జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''జనవరి 26, 2008'''
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌]] మహిళల టైటిల్ [[రష్యా]]కు చెందిన [[మరియా షరపోవా]] కైవసం. [[మెల్‌బోర్న్‌]]లో జరిగిన ఫైనల్లో [[ఇవనోవిక్]] పై 7-5, 6-3 స్కోరుతో ఓడించి 12 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ సాధించింది. షరపోవాకు ఇది మూడవ గ్రాండ్‌స్లాం టైటిల్.
* [[ఆస్ట్రేలియా]] వికెట్‌కీపర్ [[ఆడం గిల్‌క్రిస్ట్]] టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్.
* [[2008]] గణతంత్ర దినోత్సవంలో భాగంగా [[భారతదేశం|భారత]] రెండో అత్యున్నత పౌర పురష్కారం [[పద్మవిభూషణ్]] 13 ప్రముఖులకు ప్రధానం. [[పద్మభూషణ పురష్కారం]] 35 గురికి, [[పద్మశ్రీ పురస్కారం]] 71 గురికి ప్రధానం. పద్మవిభూషణ్ పొందిన వారిలో క్రికెటర్ [[సచిన్ టెండుల్కర్]], వ్యాపారవేత్తలు [[రతన్ టాటా]], [[లక్ష్మీ మిట్టల్]], విదేశాంగ మంత్రి [[ప్రణబ్ ముఖర్జీ]], పర్వతారోహకుడు [[ఎడ్మండ్ హిల్లరీ]] ముఖ్యులు.
:'''జనవరి 25, 2008'''
* సెనేట్‌ విశ్వాస పరీక్షలో ఓడిపోయినందుకు [[ఇటలీ]] ప్రధాన మంత్రి రొమానో ప్రోది పదవికి రాజీనామా.
* [[ఒరిస్సా]] మాజీ ఆరోగ్య శాఖ మంత్రి లంచం తీసుకున్నట్లు [[ప్రపంచ బ్యాంకు]] ఆరోపణ.
* [[ఫ్రాన్స్]] అధ్యక్షుడు [[నికోలస్ సార్కోజీ]] [[భారతదేశం|భారత్]] పర్యటన ప్రారంభం.
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] లో ప్రపంచ నెంబర్ వన్ [[స్విట్జర్లాండ్]] కు చెందిన [[రోజర్ ఫెడరర్]] సెమీఫైనల్స్‌లో ఓటమి. [[సెర్బియా]]కు చెందిన [[నోవాక్ జకోవిక్]] ఫెదరర్‌ను 7-5, 6-3, 7-6 స్కోరుతో వరుస సెట్లతో ఓడించాడు. <ref>http://in.telugu.yahoo.com/News/Sports/0801/25/1080125036_1.htm</ref>
:'''జనవరి 24, 2008'''
* [[ఆస్ట్రేలియా]]తో జరుగుతున్న [[అడిలైడ్]] టెస్టులో [[సచిన్ తెండుల్కర్]] 39వ టెస్ట్ సెంచరీ సాధించాడు.
* [[ఉత్తర ప్రదేశ్]] కు చెందిన మాఫియా డాన్ బ్రజేష్ సింగ్‌ను [[భువనేశ్వర్]] విమానాశ్రయంలో పట్టుబడ్డాడు.
* [[అరుణాచల్ ప్రదేశ్]] నూతన [[గవర్నర్]] గా [[జోగీందర్ జస్వంత్ సింగ్]] నియమించబడ్డాడు.
* [[ఐక్యరాజ్యసమితి]] యొక్క [[భద్రతా మండలి]]లో శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు [[భారతదేశం|భారత]] ప్రతిపాదనకు రష్యా మద్దతు.
* మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండుల్కర్‌ కు [[భారతరత్న]] ఇవ్వాలని మాజీ క్రికెటర్ [[అజిత్ వాడేకర్]] ప్రతిపాదన.
:'''జనవరి 23, 2008'''
* విమాన ప్రమాదంలోనే [[సుభాష్ చంద్ర బోస్|నేతాజీ]] మరణించినట్లు [[కేంద్ర ప్రభుత్వం|కేంద్రం]] విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.<ref>http://in.telugu.yahoo.com/News/National/0801/23/1080123033_1.htm </ref>
* [[అమెరికా]] [[స్టాక్ ఎక్సేంజీ]]లో సత్యం కంప్యూటర్స్ డిపాజిటరీ షేర్లు నమోదుకానున్నాయి. ప్రపంచంలోని మూడు ప్రముఖ స్టాక్ ఎక్సేంజీలలో నమోదైన తొలి భారతీయ కంపెనీగా సత్యం కంప్యూటర్స్ ఘనత సాధించింది. <ref>http://in.telugu.yahoo.com/News/Business/0801/23/1080123005_1.htm </ref>
* [[ఆస్ట్రేలియన్ ఓపన్ టెన్నిస్]] [[సానియా మీర్జా]] - [[మహేష్ భూపతి]] జోడీ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశం.
