శ్రీకృష్ణ మాయ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భానుమతి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
[[కన్నాంబ]], [[కడారు నాగభూషణం]] దంపతులు నెలకొల్పిన శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ బ్యానర్ మీద వారి అల్లుడు సి.ఎస్.రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం '''శ్రీకృష్ణమాయ'''. వారణాసి సీతారామశాస్త్రి ‘నారద సంసారం’ నాటకం ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం [[1958]], [[జూన్ 12]]వ తేదీన విడుదలయింది.
==సాంకేతిక వర్గం==
ఈ చిత్రానికి కథ శ్రీ వారణాసి సీతారామశాస్ర్తీ, మాటలు-రావూరు వేంకట సత్యన్నారాయణరావు, పాటలు: కీ.శే.వారణాసి సీతారామశాస్ర్తీ, పద్యాలు- రావూరు, బి.వి.యన్.ఆచార్య, సంగీతం- టి.వి. రాజు, ఛాయాగ్రహణం- కమల్‌ఘోష్, నృత్యం- వెంపటి సత్యం, కూర్పు- ఎన్.కె.గోపాల్, దర్శకత్వం- సి.ఎస్.రావు.
==నటీనటులు==
==కథ==
శాంతి మంత్రం ఋషులు పఠిస్తుండగా ఇంద్రసభ ప్రారంభం అవుతుంది. ఇంద్రుడు (రాజనాల) దేవ పారిజాత వృక్షాన్ని, శ్రీకృష్ణ తులాభారం ద్వారా తమకు దక్కించినందుకు నారద మహర్షి (అక్కినేని)కి కృతజ్ఞతలు తెలియచేయగా నారదుడు, ఆ పొగడ్తలకు గర్వోన్నతుడై త్రిమూర్తులను హేళనచేస్తాడు. తాను మాయాతీతుడని ప్రకటిస్తాడు.
 
ద్వారకలో సత్యభామతో చదరంగమాడుతున్న శ్రీకృష్ణుడు (ఈలపాట రఘురామయ్య) నారదునికి జ్ఞానం కలిగించాలని, ఋషి దంపతులుగా ఓ ఆశ్రమం చేరి, అతనిలోని జ్ఞానాన్ని గ్రహించి, నారదుని ఓ నదిలో మునగమంటాడు. ఒడ్డున వున్న శ్రీకృష్ణుడు నారద వీణ మహతిని మాయ (జమున) అనే కోయ యువతిగా మార్చగా ఆమెతో, నది నుండి బయటకువచ్చిన నారదుడు ప్రేమ, పెళ్ళి, సంసారం సాగించటం, బహుసంతానంతో, లేమితో పలు అవస్థలకు లోనుకావటం, నారదుడన్న భావన, సంసారం తాపత్రయాలు భరించి, చివరకు శ్రీకృష్ణునిచే తిరిగి జ్ఞానాన్ని పొంది, పశ్చాత్తాపంతో వానిని శరణువేడడంతో చిత్రం ముగుస్తుంది. సృష్టిలోని సకల చరాచర జీవులు, ఆ జగన్మాత మహత్తర శక్తికి లోనయి నడువవలసిందేనని, తామే సర్వశక్తివంతులని విర్రవీగితే గర్వభంగం తప్పదన్న నీతితో రూపొందిన చిత్రం ‘శ్రీకృష్ణమాయ’.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_మాయ" నుండి వెలికితీశారు