శంకరాభరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
'''{{PAGENAME}}''' [[1979]]లో [[కె.విశ్వనాధ్]] దర్శకత్వంలో నిర్మంచబడిన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది. అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది. ఈ చిత్రానంతరం చిత్రదర్శకుడు కె.విశ్వనాధ్ [[కళా తపస్వి]]గా పేరొందారు. గాయకుడు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలనచిత్రరంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది.ఈ చిత్రం యొక్క మొధటి చిత్రీకరణ రాజమహెంద్రవరం దగ్గరలో రఘుదేవపురం గ్రామ౦లొ మరియు ఎక్కువ భాగం ఆ పరిసర ప్రాంతాలలో చిత్రిీకరించబడింది. త్యాగరాజ కీర్తనల్లా అనిపించే వేటూరి సుందర రామ్మూర్తి రాసిన గీతాలు పండిత పామరులను విశేషంగా అలరించాయి. అపర త్యాగరాజ స్వామిగా వేటూరికి పేరు తెచ్చి పెట్టాయి.
==చిత్ర కథ==
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు,గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. విధిలేనిఆమెను పరిస్థితులలో ఆమె శీలాన్ని నాశనం చేసి,బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. ఇలా కొంతకాలం అయిన తరువాత మంజు భార్గవి ఒక కొడుకుని కని ఎలాగోలా ప్రయత్నించి శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/శంకరాభరణం" నుండి వెలికితీశారు