భానుమతీ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పరిచయ పాఠ్యం విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 33:
 
==సినిమాలలో==
[[File:Malleeswari Movie Songs -- Pilichina Biguvataraa -- N.T. Rama Rao -- Bhanumathi Ramakrishna.webm|thumb|[[మల్లీశ్వరి]] సినిమాలో భానుమతి పాడి, నాట్యం చేసిన పిలచిన బిగువటరా పాట]]
భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో [[మల్లీశ్వరి]], [[మంగమ్మగారి మనవడు]] వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. [[విజయా]] వారి [[మిస్సమ్మ]] సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత [[చక్రపాణి]]కి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో [[సావిత్రి]]ని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను [[వరలక్ష్మీ వ్రతం]] చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే [[చక్రపాణి]] తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి ''నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది,'' అని సంతోషించింది<ref>నాలో నేను:భానుమతి రామకృష్ణ:మానస పబ్లికేషన్స్:2004ప్రచురణ:పేజీ.186</ref>.
 
"https://te.wikipedia.org/wiki/భానుమతీ_రామకృష్ణ" నుండి వెలికితీశారు