లైలా మజ్ను: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భానుమతి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 32:
# విరితావుల లీల మనజాలినా చాలుగా నీవే నేనుగా - పి. భానుమతి, ఘంటసాల
# సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా బాగున్నారా - కస్తూరి శివరావు
 
==ప్రముఖ రచయిత చలం వాఖ్యలు==
 
ప్రముఖ రచయిత [[గుడిపాటి వెంకట చలం]] 1940లలో బెజవాడలో ఒక సినిమా హాలుకు (లక్ష్మీ టాకీసు) ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవాడు.ఆ హాలులో ఈ సినిమా రోజూ సినిమాలు వినేవాడు.ఈ సినిమా ఆ హాలులో 56 రోజులు ఆడింది. ఇదే సినిమా మీద తాను రచించిన మ్యూజింగ్స్ లో (280వ పుటలో 5 వ ముద్రణ 2005) ఈ కింది విధంగా వ్రాశాడు<ref>చలం రచన మ్యూజింగ్స్ (280వ పుటలో - 5 వ ముద్రణ 2005)</ref>
 
లైలా మజ్ఞు ప్రపంచ సారస్వతంలోని ప్రేమ కథల్లో ఒకటి. ఆ కథ, నాటకాలై తరువాత హిందీ సినిమాలై, ప్రస్తుతం తెలుగులోకి దిగింది. ఆ ప్రేమగాధని ఏంగా తయారు చేశారో, ప్రతిరాత్రీ రెండుసార్లు వినడం తప్పలేదు నాకు. ఫిల్ము అంతా ఏడుపే. అంతకన్నా ఏడుపు ఇంక కల్పించడ ఎవరికీ అసాధ్యం చేసేశారు. తెలుగు వాళ్ళకి ఏడుపులు ఇష్టం గావును. పల్లెటూళ్ళాలో చెప్పే పాత బుర్ర కథలన్నీ అన్యాయంగా నరుక్కోడాలూ, ఏడుపులూ, భయాలు.
 
ఒకరంటారూ, ఈ చిత్రంలో ఆడవాళ్ళకి కొన్ని బట్టలు తీసేసి చూపడం ముఖ్యమైన ఆకర్షణ అని. అట్లాంటి అశ్లీలమైన పని చేస్తే సెన్సార్లు ఎట్లా ఒప్పుకున్నారో! ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి అశ్లీలాలు చిత్రాల్లోకి ఎక్కకండా. ఎందుకంటే తెలుగు సినిమా తారలు పూసుకునే రంగులూ, కట్టుకునే బట్టలూ, ఉండలూ, తీసేసి అసలు స్వరూపాల్ని ఒక్కసారి చూపారంటే, ఇంక ఎటువంటి ప్రేక్షకుడూ ఆ సినిమాల వేపు పోడు. మద్యపాన నిషేధంతో అసలే అవస్థపడుతున్న ప్రభుత్వానికి, ఆదాయం మరీ తగ్గుతుంది. అప్పుడు సినిమాలకి వెళ్ళని వారిమీద పన్ను వెయ్యగల పద్ధతి అలోచించాల్సి ఉంటుంది.
 
ఈ కథలో నాయకీ నాయకులు ప్రపంచ సారస్వతంలో గొప్ప ప్రియులు. గాథ అద్వితీయం. ఈ చిత్రాన్ని తయారు చేసిన గుంపులో, కవులు, చిత్రకారులు, గాయకులు, దర్శకులు, నటులు-ఎవరికన్నా, ఎప్పుడన్నా అలోచనలకి వచ్చిందా, మామూలుగా మనుష్యుల హృదయాల్లో కలిగే ప్రేమ స్వబావం-అది వ్యక్తమయ్యే విధం! ఫిల్ము అంతా ప్రేమో, ప్రేమో అని అరుపులు, వూరంతా వినపడేట్టు అరుపులు. వళ్ళని పిచ్చివాళ్ళు అనుకోకపోతే ఇంకేమనుకుంటారు?
 
దీంటో కొత్తరకమైన ప్రియుల్ని కనిపెట్టారు. "పనమయే ప్రేతముల్ని" పాట చివర "పెళ్ళికూతురా!" అంటాడు. కొంచెంసేపు ఆ పాటే ఉంటే మూడోది ఓ తిట్టు వస్తుందనుకుంటాము. ఆ నాయకి "మన ప్రేమలూ ఊ ఊ ఊ" అని ఊరంతా ఊదుతుంది.
 
ఈశ్వర కటాక్షంవల్ల వాళ్ళిద్దరూ, అంతటితో చచ్చిపొయినారు గాని లేకపొతే ఎట్లానూ వాళ్ళని వెళ్ళగొడుదురు, పురశాంతికోసం. అట్లా ఏడవకపోతే, ఎక్కడికన్నా పారిపోకూడదా అనుకుంటామా, వాళ్ళెందుకు పొతారూ? మరె వాళ్ళ ప్రేమ అరుపుల్ని వినేదెవరు, ఎక్కడి కన్నా పారిపొతే!
 
ఫిల్ము చివర నీతి సమస్య వచ్చింది. పెళ్ళి అయిన అమెను ప్రెయుడితో కలసి కాపరం ఎట్లానా చెయ్యనీడమని. అందుకని సరే తుఫాను తెప్పించారు. ఆ తుఫానులో ఇద్దరూ చచ్చిపోయినారు. నాయకుడు పటుత్వమైన ఉపన్యాసమిచ్చి, వెంటనే చస్తాడు. 'అమ్మా చచ్చారు. ఇంక నిద్రపోవచ్చు' ననుకుంటామా! వాళ్ళు చావరు. పైకి ఎగిరి ఆకాశంమీద నుంచి మళ్ళీ పాట లంకించుకుంటారు. ఒక వేళ వాళ్ళని సలక్షణంగా కాపరానికి పెట్టినా ఇంత హంగామా రోజూ చేస్తూనే ఉండేవారేమో!
 
