గొల్లభామ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
==కథ==
కాశీ వెళుతున్న మణిసిద్ధుడనే గురువు, గొల్లగోపన్నకు దారిలో కథలు చెబుతుంటాడు. ఓనాడు దారిలో గొల్లభామ తలపై కుండతో, పక్కన రాకుమారుడు గల శిల్పం అక్కడగల ఓ పద్యం చూసి, దీని కథను అడగటంతో చిత్రం ప్రారంభం ఆ పద్యం, కథకు ఆధారం.
<poem>
‘'నృపతి చంపితిన్, మగడు భూరిభుజంగము చేత చచ్చే నే
నాపద చెంది చెంది ఉదయార్కుని పట్టణమేగి, వేశ్యనై
Line 47 ⟶ 48:
తాపము చెంది అగ్ని పడి దగ్ధముగా కిటు గొల్లభామనై
రుూ పని కొప్పుకొంటి నృపతీ వగపేటికి చల్లచిందినన్’’
</poem>
 
దీని కథను గోపన్నకు ఇలా వివరించసాగాడు సిద్ధుడు. విక్రమపురి రాజ్యంలోని మహారాజు కామపాలుడు (ఎ.వి.సుబ్బారావు) ఒక గొల్లపడుచు (కృష్ణవేణి)ను చేపట్టాలని, అవకాశం కోసం చూసే స్త్రీలోలుడు. ఒకనాడు అడవిలో ఆమెను బలాత్కరించబోగా, అతని ఒరలోని కత్తితో అతన్ని ఆమె అంతం చేస్తుంది. ఆమెను బంధించబోయిన రాజభటుని నుంచి మరో దేశపు యువరాజు (రఘురామయ్య) ఆమెను కాపాడి, తన రాజ్యానికి తీసుకువెళ్లి, స్వయంప్రభ పేరుతో ఆమెకు సకల విద్యలు, చదువు, సంగీతం, నృత్యం, కత్తియుద్ధం మొదలైనవి నేర్పించి తన తల్లిదండ్రుల అనుమతితో ఆమెను వివాహం చేసుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/గొల్లభామ_(సినిమా)" నుండి వెలికితీశారు