"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

→‎సాహిత్యం: +చార్లెస్_బాడిలేర్ లింకు
(→‎సాహిత్యం: +చార్లెస్_బాడిలేర్ లింకు)
ఫ్రెంచ్ సాహిత్యం మరియు కవిత్వం 18 - 19వ శతాబ్దాలలో బాగా అభివృద్ధి చెందాయి. 18వ శతాబ్దం వోల్టైర్, డెనిస్ డిదేరోట్, జీన్-జాక్విస్ రూసో వంటి రచయితలు, వ్యాసకర్తలు, నైతికవేత్తలను చూసింది. చార్లెస్ పెరాల్ట్ పిల్లల కథలను విస్తారంగా వ్రాసే రచయితగా ఖ్యాతి గడించాడు.ఆయన “పుస్ ఇన్ బూట్స్”, “సిన్డరెల్ల ”, “స్లీపింగ్ బ్యూటీ” "బ్లూబియర్డ్ ” వంటి కథలను రచించారు.
 
[[చార్లెస్ బడేలిర్బాడిలేర్]], పాల్ వెర్లైన్]ప్, స్టీఫన్ మల్లర్మీ వంటి కవులతో పందొమ్మిదవ శతాబ్దం చివరి కాలానికి చెందిన సంజ్ఞాత్మక కవిత్వం ఫ్రెంచ్ సాహిత్యంలో ఒక ముఖ్యమైన ఉద్యమంగా రూపొందింది. 19వ శతాబ్దం ఫ్రాన్స్ దేశంలో వెలుపలా ప్రఖ్యాతి చెందిన విక్టర్ హుగో (లెస్ మిసీరబ్లేస్), అలేక్సండ్రే డుమాస్ (ది త్రీ మస్కటీర్స్, ది కౌంట్ అఫ్ మోంటే-క్రిస్టో), జులేస్ వెర్నే (ట్వెంటీ థౌజండ్ లీగ్స్ అండర్ ది సీ) వంటి రచయితలను చూసింది. 19 వ శతాబ్దపు ఇతర కల్పిత కథల రచయితలలో ఎమిలే జోలా, గే డి మపసంట్, థీఒఫిలే గుతిఎర్, స్టెన్ధాల్ ఉన్నారు.
 
1903 లో ప్రిక్స్ గాన్కోర్ట్ అనే ఫ్రెంచ్ సాహిత్య బహుమతి మొదటిసారిగా ఇవ్వబడింది. 20వ శతాబ్దపు ముఖ్య రచయితలలో మార్సెల్ ప్రౌస్ట్, లూయిస్-ఫెర్డినాండ్ సీలైన్, ఆల్బర్ట్ కాముస్, జీన్-పాల్ సార్త్రే ఉన్నారు. అంటోయినే డి సెయింట్ ఎక్సుపీరి రచించిన ''లిటిల్ ప్రిన్స్'' అనేక దశాబ్దాలపాటు ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలలో ప్రజాదరణ పొందింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2460774" నుండి వెలికితీశారు