స్వర్గలోక నివాసుల్ని తలుచుకుంటే ఎవరికైనా దిగులు పుట్టకమానదు. ఐనా ఆకాశంలో ఉండరు. దేయ్యాలై దిగివచ్చి, మళ్ళీ పాటలు ప్రాంభించి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా తమ ప్రేమ పాటల్ని, ఇట్లా అర్చుకుంటో తెరెగే వాళ్ళు ఎక్కడన్నా వుంటార అని.
 
రామాయణాన్ని పుట్టలో ఊదాడుగాని, ఈ లైలా మజ్ఞూలు వస్తున్నారని ఎవరన్నా వాల్మీకి పుట్టలో ఊదితే ఒక్క గంతేసి అంతులేకండా పారిపోయి ఉండును ఆ ఋషి. అప్పుడు రామయణం రాయడానికి విశ్వనాధగారు ([[విశ్వనాధ సత్యనారాయణ]]) తప్ప ఎవరూ మిగిలేవారు కారు.
 
ఈ ప్రకారం కథనీ, చిత్రం తీసే పద్ధతినీ ధ్వంసం చెయ్యకపోతే ప్రజలు చూడరని చిత్రాలవారికి నిశ్చితాభిప్రాయం. ఈ ఫిల్ములో కొత్త టెక్నిక్ చూపించారు. తుఫాను నాయకుడికి నోట్టోంచి బయలుదేరుతుంది. అతని నోరు మాట్టాడుతున్నప్పుడు ఆగుతుంది. ఆ పని కాగానే నోరు ఖాళీ ఐ, తుఫాను ప్రాంభిస్తుంది. గొంతు కోస్తున్న చీంబోతు మల్లే "లైలా, లైలా" అన్న అతని అరుపూ, పిచ్చి కుక్క తరిమే వెనకకాలు విరిగిన కుందేలు మల్లే "ఓ ఓ ఓ" అనే అమె అరుపూ విన్న తరువాత, ఈ ప్రజలు ఇళ్ళకుపోయి మామూలుగా ఎట్లా బతుకుతున్నారో తెలీదు. కలలు కంటాను-ఇట్లాఇటి ప్రేమగాధ చిత్రం-అసలు చప్పుడు లేకుండా, సగం వినపడే ఒక మాట-ఎప్పుడో స్మూత్ గా పాడిన ఒక్క చరణం-అట్లా నడవకూడదా అని....ప్రేమని ముఖంలో, కళ్ళలో, దేహం ఉనికిలో చూపకూడదా అని.
 
అసలు కథలో లైలాది గోషాదేశం. బైటికి రావడం ఆమెకి అసాధ్యం. చొట్టూ ఎడారి. పోవడాని వీలెలేదు. ఈ లైలామజ్ఞూలది మద్రాసు. ఒక్క కార్లు లేవుగాని, తక్కిన రాకపోకలకి ఏ అభ్యంతరాలు లేవు. లైలాకి-ఇంటివారిలో ఆడవాళ్ళందరూ మిత్రులే. ఎందుకు పారిపోరో వాళ్ళు! మతం మహ్మదీయ మతం. పునర్జన్మలు వొప్పుకుని మాట్టాడతారు. ఆ తురక దేశాల మధ్య. ఆ ప్రేమ, పెళ్ళి ఐనవాళ్ళకి వొచ్చిందా, ఆ ప్రియులకి ఈ హక్కుల్లో ఒక్కటీ ఒప్పుకోరు. పెళ్ళి అయిన వాళ్ళకి వొచ్చెది అపవిత్ర ప్రేమ అంటే, ఆ దేశాల్లో ఎప్పుడూ విడాకులు ఉన్నాయి.
 
అంత దయగల ఆ రాజు, పెళ్ళి చేసుకున్న పిల్లని అట్లా పంపకపోతే తాను ఆమెకు విడాకులిచ్చి, ప్రియుల్ని తానే కలపగూడదా? అసలు ఈ లైలా లెక్చర్లూ, గుంజుకోడాలు, అరుస్తో పాటలు విని ఈ పిల్లతో ఎవడు కాపరం చెయ్యగలడని హడలిపోయి, మంచి మాటలు చెప్పి, ఎంత త్వరగా పంపితే, అంత మంచిదనుకుని ఉంటాడు. ఆ తుఫాను కోసమే కాచుకుని ఉన్నారు ఈ ప్రియులు. కాకపోతే ఒక్కచోటే, ఒక్క సమయంలోనే, లైలా, మజ్ఞూ, తుఫానూ కలుసుకోవడం అసంభవం.
 
==విజయం==
విజయభాస్కర్ అనె తెలుగు సినిమా అభిమాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చిత్రశాలలగురించి ఐడిల్ బ్రైన్ వెబ్ సైటులో వ్యాసాలు వ్రాశారు. ఆ వ్యాసంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా 56 రోజులు ఆడిందట<ref>[http://www.idlebrain.com/movie/cinemahall/vijayawada-srilakshmi.html.com లింకు పేరు]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/లైలా_మజ్ను" నుండి వెలికితీశారు