స్వర్ణమంజరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* శబ్ద గ్రహణం - జె.సూర్యనారాయణ
==సంక్షిప్త చిత్రకథ==
స్వర్ణమంజరి సౌందర్యరాశి. అంతే కాదు మంచి నర్తకి కూడా. ఆమె ఒకసారి యువరాజు చంద్రభాను జన్మదినం సందర్భంగా రాజాస్థానంలో నాట్యం చేయవలసి వస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. దీనిని రాజగురువు మహేంద్రశక్తి సహించలేకపోతాడు. స్వర్ణమంజరిని తన రహస్య గృహానికి రప్పించి బంధించబోగా ఆమె ఉపాయంతో తప్పించుకుంటుంది. ఈలోగా మిత్రుడు శ్రీముఖునితో కలిసి లోకసంచారానికి వెళ్లిన చంద్రభానుడిని సంగీతవృక్షం అంతరిక్ష మార్గంలో గొనిపోయి ఒక సరోవరం దగ్గర పడేస్తుంది. ఆ సరోవరంలోని యామిని అనే మత్సకన్య చంద్రభానును తన లోకానికి లాక్కుపోయి అతడిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. స్వర్ణమంజరి కూడా శ్రీముఖుని సహాయంతో అక్కడికి చేరుకుని యువరాజును రక్షించడానికి పూనుకొంటుంది. కాని యామిని వారిద్దరినీ చూసి అక్కడి నుండి తరిమింది. స్వర్ణ చేతులను ఖండించింది. చేతులు లేని స్వర్ణను యువరాజు పెళ్ళి చేసుకుని బిడ్డను కంటాడు. రాజగురువు అప్పటికీ ఆమెపై పగసాధించడానికి కుయుక్తితో రాజ్యం నుండి వెళ్ళగొట్టిస్తాడు. ఆమె అడవులపాలవుతుంది. యువరాజు మత్సకన్య శాపవిముక్తి కోసం సింహాలతో పోరాడుతాడు. డ్రాగన్‌ను చంపుతాడు. అతడు తిరిగి స్వర్ణమంజరిని కలుసుకుంటాడా? రాజగురువు ఏమవుతాడు? వంటి ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తుంది<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=46163 చిత్రసమీక్ష, రూపవాణి, ఆంధ్రప్రభ దినపత్రిక, 17-08-1962 పేజీ 4]</ref>.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/స్వర్ణమంజరి" నుండి వెలికితీశారు