రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==జీవిత విశేషాలు==
రఘుపతి వెంకటరత్నం నాయుడు [[1862]], [[అక్టోబరు 1]] న [[మచిలీపట్నం]]లో సుప్రసిద్ద [[తెలగ]] నాయుళ్ళ ఇంట జన్మించాడు<ref>{{cite book|title=History of modern Andhra|last=Rao|first=P. Raghunatha|publisher=Sterling Publishers|year=1983|isbn=978-0-86590-112-4|page=186}}</ref>. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. [[హిందీ]], [[ఉర్దూ]], [[పర్షియన్]] భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి [[హైదరాబాదు]] బదిలీ కావడంతో, అక్కడి [[నిజాం]] ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత [[మద్రాసు]] [[క్రిస్టియన్ కళాశాల]]లో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాల గురించి పట్టించుకోరాదు అనే వారామె.
 
ఎం.ఏ. కాగానే [[మద్రాసు]] [[పచ్చయప్ప కళాశాల]]<nowiki/>లో [[ఇంగ్లీషు]] ఆచార్యునిగా పనిచేసాడు. [[1904]]లో [[కాకినాడ]] లోని [[పిఠాపురం]] రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు<ref>{{cite news|url=http://www.hindu.com/thehindu/mp/2002/12/16/stories/2002121601500400.htm|title=Fulfilment is his reward|date=16 December 2002|work=[[The Hindu]]|accessdate=4 January 2010}}</ref>. [[1911]]లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు<ref>{{cite journal|year=1984|journal=Itihas|publisher=[[Government of Andhra Pradesh]]|volume=12|pages=24|issn=}}</ref>. [[1925]]లో [[మద్రాసు విశ్వవిద్యాలయం|మద్రాసు విశ్వవిద్యాలయ]] ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు<ref>{{cite news|url=http://www.hindu.com/2009/10/02/stories/2009100252210300.htm|title=Tributes paid to educationist|date=2 October 2009|work=[[The Hindu]]|accessdate=4 January 2010}}</ref>. [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] బిల్లును రూపొందించి [[శాసనసభ]]లో ఆమోదింపజేసాడు. 1924లో [[బ్రిటిష్]] ప్రభుత్వాంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు.<ref>{{cite book|title=Dr. B. Pattabhi Sitaramayya: a political study|last=Kumar|first=A. Prasanna|publisher=[[Andhra University Press]]|year=1978|page=13|oclc=5414006}}</ref><ref>[http://www.london-gazette.co.uk/issues/32969/pages/6494 The London Gazette, 29 August 1924]</ref> [[1927]]లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.