:'''జనవరి 22, 2008'''
* ఎన్డీఏ కూటమి [[ప్రధానమంత్రి]] అభ్యర్ధిగా [[భారతీయ జనతా పార్టీ]] ప్రముఖ నాయకుడు[[లాల్ కృష్ణ అద్వానీ]] ఎంపిక .
* [[శివసేన]] పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా [[ఉద్ధవ్ థాక్రే]] తిరిగి రెండో పర్యాయం ఎన్నిక.
* [[హంగేరి]] లోని [[గ్యార్]] లో జరుగుతున్న హంగేరీ ఓపెన్ పోటీలో [[భారతదేశం|భారత]] షూటర్లు 7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించారు.
:'''జనవరి 21, 2008'''
* [[బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్]] సూచి సెన్సెక్స్ లో 2050 పాయింట్ల భారీ పతనం. [[నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్]] సూచిలో కూడా 716 పాయింట్ల పతనం.
* [[భారతదేశం|భారత]] పర్యటనలో ఉన్న [[బ్రిటన్]] ప్రధాన మంత్రి [[గోర్డాన్ బ్రౌన్]] కు [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]] డాక్టరేట్ ప్రధానం.
* [[శ్రీహరికోట]] నుంచి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్-10 ద్వారా [[ఇజ్రాయెల్]] కు చెందిన పోలరైస్ ఉపగ్రహం ప్రయోగం విజయవంతం.
:'''జనవరి 20, 2008'''
* నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల విమానాశ్రయాలతో పాటు [[హైదరాబాద్]], [[బెంగళూరు]], [[అమృత్‌సర్]], ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలోని విమానాశ్రయాల్లో బందోబస్తు మరింత పటిష్టం చేశారు. <ref>http://in.telugu.yahoo.com/News/National/0801/20/1080120003_1.htm </ref>
* న్యూఢిల్లీలో శనివారం జరిగిన చర్చలు సుముఖంగా ముగియడంతో [[గోవా]] రాజకీయ సంక్షోభం గట్టెక్కింది. <ref>http://telugu.in.msn.com/news/national/article.aspx?cp-documentid=1198445 </ref>
:'''జనవరి 19, 2008'''
* నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత్, మరియు ఆస్ట్రేలియా మద్య పెర్త్ లో జరిగిన మూడవ టెస్టులో భారత్ ఒక రోజు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ పై విజయం సాధించడం తనకు ప్రత్యేకమైన ఆనందాన్నిచ్చిందని భారత జట్టు సారథి అనిల్ కుంబ్లే తెలిపాడు. ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించినందుకుగాను ఇర్ఫాన్ పఠాన్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు.
* [[రంజీ ట్రోఫీ]] చాంపియన్‌షిప్‌ను [[ఢిల్లీ]] గెలుచుకుంది. [[ముంబాయి]]లో జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ రంజీ జట్టు [[ఉత్తర ప్రదేశ్]] జట్టుపై 9 వికెట్లతో విజయం సాధించింది. ఢిల్లీ రెండో ఇన్నింగ్సులో [[గౌతమ్ గంభీర్]] అజేయ సెంచరీ సాధించాడు.
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] పోటీలలో [[భారతదేశం|భారత్]] కు చెందిన [[సానియా మీర్జా]] మూడవ రౌండ్‌లో [[అమెరికా]]కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి [[వీనస్ విలియమ్స్]] చేతిలో 7-5, 6-4 తేడాతో పరాజయం.
:'''జనవరి 18, 2008'''
* ధర్మపురి బస్సు దుర్ఘటన కేసులో [[అన్నాడీఎంకే]] పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలకు విధించిన [[మరణశిక్ష]]ను దేశ అత్యున్నత న్యాయస్థానం [[సుప్రీం కోర్టు]] ఖరారు చేసింది. <ref>http://telugu.in.msn.com/news/national/article.aspx?cp-documentid=1196598 </ref>
:'''జనవరి 17, 2008'''
* టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా [[అనిల్ కుంబ్లే]] రికార్డు. ప్రపంచ బౌలర్లలో కుంబ్లే ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్. ఇదివరకు [[షేన్ వార్న్]], [[ముత్తయ్య మురళీధరన్]] లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు