బంగారు గాజులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
==కథ==
కోటిపల్లిలో రామూ (ఎ.ఎన్.ఆర్) రాధ (విజయనిర్మల) అన్నాచెల్లెళ్లు అన్యోన్యంగా జీవిస్తుంటారు. రాముకు చెల్లెలంటే పంచప్రాణాలు. ఆ వూరి రైసుమిల్లు యజమాని రావూజి (నాగభూషణం) అతని అనుచరుడు దాసు (జగ్గారావు), రామూ ఆ మిల్లులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. రావూజి స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలు చేస్తూ పైకి మంచి వానిలా నటిస్తుంటాడు. వ్యసనపరుడైన రావూజి ఒకనాడు రాము వూరిలో లేని సమయంలో రాధను బలవంతం చేస్తాడు. అతన్నించి తప్పించుకున్న రాధ ఓ నదిలో దూకుతుంది. చెల్లెలికోసం వెదుకుతూ వచ్చిన రామూపై, అంతకుముందు తాము చంపిన సేఠ్‌జీ హత్యను రామూ పైకి నెట్టి, రావూజీ మరణించినట్టు రామూను దోషిగా చిత్రీకరిస్తారు. చెల్లెలుకోసం వెదకుచూ రామూ హైద్రాబాద్ చేరి అక్కడ భూషయ్య (రేలంగి)వద్ద కారు డ్రైవర్‌గా చేరి, అంతకుముందు పరిచయంకల అవతారం (పద్మనాభం) ఇంట ఆశ్రయం పొందుతాడు. అక్కడ అతని చెల్లెలు శారద (భారతి) అతని తల్లి శాంతమ్మ (హేమలత) అతన్ని ఆదరిస్తారు. శారద, రామూను ప్రేమిస్తుంది. రవిగా, చలామణి అవుతున్న రామూ ఒకనాడు ఓ నృత్య ప్రదర్శనవద్ద తలకు గాయమైన రాధ (విజయనిర్మల)ను చూసి, తన రక్తమిచ్చి కాపాడుతాడు. ఆమె పోలీస్ ఆఫీసర్ చంద్రశేఖర్ (కాంతారావు) భర్త అని, ఆమె తండ్రి రామదాసు (గుమ్మడి) అని చెప్పినా నమ్మక ఆమె తన చెల్లెలుగా భావిస్తుంటాడు. రాధ కూడా అతన్ని అన్నగా ఆదరిస్తుంది. ఒకనాడు ప్రకాష్‌గా వేషం మార్చిన, రావూజీ, రాధ, రాములను చూసి, రవే, రామూ అని పోలీసులకు తెలియచేసి, రామూను అరెస్ట్ చేయిస్తాడు. ఒంటరిగా చిక్కిన రాధను బంధిస్తాడు. ఈ సంగతి తెలిసిన రామూ, అవతారం, శారదల సాయంతో జైలునించి తప్పించుకుని, రావూజీ డెన్ చేరి, వాళ్ళ గాంగ్‌తో పోరాడి రాధను విడిపించటం, ఈలోపు అక్కడకు వచ్చిన పోలీసులు, చంద్రశేఖర్, రావూజీని అరెస్ట్‌చేయటం,. మరో రాధను తీసికొని వచ్చిన రామదాసు, ఇద్దరూ రాధలు కవల పిల్లలని, తాను ఒకరిని పెంచుకున్నానని నిజం చెప్పటం, చెల్లెళ్ళిద్దరకూ, రామూ, బంగారుగాజుల తొడగడం, శారద, రామూల వివాహంతో చిత్రం సుఖాంతమవుతుంది<ref>[http://www.andhrabhoomi.net/content/flashback50-21 బంగారు గాజులు - ఎస్.వి.రామారావు, సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 11-08-2018]</ref>.
 
== పాటలు ==
# అ ఆలు వస్తెకాని ఐదు బళ్ళు రావండి ఆత్రంగా పైపైకి వస్తే - [[బి.వసంత]], [[మాధవపెద్ది సత్యం]] - రచన: [[కొసరాజు రాఘవయ్య]]
"https://te.wikipedia.org/wiki/బంగారు_గాజులు" నుండి వెలికితీశారు