అమాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ముక్కామల నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[జమున]]|
}}
1942లో వచ్చిన జెమినీ వారి ‘బాలనాగమ్మ’లో నాగరాజుగా, 1953లో వచ్చిన హాస్య చిత్రం ‘పక్కింటి అమ్మాయి’లో సంగీతం మాస్టారుగాను నటించిన ప్రముఖ హాస్య నటుడు అడ్డాల నారాయణరావు. ప్రముఖ హాస్య నట చక్రవర్తి రేలంగి వెంకట్రామయ్యకు ఆత్మీయ మిత్రుడు. ఆయన ప్రోత్సాహంతో తొలిసారిగా 1960లో వచ్చిన ‘సమాజం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలోనే ప్రముఖ హాస్యనటుడు రాజ్‌బాబు సినీ రంగానికి పరిచయమయ్యారు. అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ‘అమాయకుడు’ 10-05-1968న విడుదలయింది.
‘అమాయకుడు’ చిత్రానికి మూలం 1959లో వచ్చిన ‘అనారీ’ హిందీ చిత్రం. కథ-ఇందిరారాజ్ ఆనంద్, సంగీతం- శంకర్ జైకిషన్, పాటలు- హస్రత్ జయపురి, శైలేంద్ర, ఎడిటింగ్, దర్శకత్వం సృషికేష్ ముఖర్జీ నిర్వహించిన ఈ చిత్రంలో హీరోగా రాజ్‌కపూర్, హీరోయిన్‌గా నూతన్, ఇంకా లలితాపవార్, మోతీలాల్ నటించారు.
‘అమాయకుడు’ చిత్రానికి- సంభాషణలు- రావూరి, కథ- ఇందిరారాజ్ ఆనంద్, కళ- సూరన్న, కూర్పు- కె.ఏ.శ్రీరాములు, ఫొటోగ్రఫీ- ఎం.కె. రాము, స్టంట్స్- రాఘవులు అండ్ పార్టీ, నృత్యం- చిన్ని, సంపత్, వి.జె.శర్మ, సహాయం రాజు, వసంత్, నటరాజ్, సంగీతం- బి.శంకర్, దర్శకత్వం- అడ్డాల నారాయణరావు, నిర్మాతలు- ఉదయశ్రీ (మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్). చిత్ర ప్రారంభానికి ముందు ఆర్కియాలజి డిపార్ట్‌మెంట్ వారికి, ఉషా పిక్చర్స్ పిన్నమనేని సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియచేస్తూ టైటిల్స్ ప్రారంభం అవుతాయి.
రాజు (కృష్ణ) నీతి, నిజాయితీగల విద్యాధికుడైన, ఒక పెయింటర్, తల్లి, తండ్రి ఎవరూ లేని అనాథ. మేరియమ్మ (జి.వరలక్ష్మి) ఇంట్లో అద్దెకు వుంటున్నాడు. ఎక్కడ ఏ పనిలో ఉద్యోగంలో చేరినా అచ్చట మోసాలు తట్టుకోలేక, ఉద్యోగాలు వదిలివేస్తుంటాడు. జాలి హృదయం గల మేరియమ్మ అతణ్ణి మందలిస్తూనే, అతని పోషణ భారం వహిస్తుంది. చిత్రాలు గీసి డబ్బులు సంపాదించమని, వాటికి తనే డబ్బు చెల్లిస్తుంటుంది. ఒకరోజు అనుకోకుండా రాజు, ఆ వూరిలో ధనవంతుడు, రామనాథ్, (గుమ్మడి) తమ్ముని కూతురు రాణి (జమున)ని కలుసుకుంటాడు. ఆమె అతనికి సాయం చేయాలని అతనితో చిత్రం గీయించుకుంటానని, పిలిచి, తన స్నేహితురాలు (పనిమనిషి) ఆశ (విజయలలిత)ను రాణిగా చెప్పి, అతనితో తమాషా చేస్తుంది. ఆపైన అతన్ని ప్రేమిస్తుంది. రాజుకూడా ఆమె పేద పిల్ల అని ప్రేమిస్తాడు. ఒకసారి డబ్బుతో పర్స్ పోగొట్టుకున్న రామనాథంకి దాన్ని తెచ్చి ఇచ్చిన రాజు నిజాయితి మెచ్చి, అతనికి తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తాడు. ఆ కంపెనీలో అతనికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఇంతలో రాజు, తన తమ్ముని కుమార్తె రాణిని ప్రేమించాడని తెలిసి రామనాథం ఆమెనుండి అతన్ని దూరం చేయాలని రాణిని మందలిస్తాడు. ఈలోపు ఆ కంపెనీలో తయారైన కల్తీ మందుల వలన జ్వరంతో బాధపడుతున్న మేరియమ్మ వాటిని రాజు ద్వారా వాడడంవల్ల దాంతో ఆమె మరణిస్తుంది.
హత్యానేరంపై జైలుపాలయిన రాజును రక్షించటానికి రాణి ప్రయత్నించటం, దాన్ని విఫలం చెయ్యాలని రాణి బాబాయి రామనాథం అడ్డుకోవటం, చివరికి కోర్టులో రామనాథం తన తప్పులను ఒప్పుకోవటంతో అతను అరెస్ట్‌కాబడి, రాజు నిర్దోషిగా బయటకు వస్తాడు. రాణి, రాజుల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో ఆఫీసు గుమాస్తాగా రేలంగి, గుమ్మడి వ్యాపార సలహాదారునిగా అల్లు రామలింగయ్య, మేరియమ్మకు ఇంట్లో తోడుగా వుండే వ్యక్తి కాశిం తాతగా ముక్కామల నటించారు.
