"చాకలి" కూర్పుల మధ్య తేడాలు

543 bytes removed ,  1 సంవత్సరం క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
==సామాజిక పాత్ర==
పెళ్లిల్లలో చాకలి చేయాల్సిన సాంప్రదాయ పనులు చాల వుంటాయి. [[దీవిటి పట్టడం]], [[''చాకలి సాంగెం'']] అనె ఒక కార్యక్రమం వుండేది. అది లేక పోతె చాల లోటు. పంతులు గారు కూడా కొన్ని సందర్భాలలో చాకలి ఎక్కడ అని పిలుస్తుంటాడు. పెళ్ళి సందర్భంగా చాకలికి ప్రత్యేకించి డబ్బులు ఇవ్వరు. కాని అక్కడ [[తలంబ్రాలు]] పోసిన బియ్యం చాకలికే చెందుతాయి. అలాగే [[మంగళ స్నానం]] తర్వాత విడిచిన బట్టలు కూడా చాకలికె చెందు తాయి. జాతరలు, గ్రామ దేవతల పూజలందు చాకలే పూజారి. సమాజంలో ముఖ్యమైన పాత్ర వహించిన ఈ చాకలి వృత్తి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైనది. అప్పట్లో వంకల్లో వాగుల్లో ఎక్కడ పడితె అక్కడ నీళ్లు లభించేవి. వారి పని సులువయ్యేది. రాను రాను నీటి లబ్యత తక్కువయ్యె కొద్ది నీటి కొరకు పొలాలలోని బావుల వద్దకు పరుగులు తీసి, అవికూడ అడుగంటగా, రైతులు వరి పండించడం మానేయగా.. వారికి రావలసిన [[మేర]] సరిగా రాక, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రమంగా ఆ వ్వవస్థ కనుమరుగైనది. చాల తక్కువగా వుండే చాకలి కులం సామాజిక మార్పులతో చెల్లా చెదురై అంతరించి పోయింది. తరతరాలుగా బట్టలుతికిన చాకిరేవులలో [[చాకి బండలు]] నునుపు దేలి చాకలి వృత్తికి సాక్షిభూతంగా నేటికి అక్కడక్కడా పడి ఉన్నాయి. పల్లె ప్రజలు ఎవరి బట్టలు వారె వుతుక్కుంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. కాక పోతె బట్టల మురికి అతి సులభంబా వదల గొట్ట డానికి అనాడు లేని [[డిటర్జెంటు]]లు, [[పౌడర్లూ,]] [[సబ్బులు,]] [[బట్టలు ఉతికే యంత్రాలు]] ఇప్పుడొచ్చాయి. పైగా మురికి అంతగా అంటని, అంటినా సులభంగా వదిలిపోయే [[టెర్లిన్,]] [[టెరికాట్,]] [[పోలిస్టర్]] వంటి బట్టలు ఎక్కువైనాయి. దాంతో గృహస్తుల బాధ కొంత వరకు తీరింది. చాకలి లేని లోటు కొంత వరకు తీరింది. చాకలి వృత్తి కేవలం మురికి బట్టలను వుతకడం మాత్రమే కాదు.... అతనికి అనేక సామాజిక పనులు కూడా వుండేవి. అన్ని ప్రాంతాలలోను చాకలి వృత్తి ఇంచు మించు కనుమరుగైనది. ఎవరి బట్టలను ఎక్కువగా వారే వుతుక్కుంటున్నారు. మరి.... ఇతర సామాజిక కార్యక్రమాల సంగతి...... అవి ఏవంటే..... ముట్టు బట్టలను ఉతకడం, ఆడపిల్లలు సమర్థాడినప్పుడు స్నానం చేయించడము, పురుడు పోసినప్పుడు స్నానం చేయించడము, చావు వంటి అశుభ కార్యాలకు దీవిటి పట్టడం, పెళ్ళి వంటి శుభ కార్యాలకు దీవిటి పట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఏనాడో కనుమరుగైనవి. పాత సంప్రదాయాలను మరువలేని వారు ఆ యా సమయానికి ఒక చాకలి కులస్తుని అద్దెకు పిలిపించి[[తూ తూ మంత్రం]]గా ఆకార్యక్రమం జరిగిందని పిస్తున్నారు. దీన్ని బట్టి చాకలికి ఆ రోజుల్లో ఎంతటి [[పరపతి]] ఉండేదో ఊహించు కోవచ్చు. అది ఆనాటి చాకలి ప్రాముఖ్యత.
 
==[[తురక చాకలి]] ==
బి.సి.ఇ గ్రూపులో [[దోభీ ముస్లిం]], [[ముస్లిం దోభీ]], [[ధోబి ముసల్మాన్]], [[తురక చాకలి]], [[తురక చాకల]], [[తురుక సాకలి]], [[తురకల వన్నన్]], [[చాకల]], [[సాకలా]], [[చాకలా]], [[ముస్లిమ్ రజకులు]] కూడా ఇదేవృత్తిని చేస్తున్నారు.
 
==చాకలి వారికి సంబందించిన సామెతలు==
11

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2473154" నుండి వెలికితీశారు