గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ె → ే , స్వేఛ్చ → స్వేచ్ఛ, → , , → , (3)
పంక్తి 27:
 
===విద్యాభ్యాసం - వివాహం - ఉద్యోగం===
1911లో పిఠాపురం మహారాజా కళాశాలలో చేరాడు. ఆ సమయంలో బ్రహ్మర్షి [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]] నాయకత్వంలో అక్కడ నడుస్తున్న బ్రహ్మసమాజం వైపు ఆకర్షితుడయ్యాడు. తరువాత బి. ఎ. చదువు కోసం [[మద్రాసు]] వెళ్ళాడు. అంతకు ముందే చిట్టి రంగనాయకమ్మతో చలం వివాహం జరిగింది. మద్రాసులో తాను డిగ్రీ చదువుతూనే తన భార్యను కాన్వెంట్‌లో చేర్చి, తాను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆమెను సైకిల్ పై స్కూల్లో దించేవాడు. దీనిని అంతా వింతగా చూసేవారట. మామగారైతే చలాన్ని తన ఇంటి గడపే తొక్కవద్దన్నాడు. అప్పటికి చలం భార్య వయసు 13 సంవత్సరాలు. చదువు అయిన తరువాత [[కాకినాడ]]లో ట్యూటర్‌గా ఉద్యోగంలో చేరాడు. తిరిగి బ్రహ్మసమాజ ఉద్యమంలోనూ, 'రత్నమ్మ' తో స్నేహం-ప్రేమ లోనూ బిజీ అయ్యాడు. టీచరుగా హోస్పేటలో పనిచేసి తిరిగి రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత పాఠశాల తనిఖీ అధికారిగా పనిచేశాడు. తన ఉద్యోగం గురించి తాను రచించిన "[[మ్యూజింగ్స్]]" లో (72వ పుట, 5వ ముద్రణ [[2005]]) ఈవిధంగా వ్యాఖ్యానం చేశాడు
{{వ్యాఖ్య|<big>రాతిని, ప్రభుత్వ బానిసను. స్కూళ్ళ తనిఖీదారుణ్ణి, ఉపాధ్యాయవర్గ ప్రాణ మూషికాలకి మార్జాలాన్ని</big>|||చలం|}}
 
పంక్తి 85:
 
===చలం - ఆత్మ కథ===
తనమీద తానే ఒక పుస్తకాన్ని వ్రాసి (1972) , దానికి "చలం" అని పేరు పెట్టాడు. అదే అతని ఆత్మకథ. తన ఆత్మకథలో చలం తనతండ్రి తనను కొట్టడం గురించి వ్రాసాడు, కానీ ఆయన పేరు మాత్రం వ్రాయలేదు. తన తల్లి భర్తతోను పిల్లలతోను పుట్టింటనే అవస్థ పడటం గురించి వ్రాసాడు, కానీ ఆవిడ పేరు కూడా రాయలేదు. (చలం ఆత్మకథలో ఇద్దరి పేర్లు లేవు) . ఈ ఆత్మకథకు ముందుమాట తనే వ్రాసుకున్నాడు. ఆ ముందుమాట చలం అంతర్గతాన్ని తెలియజేస్తుంది -
{{వ్యాఖ్య|ఆత్మకథలంటే నాకసహ్యం. ఆత్మకథ వ్రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషైనట్టు, తానేదో ప్రజలకి తీరని ఉపకారం చేసినట్టు, తన సంగతి చెప్పుకోకపోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు, తెలియకపోతే లోకానికి నష్టమైనట్టు అనుకొంటున్నాడన్నమాట, రాసినవాడు. ఎందుకు పుట్టానా? పుట్టినవాణ్ణి చప్పున చావక ఎందుకింత కాలం తన పరిసరాలని ఇంత కల్మషం చేశానా అనుకునే నావంటివాడు తనకథ సిగ్గు లేకుండా చెప్పుకొంటున్నాడంటే ఏమాత్రం క్షమించదగిన విషయం కాదు.|||చలం|}}
===మహా ప్రస్థానానికి ముందుమాట===
పంక్తి 105:
* [[స్త్రీ (చలం రచన)|స్త్రీ]]
* [[మ్యూజింగ్స్ (చలం రచన)|మ్యూజింగ్స్]]
* [[విషాదం(చలం రచన)|విషాదం]]
* హరిశ్చంద్ర నాటిక
 
పంక్తి 122:
 
===చలం రచనలు - సినిమాలు===
తెలుగు చిత్రపరిశ్రమ ఆవిర్భావం మొదలు, ముఖ్యంగా పరిశ్రమ తొలి దశల్లో, [[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]] వంటి పలు తెలుగు రచనలు చలనచిత్రాలుగా దృశ్యరూపం పొందినప్పటికీ చలం కథలుగాని, నవలలుగాని సినిమాగా తియ్యడానికి ఎవరూ సాహసించలేదు. చలం రచనలు ఎంతో మంది చదివినా, సమాజంలో అతను వ్రాసిన కథలు అనేక వక్ర భాష్యాలకు గురి కావడం, ఇంతాచేసి సినిమా ఎంతో శ్రమ పడి, డబ్బు ఖర్ఛు చేసి తీస్తే ఏమవుతుందో అన్న అనుమానం, భయం ముఖ్య కారణం కావచ్చును. పైగా, ఆ కథలు గానీ, నవలలు గానీ సినిమాలుగా తీసి జనంలోకి తీసుకెళ్ళగలిగిన నటులు గాని, దర్శకులు గాని ముఖ్యంగా నిర్మాతలు గాని కరువయ్యారనే చెప్పవచ్చు. 2005 వ సంవత్సరంలో చలం [[దోషగుణం]] కథ ఆధారంగా, [[ఇంద్రగంటి మోహనకృష్ణ]] దర్శకత్వంలో [[గ్రహణం]] చిత్రం వచ్చింది. ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైన ఈ చిత్రం ఆర్థికంగా లాభాలు ఆర్జించలేదు. అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు, పలు పురస్కారములు పొందింది. ఆ తర్వాత చలం [[మైదానం]] నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత మరియు నటుడు [[తనికెళ్ళ భరణి]] ప్రయత్నం చేసి పరిశ్రమ నుండి సరైన స్పందన లభించక మానుకున్నాడు <ref> [http://www.hindu.com/2005/11/11/stories/2005111101780200.htm]</ref>. 1980 ల ద్వితీయ అర్థ భాగంలో, [[హైదరాబాదు]] [[దూరదర్శన్]] వారు (DD-8) , మైదానం నవలను ఒక టెలీ ఫిల్ముగా రూపొందింపచేసి ప్రసారం చేసారు. కానీ, తీసిన పద్ధతి, దర్శకత్వం, నటన పేలవంగా ఉండటం వలన, ప్రాచుర్యం పొందలేదు.
 
==చలంగురించి ఇతర ప్రముఖులు==
పంక్తి 148:
* నీ పుస్తకాల వల్ల ఎందరో పాడైపోయారు అంటారు, ఎందుకట్లా రాశావు? అని అడిగాను. 'అట్లా అనిపించింది. రాశానూ అన్నారాయన. 'మరి యిప్పుడు యిల్లా ఈశ్వరుడు అంటూ భజన చేస్తున్నావేం?' అన్నాను. 'ఇప్పుడిట్లా అనిపిస్తోందీ అన్నారు.
*తల్లిని పోషించని మనిషిగా నేను చలాన్ని పేర్కొనడం భావ్యం కాదు. తన భార్యని పిల్లలతో ఎగతాళి చేయించి, కొట్టించిన 'వికృత వ్యక్తిత్వం' గా ఆయన్ని పేర్కొనడమూ భావ్యం కాకపోవచ్చును. యుక్త వయస్కుడైన ఏకైక కుమారుడు ఆనాటి బెజవాడ నుంచి తెలుగు సమాజంలో యిమిడిపోలేక, యిల్లు విడిచి అంతర్థానమైపోవడానికి ఆయనే కారకుడని (అంటే చలం) కోపంగా అనడమూ సబబు కాకపోవచ్చును.
*ఆయన బోధించిన 'కాముక స్వేఛ్చ’స్వేచ్ఛ’ నాకు పరమరోత కలిగించింది. అది మానవస్థాయి నుంచి పశుస్థాయికి దిగడం అని నా చిన్న బుర్రకు తోచింది.
 
==చలం పై విమర్శలు==
పంక్తి 161:
*ఉన్నది దాచుకుంటాననేవాడికి దేవుడి భయం లేదు. నీది లాక్కుని పంచుతాననే వాడికి [[దేవుడు]] లేడు. అందుకనే, పశుబలం, యుక్తీ, తెలివీ ఇవే ప్రాబల్యంలోకి వచ్చాయి. ధర్మం, న్యాయం, సత్యం అనేవి ఉత్త మాయ మాటలైనాయి. (290 పుట మ్యూజింగ్స్ 5వ ముద్రణ)
*తనకు రావలిసిన హక్కులకన్న, తను నెరవేర్చవలసిన బాధ్యతల పైన దృష్టి నిలపాలి స్త్రీ. బైట ఉన్న పరిస్థితులకన్న, తన చుట్టూ ఉన్న వాతావరణం నించి కన్న స్వతంత్రమూ, శాంతీ, హృదయంలోపల పలికి వచ్చినప్పుడే స్థిరంగా నిలుస్తాయి అవి. అత్త అధికారంనించీ, భర్త అధీనం నుంచీ తప్పించుకుంటున్న నవీన స్త్రీ, షోకులకీ, సంఘ గౌరవానికీ, ఫాషిన్సికీ బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కిందనుంచుని (ఆ పురుషుడికి బానిస అయితేనేంగాక) లోకాన్ని ధిక్కరించగలిగే ఇల్లాలు, ఈనాడు సంఘ గౌరవం పేర, ఉద్యోగం పేర, ఫాషన్ పేర వెయ్యిమందికి దాస్యం చేస్తోంది. నవీన స్త్రీకి - తనచుట్టూ స్త్రీలందరూ అత్తలైనారు!-- ''(స్త్రీ 16వ పుట)''
* తెల్లారి లేస్తెలేస్తే పిడకలు, మళ్ళు (పాతకాలంలో బ్రాహ్మణ స్త్రీలు మడి కట్టుకునేవారు) , అధికారాలు, అలుకులు (పూర్వం ఇల్లు పేడతో అలుక్కునేవారు) ఇవన్నీ వొదిలి, సూర్యోదయం చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం ఉత్సాహం - ఎప్పుడు కలుగుతుంది మానవులకి!. . . ''(స్త్రీ 17వ పుట)''
* మాట్లాడటానికి స్వేచ్ఛా, శక్తీ ఉన్ననాడే నిజమో అబద్ధమో చెప్పగలడు. అట్లా తన స్వేచ్ఛని ఉపయోగించేవాడే, ఈనాడు అబద్ధాలు చెప్పినా, ఒకనాడైనా నిజం చెప్పడంనేర్చుకుంటాడు, -- ''(స్త్రీ 51వ పుట)''
* కుక్కకి యజమానుడు ఎంత అవసరమో, ఆడపిల్లకి మొగుడు అంత అవసరం. కాని, ప్రతి స్త్రీకి ఇట్లా ఏదో ఒక భర్త ఎల్లాంటివాణ్ణో ఒకణ్ణి దానం చేసితీరే సంఘం, భర్త లేకపొతే ఒప్పుకోని సంఘం, ఆ భర్త పోతే మళ్ళీ దానం చెయ్యదేమి? స్త్రీకి భర్త ఉండటమే అంత అవసరమైతే, ఎప్పుడూ ఉండనక్కర్లేదూ? భర్త ఒద్దని ఏడుస్తున్న చిన్న పిల్లలకి బలవంతంగా కట్టబెడుతుంది, భర్త కావాలని గోలపెడుతున్న వితంతువులకి నిరాకరిస్తుంది సంఘం. ఏం తెలివి?-- ''(స్త్రీ 51-52 పుటలు. ఈ వాక్యాలు చలం 1930-40లలొ వ్రాసినవి)''
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు