"తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
[[ఆంధ్ర ప్రదేశ్]] మర్రియు [[తెలంగాణ]] రాష్ట్రాల [[అధికార భాష]] తెలుగు. [[భారత దేశం]]లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో <ref name="censusindia.gov.in">[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm Abstract of speakers' strength of languages and mother tongues – 2001], Census of India, 2001</ref> ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో [[హిందీ]], తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.<ref>[http://www.ethnologue.com/statistics/size ఎథ్నోలాగ్ లో తెలుగు గణాంకాలు]</ref> మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో [[సంస్కృతము]] [[తమిళ భాష|తమిళము]]<nowiki/>తో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.
 
వెనీసుకు చెందిన వర్తకుడు [[నికొలో డా కాంటి]] భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' '''[[ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌]]'''<nowiki/>' గా వ్యవహరించారు.'''<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/when-foreigners-fell-in-love-with-telugu-language/article4227784.ece తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వ్యవహరించిన నికొలో డా కాంటి]</ref>''' కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల [[కన్నడ భాష]] లిపిని పోలియుంటుంది.
 
== '''తెలుగు - ఒక అవలోకనం''' ==
 
వెనీసుకు చెందిన వర్తకుడు [[నికొలో డా కాంటి]] భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' '''[[ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌]]'''<nowiki/>' గా వ్యవహరించారు.'''<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/when-foreigners-fell-in-love-with-telugu-language/article4227784.ece తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వ్యవహరించిన నికొలో డా కాంటి]</ref>''' కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల [[కన్నడ భాష]] లిపిని పోలియుంటుంది.
 
=='''తెలుగు - ఒక అవలోకనం''' ==
 
భాషా శాస్త్రకారులు తెలుగును [[ద్రావిడ భాషలు|ద్రావిడ భాషా వర్గము]]<nowiki/>నకు చెందినదిగా వర్గీకరించారు<ref>[http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం]</ref>. అనగా తెలుగు – [[హిందీ భాష|హిందీ]], [[సంస్కృత భాష|సంస్కృతము]], [[లాటిన్|లాటిను]], [[గ్రీక్ భాష|గ్రీకు]] మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, [[కన్నడ భాష|కన్నడము]], [[మలయాళ భాష|మలయాళము]], తోడ, [[తుళు]], [[బ్రహుయి|బ్రహూయి]] మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, [[కోయ]], కొలామి కూడా ఉన్నాయి<ref name="BKrishnamurthi2003">Krishnamurti, Bhadriraju (2003), The Dravidian Languages Cambridge University Press, Cambridge. ISBN 0-521-77111-0</ref>.
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి [[పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి]] తెలుగు అనువాదం:
 
''అందగత్తెలన్నా'', ''అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ'', ''అయిన ఆంధ్రులు అటూ'', ''పుటూ'' (''పెట్టు కాబోలు''), ''రటూ'' (''రట్టు ఏమో'') ''అనుకొంటూ వస్తుండగా చూచాడు.''
 
=== తెలుగు, తెనుగు, ఆంధ్రము ===
ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి<ref>ఆంధ్రుల చరిత్ర - డా. [[బి.యల్.హనుమంతరావు]]</ref><ref>తెలుగు సంస్కృతి - [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] వ్యాసము</ref>. క్రీ. పూ. 700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము ([[ఋగ్వేదము]]లో భాగము) లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత [[బౌద్ధ]] శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దిలో [[మెగస్తనీసు]] అనే [[గ్రీక్ భాష|గ్రీకు]] రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించాడు.
 
ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణా]] నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు '''''అల్ బిరుని''''' తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను <ref>Ancient India: English translation of Kitab-ul Hind by Al-Biruni, National Book Trust, New Delhi.</ref>.
 
క్రీ. శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి "తెలుంగు భూపాలురు", "తెల్గరమారి", "తెలింగకులకాల", 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో [[నన్నయ]] భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చింది. 13వ శతాబ్దములో [[ఇస్లాం మతం|మహమ్మదీయ]] చారిత్రకులు ఈ దేశమును "త్రిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన [[కావ్యాలంకారచూడామణి]]లో ఇలా చెప్పాడు.
::ధర శ్రీ పర్వత కాళే
::శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.
 
=== క్రీ. శ. 1020 వరకు – నన్నయకు ముందు కాలం ===
 
11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన [[మహాభారతం]] తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ. శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి [[తెలుగు శాసనాలు|తెలుగు శాసనం]]. ఇది [[కడప జిల్లా]] [[కమలాపురం]] తాలూకా [[ఎఱ్ఱగుడిపాడు శాసనము|ఎఱ్ఱగుడిపాడులో]] లభించినది. అంతకు ముందు కాలానికి చెందిన [[అమరావతి]] శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2476682" నుండి వెలికితీశారు