ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2405:204:671F:D970:A039:8ACE:2AAF:9706 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2478860 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 6:
''కురబ '' జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీరప్పలు, రాయలసీమలో [[గొరవయ్యలు]] అని వీరిని పిలుస్తారు. వైవిధ్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహిత వర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం [[ఒగ్గు]] ([[ఢమరుకం]]) ఉపయోగించి చెప్పే వృత్తి [[పురాణం]] గురించి తెల్సుకోవడం అంటే [[కురుమ జాతి]] చరిత్ర, సంస్కృతుల్ గురించి తెలుసుకోవట మన్నమాట. [[ఒగ్గు దీక్ష]] ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది. ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు [[మంత్రం]] బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు [[బీరన్న, మల్లన్న కథలు]] చెప్పేందుకి అర్హత సంపాదించు కొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని [[విగ్రహాలు]] పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.
==పుట్టుక==
ఒగ్గు కళారూపం శైవమత వాప్తిలో ప్రచార మాద్యమంగా ఉద్భవించి ఉంటుంది. ఎందుకంటే [[పాల్కురికి సోమనాథుడు|పాల్కురికి సోమనాధుడు]] తెలంగాణ ప్రాంతంలో పుట్టి, శైవమత వ్యాప్తికి విశేషమైన కృషి చేసారు. అటువంటి గొప్పవ్యక్తి ప్రభావం ఈ ప్రాంతంలో కళలపై ఉందనడానికి నిదర్శనం ఒగ్గు కథ. ఈ కథల ఇతివృత్తాల్లో [[శివుడు]] కథానాయకుడిగా ఉంటాడు. లేదా శివుని అంశతో జన్మించిన వారు నాయకులుగా ఉంటారు. ఉదాహరణకు శివుని తొలి [[చెమట]] నుండి బీరప్ప మలి చెమట నుంచి మల్లన్న పుట్టారని, ఎల్లమ్మ శివుని కూతురని ఆయా కథల్లో వివరిస్తుంటారు.
కృషి చేసారు. అటువంటి గొప్పవ్యక్తి ప్రభావం ఈ ప్రాంతంలో కళలపై ఉందనడానికి నిదర్శనం ఒగ్గు కథ. ఈ కథల ఇతివృత్తాల్లో [[శివుడు]] కథానాయకుడిగా ఉంటాడు. లేదా శివుని అంశతో జన్మించిన వారు నాయకులుగా ఉంటారు. ఉదాహరణకు శివుని తొలి [[చెమట]] నుండి బీరప్ప మలి చెమట నుంచి మల్లన్న పుట్టారని, ఎల్లమ్మ శివుని కూతురని ఆయా కథల్లో వివరిస్తుంటారు.
 
ఒగ్గుకథల్ని తెలంగాణ ప్రాంతంలోని గొల్ల, కుర్మలు తమ కుల పురాణంగా భావిస్తారు. కుర్మలు ఈ కథల్ని ఎక్కువ ప్రచారం చేసారు. తరువాతి కాలంలో ఇతర కులాల వాళ్ళు కూడా ఈ కళారూపాన్ని నేర్చుకొని ప్రచారం చేసారు. ఇటువంటి వారి సంఖ్య చాల తక్కువ. బీరప్ప, మల్లయ్య కథలు మెదటి నుంచి ఉన్నాయి.ఆ తరువాత ఇతర కథలు పుట్టుకొచ్చాయి.
 
==కళారూపం==
ఒగ్గు కళారూపం చూస్తుంటే ఒక నాటకం చూసిన అనుభూతి, ఒక నాట్యకళని వీక్షించినంత ఆనందం, ఒక ప్రవచనం విన్నంత సంతృప్తి, ఒక సంగీత కచేరిలో దొరికేంత రసాస్వాదన లభిస్తుంది.అదోక సముద్రం. శ్రోతలు తమకు కావల్సిన ఆనందాన్ని కళ్ళ దోసిళ్ళతో తీసుకపోతారో లేక మనస్సు కుండల్లో పట్టుకెల్తారో వారిష్టం. ఇక ఒగ్గుకథా ప్రదర్శనా తీరుతెన్నుల్ని గమనిస్తే...
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు