రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top
→‎కథ: కథ సంగ్రాహం
పంక్తి 18:
 
== కథ ==
ఈ కథ స్వతంత్ర భారతదేశంలో [[నిజాం|నిజాం ఉల్ ముల్క్]] గా పిలవబడే హైదరాబాదు రాష్ట్రంలోని [[ఆదిలాబాదు]] జిల్లా [[నేలకొండపల్లి]] గ్రామ నేపథ్యంలో జరుగుతుంది. ఆ గ్రామం దొరసాని ([[శ్వేతా మీనన్]]) నిరంకుశ పాలనలో నలిగిపోతూవుంటుంది. అదే గ్రామంలో మల్లమ్మ (బేబీ యాని) ఆడుతూపాడుతూ అందరి ప్రేమను చూరగొంటూ తన తాత సాంబయ్య ([[సమ్మెట గాంధీ]])తో నివసిస్తూవుంటుంది. గ్రామస్థులు తమ నాయకుడు రాజన్న సమాధిని ఓ తులసికోటలా నిర్మించుకుని పవిత్రంగా పూజిస్తుంటారు. దాని పట్ల ఆకర్షితురాలైన మల్లమ్మ తన తాత మాటను లెక్కచేయకుండా పదే పదే అక్కడికి వెళుతూవుంటుంది.
 
ఇదిలావుండగా, గ్రామంలోని పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే దొరసానికి చదువు పన్ను కట్టి పాఠశాలలో చేరాలి. అందుకోసం మల్లమ్మను దొర ఘడికి తీసుకొనివెళ్తాడు సాంబయ్య. అక్కడ దొరసాని కూతురు సంగీతం నేర్చుకుంటూవుండగా, దానికి ఆకర్షితురాలై పాట పాడిన మల్లమ్మను దొరసాని కొరడాతో కొట్టి, ఇకపై మల్లమ్మ పాట తనకు వినబడకూడదని చెబుతుంది.
 
==నటినటులు==
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు