కలిసొచ్చిన అదృష్టం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedian 1988, పేజీ కలసొచ్చిన ఆదర్శం ను కలిసొచ్చిన అదృష్టం కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[కాంచన]]|
}}
'''కలిసొచ్చిన అదృష్టం''' [[1968]], [[ఆగస్ట్ 10]]వ తేదీన ఎస్.వి.ఎస్. ఫిలిమ్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా.దీనిలో ఎన్.టి.రామారావు, కాంచనలు నాయకా నాయికలు. [[కె.విశ్వనాథ్]] ఈ సినిమా దర్శకుడు. ఈ చిత్ర నిర్మాత మిద్దే జగన్నాథరావు [[విజయవాడ]] లక్ష్మీ టాకీస్ థియేటర్ యజమాని మరియు ఎన్.టి.రామారావు మిత్రుడు. ఇతడు ఈ సినిమాకు పూర్వం జలరుహ ప్రొడక్షన్స్‌పై ‘[[రాజనందిని]]’ నిర్మించాడు.
 
 
==కథ==
జమిందారు రావుబహద్దుర్ రాఘవేంద్రరావు, గర్భవతియైన భార్య శారదతో కలిసి ప్రయాణిస్తూ, ఆమెకు నొప్పులు రావటంచేత, దగ్గరలోని ఓ ఆసుపత్రిలో చేరుస్తాడు. ఆ ప్రసవంలో భార్యా, బిడ్డ మరణిస్తారు. అదే ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన పార్వతి (శాంతకుమారి) పేదరాలు. బహు సంతానం, అసమర్ధుడైన సోమరి భర్తతో ఇబ్బందులు పడుతుంటుంది. ఆమెకు మగపిల్లవాడు జన్మిస్తాడు. జమిందారు, ఆమెను వేడుకొని, ఆ బిడ్డని తనతో తెచ్చి పెంచి పెద్దచేసి ప్రయోజకుడిని చేస్తాడు. అతడు ప్రకాష్ (ఎన్.టి.రామారావు) ప్రక్కన పల్లెటూరిలో వడ్డీ వ్యాపారి, లోభి పానకాలు (ధూళిపాళ) పేద రైతులను పీడించుకు తింటుంటాడు. అతని కూతురు శోభాదేవి (కాంచన), కొడుకు గణపతి (రాజ్‌బాబు), శోభాదేవి, ప్రకాష్ ప్రేమించుకుంటారు. ఆ వూరిలోనే భర్తను పోగొట్టుకున్న పార్వతమ్మ ఓ కొడుకు రంగడు (సత్యనారాయణ) అప్రయోజకుడు సోమరి, దొంగబుద్ధి కలవాడు. కూతురు గౌరి (సంధ్యారాణి) తల్లితోపాటు కష్టపడుతుంది. వారి మేనమామ కోటయ్య (మిక్కిలినేని) కూతురు లక్ష్మి(సుకన్య)ని రంగడికిచ్చి పెళ్ళిచేసి, రోజూ విచారిస్తుంటాడు. ఆ పల్లెటూరు వచ్చిన ప్రకాష్‌ను పార్వతమ్మ గుర్తించి, జమిందారును కలిసి నిర్ధారించుకుంటుంది. జబ్బుచేసి జమిందారు మరణించగా నౌకరు రామయ్య (మల్లాది)వల్ల పార్వతమ్మ, తన తల్లి అని ప్రకాష్ తెలుసుకుంటాడు. తల్లిని ఒప్పించి, వారందరిని తనతో పట్నం తీసుకువస్తాడు. డబ్బు చేతికివచ్చిన రంగడు, మేనేజర్ భూపతి(ప్రభాకర్‌రెడ్డి) స్నేహంతో మరింత వ్యసనపరుడుగా మారతాడు. భార్యను ఏలుకోవటంకోసం రంగడికి ఆస్తి రాసిచ్చిన ప్రకాష్‌ను కాదని, తన కూతురు శోభను రంగడికి రెండో పెళ్ళికి పానకాలు సిద్ధపడడం, తల్లిని, చెల్లిని, లక్ష్మిని హింసిస్తున్న రండికి బుద్ధిచెప్పటానికి ప్రకాష్ సర్ధార్జీగా మారువేషంలో వచ్చి, శోభతో రంగడి పెళ్ళి చెడగొట్టి, పరిస్థితులు చక్కపెట్టడం, ప్రకాష్, శోభల, గౌరి, గణపతిల వివాహం చెడగొట్టాలని, భుజంగంతో కలిసి వెళ్ళిన రంగడు, ప్రకాష్‌ను తుపాకీతో కాల్చటం, అది చూసిన పార్వతమ్మ రంగడిని తుపాకిలో చంపపోవటం, ప్రకాష్, లక్ష్మి వచ్చి వారించటం, ఈ సంఘటన రంగడిలో పరివర్తన కలిగించి, అందర్నీ క్షమించమని కోరటంతో చిత్రం ముగుస్తుంది.
