గొల్లభామ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
దీని కథను గోపన్నకు ఇలా వివరించసాగాడు సిద్ధుడు. విక్రమపురి రాజ్యంలోని మహారాజు కామపాలుడు (ఎ.వి.సుబ్బారావు) ఒక గొల్లపడుచు (కృష్ణవేణి)ను చేపట్టాలని, అవకాశం కోసం చూసే స్త్రీలోలుడు. ఒకనాడు అడవిలో ఆమెను బలాత్కరించబోగా, అతని ఒరలోని కత్తితో అతన్ని ఆమె అంతం చేస్తుంది. ఆమెను బంధించబోయిన రాజభటుని నుంచి మరో దేశపు యువరాజు (రఘురామయ్య) ఆమెను కాపాడి, తన రాజ్యానికి తీసుకువెళ్లి, స్వయంప్రభ పేరుతో ఆమెకు సకల విద్యలు, చదువు, సంగీతం, నృత్యం, కత్తియుద్ధం మొదలైనవి నేర్పించి తన తల్లిదండ్రుల అనుమతితో ఆమెను వివాహం చేసుకుంటాడు.
 
ఒకనాడు తోటలో విహరిస్తున్న దంపతులను చూసి, స్వర్గంలోని మోహిని (అంజలీదేవి) యువరాజుపై మరులుగొంటుంది. పాముకాటుచే యువరాజును చంపించి, ఆ దేహాన్ని తనతో దేవలోకానికి తీసుకువెళుతుంది. అతనికి జీవం పోసి, తనను వరించమని కోరుతుంది. కాదంటే అతని భార్యను, వంశాన్ని నాశనం చేస్తాననటం, ఒక్క రాత్రి తన భార్యతో గడిపి ఆమెకు లొంగిపోతానని మాట ఇస్తాడు యువరాజు. ఆ ప్రకారం స్వర్గానికి వచ్చిన భార్యతో ఒక రేయి గడిపి, ఆ ఆనందంలో అక్కడ అమృతం దంపతులు సేవిస్తారు. తిరిగి మరునాడు భూలోకంలో రాణీవాసానికి వచ్చిన స్వయంప్రభ, భర్తను కలిసిన విషయం చెప్పినా ఎవరూ నమ్మరు. కొంతకాలానికి గర్భవతియైన ఆమెను అడవిలో వధించమని మహారాజు అనుజ్ఞ ఇవ్వటం, అమృతం సేవించిన కారణంగా ఆమెకు మరణం కలగకపోవడం, అక్కడనుంచి ఒక కోయగూడెంలో బాబును ప్రసవించి, అతడు దూరం కావడంతో ఉదయార్కుని పట్టణంలో ఓ వేశ్య ఇంట 18 సంవత్సరాలు గడుపుతుంది. ఆమె కొడుకు ఆ దేశ యువరాజుగా పెరుగుతాడు. ఆమె రూప లావణ్యాలు తగ్గకపోవటంతో, స్వయంప్రభను కలవాలని వెళ్లిన కుమారుని గుర్తించిన స్వయంప్రభ విచారంతో అక్కడినుండి వెళ్లి అడవిలో కార్చిచ్చుబడి ఒక గొల్లవానిచే కాపడబడి, వారింట ఆశ్రయం పొందుతుంది. దేవలోకంలో మోహిని, యువరాజుపై ప్రయోగించిన సృతిభంగం మందు కొన్నేళ్ళకి పనిచేయక, యువరాజు వేడికోలుపై మోహిని అతన్ని భూమికి పంపించివేస్తుంది. తల్లిదండ్రుల వద్దకు వచ్చిన యువరాజు, తన భార్య గురించి నిజం తెలియచేసి ఆమెకై వెదుకులాట మొదలుపెట్టి రాజ్యాలు తిరుగుతూ ఆమె వున్న గ్రామం చేరుకుంటాడు. ఆ గుర్రం ధాటికి చల్లనమ్మబోయిన ప్రభ కుండలు పగిలి చల్ల చిందగా, ఆమె నవ్వటం చూసి ప్రశ్నించిన యువరాజుకు తన కథను భూపతి భూపతి పద్యంగా వివరించటం, అది విన్న ఆమె భర్త, ఇంతలో అక్కడకు వచ్చిన ఆమె కుమారుడు నిజం తెలుసుకొని అందరూ ఏకం కావటంతో చిత్రం సుఖాంతమవుతుంది<ref>[http://www.andhrabhoomi.net/content/flashback50-10 గొల్లభామ -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 09-06-2018]</ref>..
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/గొల్లభామ_(సినిమా)" నుండి వెలికితీశారు