ముగ్గురు మరాటీలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==కథ==
మహారాష్టక్రు చెందిన వీరులగాథ, '''ముగ్గురు మరాటీలు'''. బడేఁగావ్‌ను సిద్దోజి మహారాజు (గోవిందరాజుల సుబ్బారావు) పాలిస్తుంటాడు. అతని భార్య మహారాణి రుక్కూబాయి (కన్నాంబ). వారికి సంతానం లేదు. అన్నగారి కుమారులు సోమోజి (సిహెచ్.నారాయణరావు) సుబంధి (జి.నారాయణరావు), ఫిరోజి (అక్కినేని)లను పెంచి పెద్దచేస్తాడు. వారి పట్ల రుక్కుబాయి ద్వేషం పెంచుకొని, భర్త మనసులో విష బీజాలు నాటుతుంది. దానివలన సిద్దోజి, అన్న కుమారులను రాజ్యం నుంచి, పంపివేసి ముగ్గురికి 2 ఊళ్ళను ‘పత్తికోట’, ‘ధరణికోట’ల అధికారం ఇస్తాడు. వారి మేనకోడలు రఘుబాయి (టి.జి.కమలాదేవి), ఫిరోజి ప్రేమించుకుంటారు. రుక్కుబాయి వారిని విడదీయాలని, తన తమ్ముడు తిమ్మోజి (కస్తూరి శివరాం)తో ఆమెకు వివాహం చేయాలనుకుంటుంది. అన్నదమ్ములు ముగ్గురిని కోటకు పిలిపించి, సిద్దోజి వారిని ఖైదుచేసి, తాను ధరణికోటపై దండెత్తి, దాన్ని తగలబెడతాడు. ఒంటరిగా వున్న సోమోజి భార్య అంశుబాయి (కుమారి) మామగారిని ఎదిరించి ఓడిస్తుంది. అన్నదమ్ములు తప్పించుకుని వచ్చి, నిలువ నీడలేక, ఒక గొల్ల ఇంటిలో తల దాచుకుంటారు. ఎల్లమ్మదేవి గుడిలో పూర్వీకులు దాచిన నిధిని ఫిరోజి సాహసంలో సాధిస్తాడు. సిద్దోజి కుట్రతో మంత్రాల రామిగాడితో సోమోజిని చంపిస్తాడు. భర్త చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అంశుబాయి దానికోసం మరుదులను పంపుతుంది. ఆమె కుమారుడు పెద్దమరిది సుబంధి, రాజ భటులకు చిక్కుతారు. ఫిరోజి మరో సంస్థానానికి రాజవుతాడు. సుబంధిని, మనవడిని బలిచేయబోయిన మహారాజుకి ఒకవైపు అంశుబాయి ప్రజాసైన్యంతో, మరోవైపు ఫిరోజి తన సైన్యంతో వచ్చి వారి కాపాడడం, సిద్దోజికి, అంశుబాయికి మధ్య పోరులో, సిద్దోజి మరణించగా, ప్రాణత్యాగం చేసుకోబోయిన రుక్కుబాయిని తమ పెద్ద దిక్కుగా వుండమని, అందరూ కోరటం, ఆమెలో మార్పు వచ్చి, రఘుబాయిని, ఫిరోజి చేతిలో పెట్టటం, అందరూ ఆనందించటం చిత్రం ముగుస్తుంది <ref>[http://www.andhrabhoomi.net/content/flashback50-5 ముగ్గురు మరాఠీలు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 28-04-2018]</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ముగ్గురు_మరాటీలు" నుండి వెలికితీశారు