రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: కథ సంగ్రాహం
→‎కథ: కథ సంగ్రాహం
పంక్తి 27:
 
జరిగిన విషయమంతా మల్లమ్మ కులకర్ణికి ఉత్తరం వ్రాస్తుంది. కానీ ఆ ఉత్తరం కులకర్ణికంటే ముందే దొరసానికి చేరగా, కులకర్ణిని తీసుకొని మల్లమ్మను చంపడానికి ఢిల్లీకి బయలుదేరుతుంది దొరసాని. మల్లమ్మను చేరదీసిన దంపతులను కొట్టి, కులకర్ణి, మల్లమ్మలను ఓ గదిలో బంధించి పాటల పోటి ముగిసేవరకు వదలద్దని తన మనుషులకు చెబుతుంది. నిరాశపడిన మల్లమ్మను ఊరడించడానికి, రాజన్న గురించి చెప్పడం మొదలుపెడతాడు కులకర్ణి.
 
బ్రిటీషువారిని ఎదిరించి పోరాడి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన పాత్ర వహించిన రాజన్న ([[అక్కినేని నాగార్జున]]) ఆదిలాబాదు జిల్లా నేలకొండపల్లిలో అడుగుపెడతాడు. నిజాం నిరంకుశత్వంలో నలిగిపోతున్న ప్రజల కష్టాలను గమనిస్తాడు. ఓ చోట ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ నవాబు చేయి నరికి అందరిని కాపాడతాడు. ఆ నవాబు రాజన్న ఉన్న ఊరి మీద మళ్ళీ దాడికి రాగా, తన పాటతో అక్కడి ప్రజలను ప్రేరేపించి దొరలను తరిమికొట్టిస్తాడు. లచ్చువమ్మ ([[స్నేహ]])ను చెరపట్టిన నవాబుని లచ్చువమ్మతోనే చంపిస్తాడు. దాంతో ఊరి ప్రజల నమ్మకాన్ని సంపాదించిన రాజన్న తన పాటలతో ప్రజలను ప్రేరేపిస్తూ, దొరలపై తిరగబడేలా చేస్తూ దొరలకు ఆటంకంగా మారుతాడు. మరోప్రక్క, లచ్చువమ్మను పెళ్ళి చేసుకుంటాడు రాజన్న.
 
==నటినటులు==
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు