షోయబ్ ఉల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
శీర్షికలలో వికీలింకులు అనుమతించబడవు;
పంక్తి 15:
రయ్యత్ నిషేధానికి గురయ్యాకా షోయబుల్లా ఖాన్ స్వంత నిర్వహణలో ''ఇమ్రోజ్'' అనే దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు షోయబుల్లా స్వీకరించారు. రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి. [[పాకిస్తాన్‌]]కు కోట్లాది రూపాయలు ధనసహాయం చేయడం వంటి చర్యలు నిజాం, రాజ్యంలోని ప్రజలతో దాదాపుగా యుద్ధం చేస్తూ ఖాసింరజ్వీ పరిస్థితుల్ని మార్చేశారు. ఈ నేపథ్యంలో [[హైదరాబాద్]] రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు ఒక పత్రాన్ని తయారుచేశారు. నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే సరైన నిర్ణయమని ఆ పత్రం సారాంశం. ఈ పత్రాన్ని ''ఇమ్రోజ్'' పత్రికలో యధాతథంగా షోయబుల్లా ఖాన్ ప్రచురించారు. ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం భయపడ్డాడు. ఈ పరిణామాలే చివరకు ఆయన దారుణ హత్యకు కారణమయ్యాయి.
 
== [[బూర్గుల నరసింగరావు]] కథనం==
"షోయబుల్లాఖాన్ హత్య జరిగేనాటికి ఆయనకు రెండు సంవత్సరాల కూతురు, భార్య నిండు చూలాలు. షోయబ్ చనిపోయాక ఆ కుటుంబాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పునాదులు కోల్పోయిన ఆ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని కాయంగంజ్‌కు వలస వెళ్లింది. షోయబ్ తండ్రి నాలుగేళ్లపాటు వాళ్ల దగ్గర, వీళ్ల దగ్గర ఆర్థిక సాయం పొంది తర్వాత అతను కూడా కోడలి దగ్గరికి వెళ్లిపోయాడు.కాంగ్రెస్ నాయకులు [[మందుముల నర్సింగరావు]] బావ అయిన బూర్గుల రామకృష్ణారావు తమ తరఫున నిజాం దౌర్జన్యాలను ఎండగట్టే ఒక పత్రికుండాలని ఆరాటపడుతున్నాడు. షోయబుల్లాఖాన్ బూర్గుల సహాయంతో నగలునట్రా అమ్మి ‘ఇమ్రోజ్’ను స్థాపించారు. [[బూర్గుల రామకృష్ణారావు]] ఇంట్లో ఇమ్రోజ్ ఆఫీస్ ఉండేది. ఉర్దూలో ఇమ్రోజ్ అంటే ఈ రోజు. ఆయన దేన్నయినా గుడ్డిగా నమ్మేవాడు కాదు. చాలా తార్కిక దృష్టి. అందుకే సోవియట్ యూనియన్‌లో స్టాలిన్ నియంతృత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేవాడు. ప్రజాస్వామ్యంలేని సోషలిజం ఎందుకని వాదించేవాడు. ఎమ్‌ఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికను తెప్పించుకునేవాడు. ఆయన రాతలు చాలా సీరియస్సే కాని మనిషి మాత్రం సరదాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. సైద్ధాంతిక చర్చలప్పుడు కూడా అనవసర ఘర్షణలకు దిగేవాడు కాదు. చర్చను కూడా నెమ్మదిగా, నిలకడగా చేసేవాడు. జర్దాపాన్, సిగరెట్ ఆయన అలవాట్లు. షోయబుల్లాఖాన్ మంచి పెయింటర్. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. రవీంవూదనాథ్ ఠాగూర్‌ది పెద్ద పోట్రయిట్ గీసాడు. ఉర్దూ, ఇంగ్లీష్ సాహిత్యాలంటే ప్రాణం పెట్టేవాడు. ఏ మూల నిజాం ఆగడాలు చెలరేగుతున్నా, ఎక్కడ ఆర్మీ క్యాంప్స్ ఉన్నా వాటి గురించి నిర్భయంగా రాపేవాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాల్సిందేనని తన రాతలతో స్పష్టం చేసేవాడు. నిజామ్‌కు వ్యతిరేకంగా ఉన్న [[ముస్లిం]] విద్యావంతుల అభిప్రాయాలను ప్రచురించేవాడు. నిజాం మొండితనానికి, రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుంబాలు, యువకులేనని ఎన్నో సార్లు ఆవేదన చెందాడు.హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడమనేది షోయబుల్లాఖాన్ కల. లక్ష్యం. దాని కోసం నడిరోడ్డుమీద ప్రాణాలను బలిపెట్టాడు. అలాంటి త్యాగమూర్తికి మనమిచ్చిన గౌరవం... [[మలక్‌పేట]]లో ఆయన పేరు మీద ఒక గదితో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు. ఇంతే. చూద్దామంటే ఆయన విగ్రహం లేదు. తర్వాత తరాలు తెలుసుకోవడానికి చరిత్ర లేదు. ఎంత విచిత్రం? పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన నిజాయితీపరుడు. ఇవాళ ఎంతమందికి తెలుసు ఆయనంటే? ఇంత నిర్లక్ష్యమా? నిజమే.. ఎంత అలక్ష్యం?"<ref>http://www.namasthetelangaana.com/Features/Article.asp?category=7&subCategory=7&ContentId=19777</ref>
 
==[[రావెల సోమయ్య]] కదనం==
1947 కు ముందు ఎం.ఎన్.రాయ్ ప్రారంభించిన "Independent India " పత్రికను షొయబుల్లాఖాన్ అందరికి పంచేవాడు.స్వతంత్రం వచ్చిన తరువాత పేరు మార్చుకొని రాడికల్ హ్యూమనిస్ట్ పేరుతో ఆ పత్రిక ఇప్పడికీ వస్తుంది .నిర్దాక్షిణ్యమైన చరిత్రరథం తన గమనంలో పక్షపాతంగా ఎందరో మహానుభావులను ఎక్కించుకోకుండానే వెల్లిపోతుంటుంది. అటువంటి వారిలో షోయబుల్లా ఖాన్ ఒకరు . ఆ రథం మెడలు వంచి ఇటువంటి మహానుభావుల్ని ఎక్కించాలి. షోయబుల్లా ఖాన్ మీదా ఇంటెర్నెట్ అంతా వెదికినా ఒక్క ఫోటో కానీ, వీకీపీడియాలో అతని చరిత్ర కానీ దొరకదు మనకు . 1990 ల్లో నటరాజన్ అనే అతను అమెరికా నుండి వచ్చి ఒక డాక్యుమెంటరీ తీస్తే ఇంతకీ అది ఎక్కడుందో కూడా తెలియదు. దాన్ని అన్ని భాషల్లోకి అనువదించమని అప్పటి ప్రదాని పి.వి.నరసిమ్హారావుని అడిగిన కాళోజి మాట ఏమయ్యిందో ఇప్పటికీ తెలియదు. ఇంతకీ అతని గురించి తెలియని చాలా విషయాలు కింద లింక్స్ లో ఉన్నాయి. మీరే నిర్ణయించండి అతని త్యాగం, గొప్పదనం .<ref>https://www.facebook.com/photo.php?fbid=191811704341396&set=a.173030969552803.1073741829.100005377021376&type=1</ref>
 
==[[సయ్యద్ నశీర్ అహమద్]] కథనం==
బానిస బంధనాల నుండి విముక్తి కోసం సాగిన ప్రపంచ ప్రజాపోరాటాల చరిత్రలో అన్నివర్గాల ప్రజానీకంతోపాటుగా కలం యోధులైన పాత్రికేయులు, సంపాదకులు పలు నిర్బంధాలకు గురయ్యారు, చిత్రహింసల పాలయ్యారు, ఆంక్షలకు-నిషేధాలకు బలయ్యారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ మహమ్మద్‌ బాకర్‌ అరుదైన త్యాగంతో 1857లో చరిత్ర సృష్టించారు. చిరస్మరణీయుడైన మహమ్మద్‌ బాకర్‌ మార్గంలో స్వేచ్ఛ-స్వాతంత్య్రాల కోసం అక్షరాలను ఆయుధంగా చేసుకుని చివరి శ్వాసవరకు పోరాడిన హైదరాబాద్‌ యోధుడు షోయాబుల్లా ఖాన్‌.
 
పంక్తి 47:
సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. మొదట షోయబ్ 'తేజ్ 'అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు. పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది. తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడింది. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు. ‘పగటి ప్రభుత్వం - రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు.
 
కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. 1948 ఆగస్టు 21వ తేదిన కాచిగూడ రైల్వే స్టేషను రోడ్ లో ముష్కరులు ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నరికేశారు. [[1948]] [[ఆగస్టు 22]] న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు.నిజాం సర్కార్. షోయబ్ అంతిమయాత్రను నిషేధించింది. అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది. నిజాం ప్రభుత్వం ఈ హత్యోదంతంపై ఎలాంటి విచారణా జరపలేదు.<ref>http://www.scribd.com/doc/189173348/50-Samvatsarala-Hyd-on-Shoebullah-Khan</ref>, <ref>http://www.10tv.in/specials/Telangana-Rebellion-Shoaibullah-Khan-Fight-against-Nizam-for-Freedom-Yodha</ref>
 
==డిమాండ్లు==
"https://te.wikipedia.org/wiki/షోయబ్_ఉల్లాఖాన్" నుండి వెలికితీశారు