దర్శకులు అడ్డాల నారాయణరావు సన్నివేశాలను ఎంతో అర్ధవంతంగా రూపొందించి చిత్రీకరించారు. మేరియమ్మను, రాజు జీతం వచ్చాక హోటల్‌కి తీసికెళ్ళటం, రాణి తన మనసు అర్ధంచేసుకోలేదని రాజును ఓ పాటలో ఉడికించటం ‘చందమామ రమ్మంది చూడు’ అడవి మనిషివి నీవు, దానికి కృష్ణ రియాక్షన్ (గానం పి.సుశీల, ఘంటసాల రచన సి.నా.రె) మరో సన్నివేశంలో రాతిపై బొమ్మగీసి ఆమెతో తన ప్రేమ చెప్పుకోవాలని రాజు ప్రయత్నించటం, ఇంతలో రాణి ముందుగా తన ప్రేమను చెప్పి ‘బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు’అంటూ అల్లరి పెట్టడం (గానం పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ రచన డా.సి.నా.రె) తొలుత సైకిళ్ళపై స్నేహితురాళ్ళతో జమున, విజయలలిత వారికి ముందు కృష్ణ, చుట్టూ తోటలు జింకలతో చక్కని ప్రకృతిలో చిత్రీకరించిన గీతం ‘‘పూవులలో తీవెలలో పొంగెనులే అందాలు’’(పి.సుశీల బృందం- రచన సి.నా.రె) రాజుకు దూరమయ్యాక వేదనతో రాణి ఇంట్లో పాడే గీతం ‘‘పోలేవు నీవు రాలేను నేను నీ దారిలోనే’’(పి.సుశీల రచన సి.నా.రె.) దేవులపల్లి కృష్ణశాస్ర్తీ రచించిన రెండు గీతాలు, రాణి పుట్టినరోజునాడు నిజం తెలిసి రాజు పాడే గీతం విజయలలిత నృత్యం, జమున, గుమ్మడి, కృష్ణల రియాక్షన్స్‌తో సాగుతుంది. ‘అనుకోనా ఇది నిజమనుకోనా’ (పి.బి.శ్రీనివాస్) చిత్రం ప్రారంభంలో కృష్ణపై హుస్సేన్‌సాగర్ హైద్రాబాద్ నగరం ముఖ్య స్థలాలు చూపుతూ చిత్రీకరించిన గీతం ‘‘మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా’’ (గానం- ఘంటసాల) చిత్రంలోని సన్నివేశాలను, గీతాలను ఆకట్టుకునేలా, ఎంతో పరిణితితో (2 చిత్రాలు మాత్రమే దర్శకత్వం వహించినా) తీర్చిదిద్దటం ఎన్నదగిన అంశం. ఇక రాజుగా, కృష్ణ ఆ పాత్రకు తగిన హావభావాలను తన యుక్తమైన, నటనతో మెప్పించారు. అల్లరి ప్రేమికురాలిగా అంతలోనే బాధ్యత, పరిణితి గల యువతిగా సన్నివేశానుగుణమైన పరిపూర్ణత జమున నటనలో చూపటం, మేరియమ్మగా పాత్రకు తగిన నిండుదనాన్ని, దయ, కరుణ, ప్రేమ, కరుకుదనం, ఆప్యాయత మొదలైన లక్షణాలు ఎంతో వైవిధ్యంగా నటించి, జి.వరలక్ష్మి తన ప్రతిభ చూపటం, రామనాథంగా గుమ్మడి ఓ పెద్దమనిషిగా సంస్కారం, తన వ్యాపారం దెబ్బతినబోతుంటే దాన్ని నిలబెట్టుకునే కుటిలత్వం, క్రౌర్యం, చివర ఓ అమాయకుని రక్షించాలని, రాణి చెప్పినట్టు మన సాక్షిగా నేరం అంగీకరించటం, విలనినీ, సౌమ్యతను మేళలించిన నటనను అలవోకగా ప్రదర్శించారు. సంగీతపరంగా ఈ చిత్ర గీతాలు బి.శంకర్ కూర్చిన బాణీలతో అలరించేలా తీర్చిదిద్దబడ్డాయి. ఈ చిత్రంలో హోటల్‌లో చిత్రీకరించిన జానపద గీతం ‘‘పట్నంలో శాలిబండ పేరైన గోలుకొండ’’(గానం ఎల్.ఆర్. ఈశ్వరి, రచన- వేణుగోపాల్) దానికి తగ్గ నృత్యంతో, అలరించటం ఆనంద దాయకం, హిందీ చిత్రానికి శంకర్ జైకిషన్ సంగీత సారధ్యం వహించి, ఆ చిత్ర గీతాలను అలరించే రీతిలో సాగించగా, బి.శంకర్ సంగీత దర్శకునిగా తక్కువ చిత్రాలకు పనిచేసినా, ఈ చిత్రాన్ని చక్కని స్వరాలతో ‘‘చందమామ రమ్మంది చూడు’’, ‘‘పట్నంలో శాలిబండ’’పాటలు ఈనాటికీ శ్రోతలను అలరించటం, మిగిలిన గీతాలు వీనుల విందుగా తీర్చిదిద్దటం విశేషం. ‘అమాయకుడు’ ఓ మంచి వ్యక్తి జీవితంలోని ఆటుపోట్లకు ఆలవాలంగా నిలవటంతో సక్సెస్‌తో సంబంధం లేకుండా, మానసికోల్లాసం కలిగించే చిత్రంగా ప్రశంసలు చూరగొనటం ఎన్నదగిన అంశం.
==నటీనటులు==
* [[కృష్ణ]]
"https://te.wikipedia.org/wiki/అమాయకుడు" నుండి వెలికితీశారు