స్వప్న సుందరి: కూర్పుల మధ్య తేడాలు

2,026 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ముక్కామల నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
budget = |
imdb_id = 0155226}}
==నేపద్యం==
 
అక్కినేని నాగేశ్వరరావు చిత్రసీమలో ప్రవేశించిన తొలి రోజుల్లో జానపద కథానాయకునిగా ఎక్కువ చిత్రాల్లో నటించి, రాణించారు. ఆ ఇమేజి దృష్టిలో వుంచుకొని నిర్మాత బలరామయ్య ఈ ‘స్వప్నసుందరి’ జానపద చిత్రానికీ అక్కినేని వారినే హీరోగా నిర్ణయించి నిఎమించారు.సముద్రాల సీనియర్ చిత్రానికి పాటలు-మాటలు సమకూర్చారు. కాశీమజిలి కథలను అనుసరించి, చక్కని అల్లికతో చిత్రకథను రూపొందించారు. ఈ చిత్రానికి వీనులవిందైన సంగీతాన్ని సి.ఆర్. సుబ్బరామన్ సమకూర్చగా సంయుక్త సంగీత దర్శకునిగా ఘంటసాలవారు పనిచేశారు. టైటిల్స్‌లో వారి పేరు జి.వి.రావుగా ప్రకటించారు. నృత్యం-వేదాంతం రాఘవయ్య, ఛాయాగ్రహణం- శ్రీ్ధర్, ఎడిటింగ్- జి.డి.జోషి, స్టంట్స్- కత్తిసాధన, స్టంట్- సోము, స్వామినాథన్ అండ్ పార్టీ, నిర్మాణ నిర్వాహకుడు - ప్రతిభాశాస్ర్తీ (టి.వి.ఎస్.శాస్ర్తీ) నిర్మాత-దర్శకుడు: ఘంటసాల బలరామయ్య.
==సంక్షిప్త చిత్రకథ==
అనగనగా ప్రభు అనే ఒక రాజకుమారుడు అబ్బి అనే జతగాడిని తీసుకొని దేశాటనకు బయల్దేరతాడు. కలలో ఒక సుందరి మరులు గొలిపి మాయమవుతుంది. ఆమెను చూడాలని ప్రయత్నించిన ప్రభు ఒక కోయరాణి వలలో చిక్కుకుంటాడు. ఆమె ప్రేమను కాదని తప్పించుకొని బయటపడ్డ ప్రభుకు నిజంగానే స్వప్నసుందరి కనిపించి తన లోకానికి తీసుకొని వెల్తుంది. ఇంతలో యీ విషయం తెలుసుకొన్న ఆ లోక పాలకుడు భూలోకానికి పొమ్మని ఇద్దర్ని పంపించి వేస్తాడు. అప్పుడు హాయిగా ఇద్దరూ భూలోకంలో విహరిస్తుంటారు. ఇంతలో ఓ మాయల మరాఠీ తరహా మాంత్రికుడు పున్నమి విందుకోసం సుందరిని అపహరించి తన మందిరానికి చేరుస్తాడు. ప్రభు ఓ పూటా కూళ్ళమ్మ సహాయంతో మాంత్రికుని జాడ తెలుసుకొని అక్కడికి ప్రవేశించగా మాంత్రికుడు బంధిస్తాడు. ఇంతలో ప్రభు జాడ తెలుసుకొన్న కోయరాణి తన పరివారంతో మాంత్రికుని గుహకు చేరుకొని ప్రభుకు విముక్తి కలిగిస్తుంది. ప్రభు మాంత్రికున్ని సంహరిస్తాడు. ఆ పోరాటంలో కోయరాణి ప్రాణాలు కోల్పోతుంది. ప్రభు తన స్వప్నసుందరి కలుసుకుంటారు.
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2476994" నుండి వెలికితీశారు