==తారాగణం==
* [[నందమూరి తారక రామారావు]],<br>[[కాంచన]] - ప్రకాష్
* [[కాంచన]] - శోభాదేవి
* [[శాంతకుమారి]] - పార్వతి
* [[ధూళిపాళ సీతారామశాస్త్రి]] - పానకాలు
* [[రాజబాబు]] - గణపతి
* [[కైకాల సత్యనారాయణ]] - రంగడు
* [[సంధ్యారాణి (నటి)|సంధ్యారాణి]] -గౌరి
* [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి|మిక్కిలినేని]] - కోటయ్య
* సుకన్య - లక్ష్మి
* మల్లాది - నౌకరు రామయ్య
* [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకర రెడ్డి]] - మేనేజర్ భూపతి
* [[అల్లు రామలింగయ్య]] - శఠగోపం
* [[విజయలలిత]] - డాన్సర్‌
==సాంకేతికవర్గం==
* కథ- పినిశెట్టి,
* కళ-తోట,
* స్టంట్స్- సాంబశివరావు,
* ఛాయాగ్రహణం- కె.ఎస్.రామకృష్ణ,
* నృత్యం- చిన్ని- సంపత్,
* సంగీతం- టి.వి.రాజు,
* కూర్పు- బి.గోపాలరావు,
* స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- కె.విశ్వనాథ్,
* నిర్మాత- మిద్దే జగన్నాథరావు.
==పాటలు==
‘’. సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డిలపై చిత్రీకరణ. (ఎల్.ఆర్.ఈశ్వరి- రచన కొసరాజు) సి.నా.రె, కొసరాజుల సాహిత్యానికి టి.వి.రాజు అందించిన సంగీతంతో పాటలు అలరించేలా సాగాయి. ఆర్థికంగా సక్సెస్ అంతగా సాధించకపోయిన ‘కలిసొచ్చిన అదృష్టం’చిత్రం. అన్ని హంగులతో, పాటలతో చక్కని కాలక్షేప చిత్రంగా నిలవటం విశేషం.
{| class="wikitable"
|-
Line 21 ⟶ 46:
! గాయకులు
|-
|అమ్మా నీవు నా అమ్మవుకావా అమ్మా
|[[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె]]
|[[టి.వి. రాజు]]
|[[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]]
|-
|వందనాలు గైకొనుడయ్యా
|సినారె
|
|[[టి.వి. రాజు]]
|[[మాధవపెద్ది సత్యం|మాధవపెద్ది]] , ఘంటసాల, [[పి.సుశీల]] బృందం
|
|-
|పట్టండి నాగలి పట్టండి, కట్టండి
|
|సినారె
|
|[[టి.వి. రాజు]]
|ఘంటసాల, [[యల్.ఆర్.ఈశ్వరి]] బృందం
|
|-
|తాపం, తాపం అయ్యో ఏంతాపం
|
|సినారె
|
|[[టి.వి. రాజు]]
| పిఠాపురం, జమునారాణి
|
|-
|పచ్చ, పచ్చని చిలుకా
|సినారె
|టి.వి. రాజు
|ఘంటసాల, పి.సుశీల బృందం
|-
|ఈ ప్రేమపాఠం నీ ప్రేమకోసం ప్రియా
|సినారె
|టి.వి. రాజు
|ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి
|-
|అంతకోపమా వద్దువద్దు, ఓ నజరానా జర ఇధరానా
|సినారె
|టి.వి. రాజు
|ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి
|-
|నిన్ను చూడందే నా వలపు ఆరదు
|[[కొసరాజు రాఘవయ్యచౌదరి|కొసరాజు]]
|టి.వి. రాజు
|ఎల్.ఆర్.ఈశ్వరి
|}
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కలిసొచ్చిన_అదృష్టం" నుండి వెలికితీశారు