బలిజేపల్లి లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

+{{Authority control}}
ట్యాగు: కొత్త దారిమార్పు
పంక్తి 1:
#దారిమార్పు [[బలిజేపల్లి లక్ష్మీకాంతం]]
{{Infobox writer
| name = బలిజేపల్లి లక్ష్మీకాంతం
| image = Balijepalli.jpg
| imagesize =
| alt =
| caption = బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
| pseudonym = బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
| birth_name =
| birth_date = [[డిసెంబరు 23]], [[1881]]
| birth_place = [[బాపట్ల]] తాలూకా, [[గుంటూరు జిల్లా]]
| death_date = [[జూన్ 30]], [[1953]]
| death_place = [[శ్రీకాళహస్తి]], [[చిత్తూరు జిల్లా]]
| occupation =
| nationality = భారతీయులు
| ethnicity = [[హిందూ]]
| citizenship = [[భారత దేశము]]
| education = [[మెట్రిక్యులేషన్]]
| alma_mater = [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]] గుంటూరు
| period =
| genre = నాటక రచయిత, కవి,అవధాని,నటుడు
| subject =
| movement =
| notableworks = సత్య హరిశ్చంద్ర నాటకం
| spouse =
| partner =
| children =
| relatives = బలిజేపల్లి సీతారామయ్య
| influences = భాగవతుల చెన్నక్రిష్ణన్
| influenced =
| awards =
| signature =
| signature_alt =
| website =
| portaldisp =
}}
 
'''బలిజేపల్లి లక్ష్మీకాంతం''' లేదా '''లక్ష్మీకాంత కవి''' ([[డిసెంబరు 23]], [[1881]] - [[జూన్ 30]], [[1953]]) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల మరియు సినిమా నటులు. వీరు రచించిన నాటకాలలో [[హరిశ్చంద్ర]] చాలా ప్రసిద్ధిచెందినది.
 
==జీవిత సంగ్రహం==
వీరు [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] తాలూకా [[ఇటికంపాడు]]లో [[23 డిసెంబర్]], [[1881]] సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి మరియు ఆదిలక్ష్మమ్మ. వీరు తన మేనమామ [[భాగవతుల చెన్నకృష్ణయ్య]] వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, [[కవిత్వం]] చెప్పడం నేర్చుకున్నారు.
 
[[కర్నూలు]]లో మెట్రిక్యులేషన్ చదివిన తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలను సందర్శించి [[అవధానాలు]] ప్రదర్శించారు.
 
[[చల్లపల్లి రాజా]]వారి సాయంతో 1922లో [[గుంటూరు]]లో చంద్రికా ముద్రణాలయం స్థాపించారు. [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని [[జైలు]] శిక్ష అనుభవిస్తున్న కాలంలో సత్య హరిశ్చంద్రీయ నాటకం రచించారు. 1926 లో [[గుంటూరు]]లో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రీయ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో [[నక్షత్రకుడు]] పాత్ర వీరికిష్టమైనది.
 
తర్వాత కాలంలో [[చిత్తజల్లు పుల్లయ్య]] గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, [[పాటలు]] రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు.
 
వీరు [[30 జూన్]], [[1953]] సంవత్సరం కాళహస్తిలో పరమపదించారు.
 
==బలిజేపల్లి రచనలు==
*శివానందలహరి శతకం (శంకరుని కృతికి ఆంధ్రీకరణం)
*స్వరాజ్య సమస్య (పద్య కృతి)
*[[బ్రహ్మరథం]] (నవల)
*మణి మంజూష (నవల)
*[[బుద్ధిమతీ విలాసము]] (నాటకము)<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.371923 భారత డిజిటల్ లైబ్రరీలో బుద్ధిమతీ విలాసము నాటకం పుస్తక ప్రతి.]</ref> : శివ భక్తాగ్రేసరుల్లో ఒకరిగా పేరొందిన శిరియాళుని కథను ఇతివృత్తంగా స్వీకరించి ఈ నాటకాన్ని రచించారు.
*[[సత్యహరిశ్చంద్రీయము]] (నాటకము)<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.371884 భారత డిజిటల్ లైబ్రరీలో సత్యహరిశ్చంద్రీయము పుస్తకం.]</ref>
* ఉత్తర గోగ్రహణము (నాటకము)
* సాత్రాజితీ పరిణయము (నాటకము)
*[[ఉత్తర రాఘవము]] (భవభూతి రచించిన నాటకానికి ఆంధ్రీకరణం)<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.371586 భారత డిజిటల్ లైబ్రరీలో ఉత్తర రాఘవము నాటకం పుస్తక ప్రతి.]</ref>
 
==చిత్ర సమాహారం==
# [[లవకుశ (1934 సినిమా)|లవకుశ]] (1934) (మాటలు మరియు పాటల రచయిత)
# [[హరిశ్చంద్ర (1935 సినిమా)|హరిశ్చంద్ర]] (1935) (రచయిత)
# [[అనసూయ]] (1936) (రచయిత)
# [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] (1939) (నటుడు మరియు మాటల రచయిత)
# [[వర విక్రయం]] (1939) (నటుడు మరియు మాటల రచయిత)
# [[భూకైలాస్ (1940 సినిమా)|భూకైలాస్]] (1940) (మాటల రచయిత)
# [[విశ్వమోహిని]] (1940) (మాటల చయిత)
# [[బాలనాగమ్మ]] (1942) (నటుడు మరియు రచయిత)
# [[తాసిల్దార్ (సినిమా)|తాసిల్దార్]] (1944) (నటుడు మరియు మాటల రచయిత)
# [[రక్షరేఖ]] (1949) (నటుడు, కథ మరియు మాటల రచయిత)
# [[బ్రహ్మరధం (1947 సినిమా)|బ్రహ్మరథం]] (1947) (నటుడు, కథ మరియు పాటల రచయిత)
# [[భీష్మ (1944 సినిమా)|భీష్మ]] (1944) (నటుడు)
# [[నా చెల్లెలు]] (1953)
# [[మంజరి (సినిమా)|మంజరి]] (1953) (నటుడు మరియు మాటల రచయిత)
# [[జీవిత నౌక (1951 సినిమా)|జీవిత నౌక]] (1951) (మాటలు మరియు పాటల రచయిత)<ref>జీవిత నౌక (1951) సినిమా పాటల పుస్తకం.</ref>
 
==సత్య హరిశ్చంద్ర==
ఈ నాటకము వీరి అత్యంత ప్రసిద్ధమైన రచన. ఇప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శింపబడుతున్నది. ఉదాహరణకు కొన్ని పద్యాలు:
 
మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్<br>
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం<br>
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో<br>
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.
 
==మూలాలు==
{{వికీసోర్స్|రచయిత:బలిజేపల్లి లక్ష్మీకాంతం}}
{{మూలాలజాబితా}}
*20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
*నటరత్నాలు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, రెండవ ముద్రణ, 2002 పేజీలు: 370-72.
 
==బయటి లింకులు==
*[http://uk.imdb.com/name/nm0442649/ ఐ.ఎమ్.డి.బి.లో బలిజేపల్లి పేజీ.]
{{Authority control}}
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]]
[[వర్గం:1881 జననాలు]]
[[వర్గం:1953 మరణాలు]]
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు]]