ఆకాశవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
1938 జూన్ 25 రాత్రి తొలిగా జానపద సంగీతం ప్రసారమైంది. మద్రాసు ప్రసారాల తొలి తెలుగు వ్యాఖ్యాత మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ సోదరుడు). ఆయన రేడియో తాతయ్యగా పిల్లల కార్యక్రమాల ద్వారా సుప్రసిద్ధులు.<ref>''ఆకాశవాణి... వార్తలు చదువుతున్నది...'' శీర్షికన [[సుధామ]] రాసిన వ్యాసం([[తెలుగు వెలుగు]]; ఫిబ్రవరి 2014 సంచిక)</ref>
=== హైదారాబాద్, విజయవాడ కేంద్రాల ప్రారంభం ===
[[దస్త్రం:పసిడిమెరుంగుల తళతళలు - గానం – భానుమతి , రజని గార్లు.ogg|thumb|[[భానుమతీ రామకృష్ణ|భానుమతి]], రజనీకాంతరావులు[[బాలాంత్రపు రజనీకాంత రావు]]లు పాడిన పసిడిమెరుంగుల తళతళలు విజయవాడ కేంద్రం ప్రారంభ గీతికగా ప్రసారం చేశారు.<ref>[http://eemaata.com/em/issues/200101/616.html తెలుగు సంగీతంలో రజనీ - పరుచూరి శ్రీనివాస్ - ఈమాట]</ref>]]
ఆకాశవాణి మద్రాసు కేంద్రం తెలుగులో తొలి ప్రసారాలు చేయగా 1948 అక్టోబరు 12న తొలి తెలుగు రేడియో స్టేషనుగా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అదే సంవత్సరం డిసెంబరు 1 నుంచి విజయవాడ కేంద్రం ప్రసారాలు ప్రారంభించింది. 1933లో హైదారాబాద్ చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200వాట్ల శక్తిగల రేడియోకేంద్రం స్థాపించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3న నిజాం తన అదుపులోకి తీసుకున్నారు. ''దక్కన్ రేడియో''గా 7వ అసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాము ఉర్దూ ప్రసారాలతో ప్రారంభించినా పరిమితంగా తెలుగు, [[కన్నడ]], మరాఠీ కార్యక్రమాలుండేవని తొలి తెలుగు రేడియో కార్యక్రమాల గురించి పరిశోధించిన విశ్రాంత ఆకాశవాణి ఉద్యోగి సుధామ పేర్కొన్నారు. స్టూడియో సరూర్ నగర్ నుంచి [[ఖైరతాబాద్]] యావర్ మంజిల్ కు తరలింది. 1948 డిసెంబరు 1నాటికి 800వాట్ల శక్తితో షార్ట్ వేవ్, మీడియం వేవ్ లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు [[మాడపాటి హనుమంతరావు]] ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. 1950లో దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆలిండియా రేడియో హైదారాబాద్ కేంద్రంగా మార్చింది. హైదారాబాద్, విజయవాడ కేంద్రాలు తెలుగులో విజ్ఞాన వినోదాలను మేళవించి రూపొందించిన వివిధ కార్యక్రమాలతో తెలుగు జనజీవితంలో భాగమయ్యాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఆకాశవాణి" నుండి వెలికితీశారు