ చేసే పదార్థాలని కలిగి ఉంటాయి. యాంటి ఆక్సిడింట్లు మరియు స్టెబిలైజర్లు సేంద్రీయ మరియు అసేంద్రీయ రసాయనాలు. ఇవి మేన్యుఫేక్చరింగు విధాన సమయంలో, ఉష్ణ వియోగం చెందకుండా రక్షిస్తాయి.
 
కాడ్మియం మరియు [[సీసం]] వంటి విషపూరిత ధాతువులు, ప్లాస్టిక్ సంచుల తయారీలో ఉపయోగించినప్పుడు కూడా స్రవించి ఆహార పదార్ధాలను కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులలో శోషించినపుడు, వాంతులు కలుగజేస్తుంది. గుండె పెద్దది కావడానికి కూడా కారణమౌతుంది. ఎక్కువ కాలం [[సీసము (మూలకము)|సీసానికి]] గురైతే, మెదడు టిష్యూలు క్షీణించి పోతాయి.
 
===సంచుల సమస్య===
ప్లాస్టిక్ సంచులని సరిగా పారవేయకపోతే, డ్రైనేజి సిస్టమ్ లోకి వెళ్ళి వాటిని మూసి వేయడం వలన అశుభ్రమైన వాతావారణాన్ని కలుగచేసి, నీటి ద్వారా వేచ్చే వ్యాధులను కలుగచేస్తాయి. పునర్వినియోగం /రంగుల ప్లాస్టిక్ సంచులు, భూమిలోనికి శ్రవించి మట్టిని, మరియు ఉప మట్టి నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాలని కలిగి ఉండవచ్చు. పునర్వినియోగం చేయడానికి ఉపయోగించే యూనిట్లు పర్యావరణపరంగా పటిష్టమైనవి కాకపోతే, పునర్వినియోగం సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయి. మిగిలిపోయిన ఆహారం కలిగిఉన్న లేదా ఇతర వ్యర్ధ పదార్ధాలతో కలిసిపోయి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. పాడవ్వని మరియు చొచ్చుకు పోనీయని స్వభావంకల ప్లాస్టిక్ కారణంగా, మట్టిలో పారవేస్తే, భూగర్భ జల ఏక్విఫెర్లు నింపకుండా అడ్డుకోవచ్చు. అంతే కాకుండా, ప్లాస్టిక్ ఉత్పాదనల లక్షణాలని మెరుగు పరచడానికి మరియు పాడయ్యే ప్రతి చర్యని నిరోధించడానికి సాధారణంగా ఎడిటివ్లను మరియు ప్లాస్టిసైజర్లను, ఫిల్లర్లను, ఆగ్నిమాపకాలని మరియు పిగ్ మెంట్లని ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
 
==పరిష్కారం==
"https://te.wikipedia.org/wiki/ప్లాస్టిక్" నుండి వెలికితీశారు