గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ె → ే , స్వేఛ్చ → స్వేచ్ఛ, → , , → , (3)
పంక్తి 122:
 
===చలం రచనలు - సినిమాలు===
తెలుగు చిత్రపరిశ్రమ ఆవిర్భావం మొదలు, ముఖ్యంగా పరిశ్రమ తొలి దశల్లో, [[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]] వంటి పలు తెలుగు రచనలు చలనచిత్రాలుగా దృశ్యరూపం పొందినప్పటికీ చలం కథలుగాని, నవలలుగాని సినిమాగా తియ్యడానికి ఎవరూ సాహసించలేదు. చలం రచనలు ఎంతో మంది చదివినా, సమాజంలో అతను వ్రాసిన కథలు అనేక వక్ర భాష్యాలకు గురి కావడం, ఇంతాచేసి సినిమా ఎంతో శ్రమ పడి, డబ్బు ఖర్ఛు చేసి తీస్తే ఏమవుతుందో అన్న అనుమానం, భయం ముఖ్య కారణం కావచ్చును. పైగా, ఆ కథలు గానీ, నవలలు గానీ సినిమాలుగా తీసి జనంలోకి తీసుకెళ్ళగలిగిన నటులు గాని, దర్శకులు గాని ముఖ్యంగా నిర్మాతలు గాని కరువయ్యారనే చెప్పవచ్చు. 2005 వ సంవత్సరంలో చలం [[దోషగుణం]] కథ ఆధారంగా, [[ఇంద్రగంటి మోహనకృష్ణ]] దర్శకత్వంలో [[గ్రహణం]] చిత్రం వచ్చింది. ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైన ఈ చిత్రం ఆర్థికంగా లాభాలు ఆర్జించలేదు. అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు, పలు పురస్కారములు పొందింది. ఆ తర్వాత చలం [[మైదానం]] నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత మరియు నటుడు [[తనికెళ్ళ భరణి]] ప్రయత్నం చేసి పరిశ్రమ నుండి సరైన స్పందన లభించక మానుకున్నాడు <ref> [{{Cite web |title=Art film good for viewing, not making: Tanikella Bharani |author=A D Rangarajan |year=2005|url=http://www.hindu.com/2005/11/11/stories/2005111101780200.htm]}}</ref>. 1980 ల ద్వితీయ అర్థ భాగంలో, [[హైదరాబాదు]] [[దూరదర్శన్]] వారు (DD-8), మైదానం నవలను ఒక టెలీ ఫిల్ముగా రూపొందింపచేసి ప్రసారం చేసారు. కానీ, తీసిన పద్ధతి, దర్శకత్వం, నటన పేలవంగా ఉండటం వలన, ప్రాచుర్యం పొందలేదు.
 
==చలంగురించి ఇతర ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు