రజాకార్లు: కూర్పుల మధ్య తేడాలు

యూట్యూబ్ లింక్స్ వద్దు
పంక్తి 43:
రెండోసారి రజాకార్లు 150 మందితో గ్రామంపై దాడికి దిగారు. ప్రజలు వారిని ఎదురించి వడిసెల్లో రాళ్లు పోసి కొట్టి 20 మంది రాజాకార్లను చంపారు. ఈ ఘటనలో ఐదుగురు గ్రామస్థులు చనిపోయారు. రెండుసార్లు విఫలమైన రజాకార్లు గ్రామంపై ప్రతీకారాన్ని పెంచుకున్నారు. గ్రామ ప్రజల్లో మాత్రం రజాకార్లను ఎదురించగలమనే ధైర్యం, విశ్వాసం పెరిగింది. గ్రామస్థులు మాత్రం రాత్రింబవళ్లు నిద్రపోకుండా పహారా కాస్తు రజాకారుల, ముష్కర మూకల నుంచి కాపాడుకుంటూ వచ్చారు.
 
'''బైరాన్‌పల్లికి ఆగస్టు 27 చీకటిదినం:''' రెండుసార్లు రజాకార్లను తరిమికొట్టిన ధీమాతో ఏ క్షణమైనా తమపై ఎదురుదాడికి రజాకార్లు పాల్పడవచ్చని, దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామ యువకులు నిశ్చయించుకున్నారు. రాత్రి ఎప్పటిలాగానే గెరిల్లా దళం గ్రామస్తులకు ధైర్యం చెప్పి వెళ్లింది. జనం నిద్రలోకి జారుకున్నారు. 1948 ఆగస్టు 27న ఉదయం 3 గంటలకు 1200 మంది పోలీసులు, రజాకార్లు నలుదిక్కుల నుంచి గ్రామాన్ని చుట్టుముట్టారు. కాలకృత్యాల కోసం ఊరిబయటికి వచ్చి రజాకార్లకు పట్టుబడి తప్పించుకున్న ఉల్లెంగల వెంకటనర్సయ్య రజాకార్లు వచ్చారంటూ వేసిన కేకలకు బురుజుపై యుద్ధనగారా మోగడంతో గ్రామరక్షణ దళంతోపాటు జనమంతా అప్రమత్తమయ్యారు. కాల్పులు జరుపుతూ మిల్ట్రీ గ్రామానికి చేరుకుంది.
'''[[బైరాన్‌పల్లి]]కి ఆగస్టు 27 చీకటిదినం'''
 
రెండుసార్లు రజాకార్లను తరిమికొట్టిన ధీమాతో ఏ క్షణమైనా తమపై ఎదురుదాడికి రజాకార్లు పాల్పడవచ్చని, దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామ యువకులు నిశ్చయించుకున్నారు. రాత్రి ఎప్పటిలాగానే గెరిల్లా దళం గ్రామస్తులకు ధైర్యం చెప్పి వెళ్లింది. జనం నిద్రలోకి జారుకున్నారు. 1948 ఆగస్టు 27న ఉదయం 3 గంటలకు 1200 మంది పోలీసులు, రజాకార్లు నలుదిక్కుల నుంచి గ్రామాన్ని చుట్టుముట్టారు. కాలకృత్యాల కోసం ఊరిబయటికి వచ్చి రజాకార్లకు పట్టుబడి తప్పించుకున్న ఉల్లెంగల వెంకటనర్సయ్య రజాకార్లు వచ్చారంటూ వేసిన కేకలకు బురుజుపై యుద్ధనగారా మోగడంతో గ్రామరక్షణ దళంతోపాటు జనమంతా అప్రమత్తమయ్యారు. కాల్పులు జరుపుతూ మిల్ట్రీ గ్రామానికి చేరుకుంది.
 
బురుజుపై ఉన్న గ్రామరక్షక దళం సభ్యులు జెజ్జాయితో కాల్పులు జరుపుతూనే ఉన్నారు. రజాకార్లు ఫిరంగితో రెండు తోపుబాంబులు వేయగా అవికాస్త గురితప్పాయి. మూడో గుండు బురుజుపై పడటంతో మోటం రామయ్య, మోటం పోశయ్య, బలిజె భూమయ్యతోపాటు మరికొందరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రధాన రక్షణ కేంద్రం ఎదురుదాడిలో దెబ్బతినడంతో సైనికులు గ్రామంలోకి చొరబడ్డారు. పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజలందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బురుజుపైన, ఇళ్లల్లో దొరికిన వారిని దొరికినట్లుగా లెంకలు కట్టి ఆడమగ తేడా లేకుండా వరుసగా నిలబెట్టి కాల్పులు జరపడంతో గ్రామంలోని వాడలన్నీ శవాలతో నిండిపోయి శ్మశానాన్ని తలపించాయి.
"https://te.wikipedia.org/wiki/రజాకార్లు" నుండి వెలికితీశారు