బాంధవ్యాలు: కూర్పుల మధ్య తేడాలు

6,690 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:సావిత్రి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
producer=బడేటి సత్యనారాయణ, <br />పుట్టా వెంకట్రావు|
}}
[[ఎస్.వి.రంగారావు]] (సామర్ల వెంకట రంగారావు) స్వంతంగా యస్.వి. ఆర్. ఫిలిమ్స్ బ్యానర్‌పై బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావులతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించాడు. అనుబంధాలకు, అన్యోన్యతకు, బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ, క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియచేసే చక్కని కుటుంబ కథాచిత్రం '''బాంధవ్యాలు'''. 1967లో కమల్ బ్రదర్స్‌వారు తమిళంలో నిర్మించిన ‘కన్‌కండ దైవమ్’ అనే సినిమా దీనికి మాతృక.
==సాంకేతిక వర్గం==
# కథ-కె.ఎస్.గోపాలకృష్ణన్,
# మాటలు- డి.వి.నరసరాజు,
# కళ-వి.బి.రాజు,
# కూర్పు-ఎన్.ఎస్. ప్రకాశం,
# నృత్యం-వేణుగోపాల్,
# సంగీతం-సాలూరి హనుమంతరావు,
# దర్శకత్వం- ఎస్.వి.రంగారావు,
# నిర్మాతలు- బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావు
==పాత్రలు -పాత్రధారులు==
* రామయ్య - ఎస్.వి.రంగారావు
* చంద్రం - ఏడిద నాగేశ్వరరావు
* లక్ష్మి - లక్ష్మి
* రామేశం - మోదుకూరి సత్యం
* సోమేశం - సారధి
* పానకాలస్వామి - రాజనాల
* సూర్యం - చంద్రమోహన్
* లక్ష్మయ్య - ధూళిపాళ
* అన్నపూర్ణ - సావిత్రి
* శఠగోపం - అల్లు రామలింగయ్య
* డాక్టర్ ఆచార్యులు - నాగయ్య
* మస్తాను - సీతారాం
* పి.జె.శర్మ
* కోళ్ళ సత్యం
* పొట్టి లక్ష్మి
 
==చిత్రకథ==
రామయ్య (ఎస్.వి.రంగారావు) ఆ గ్రామంలో మోతుబరి రైతు. అతనికొక కుమారుడు చంద్రం (ఏడిద నాగేశ్వరరావు) కళ్ళులేకపోయినా చాపలు అల్లటం అతని నేర్పు. రామయ్య తమ్ముడు లక్ష్మయ్య (ధూళిపాళ) మరదలు అన్నపూర్ణ (సావిత్రి), వారి కూతురు లక్ష్మి(లక్ష్మి) కుమారులు ముగ్గురు, రామేశం (మోదుకూరి సత్యం), కామేశం, సోమేశం (సారధి). మగపిల్లలు పట్నంలో చదువుతూ, విలాసాల్లో గడుపుతూ, పరీక్షల్లో ఫెయిలవుతూంటారు. వారి ఎదురింటి వ్యక్తి పానకాలస్వామి (రాజనాల), అతని తమ్ముడు సూర్యం (చంద్రమోహన్) బుద్ధిమంతుడు. అన్నగారు చేసే అక్రమ వ్యాపారాలు, వ్యవహారాలు నచ్చక, రామయ్యవద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. లక్ష్మి, సూర్యం ప్రేమించుకుంటారు. లక్ష్మయ్యకు ఇది నచ్చదు. కొడుకులు అప్రయోజకులయినా వారిపట్ల ప్రేమ ఎక్కువ. ఇది అలుసుగా తీసికొని పానకాలు, ఈ అన్నదమ్ములచేత ఒక కారు కొనిపించి, అలాగే ఆస్తి హామీ సంతకం 2 లక్షలకు పెట్టించి వారిని అందులో ఇరికించి, పోలీసులచే అరెస్ట్‌చేయిస్తాడు. పిల్లల కారణంగా, రామయ్య ఆస్తిని పంచి కొడుకుతో వేరుగా వుంటాడు. తన పిల్లలు అరెస్ట్‌కాగానే లక్ష్మయ్య అన్నగారిని తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. రామయ్య సాయంతో, చదువుకున్న పాలేరు భూషయ్య కొడుకు గోపాలం (హరనాథ్) వకీలు కావటంతో ఈ రెండు కేసులను సమర్ధవంతంగా వాదించి, రామేశం వగైరాలను నిర్దోషులుగా విడుదల చేయిస్తాడు. వారికి బుద్ధిరావటం, లక్ష్మి, సూర్యంల వివాహం నిశ్చయం కావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
 
==పురస్కారాలు==
‘బాంధవ్యాలు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడింది. నిర్మాతలకు మంచి పేరు సంపాదించి పెట్టింది. నటి లక్ష్మికి తొలి పరిచయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి 1968వ సం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డ్స్‌లో ఉత్తమ కుటుంబ కథాచిత్రంగా ‘ప్రథమ బహుమతి’, ‘బంగారు నంది’ అవార్డు పొందింది. పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందింది.
 
==పాటలు==
74,503

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2477115" నుండి వెలికితీశారు