భాగ్యచక్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[బి.సరోజాదేవి]]|
}}
1-7-1912న తాడిపత్రిలో జన్మించి, మద్రాస్‌లో బి.యస్.సి. చదివారు కదిరి వెంకటరెడ్డి (కె.వి.రెడ్డి). తొలుత రోహిణి సంస్థలో, తదుపరి వాహిని సంస్థలో నిర్మాణ వ్యవహారాలలో అనుభవం సంపాదించారు. వాహిని వారి భక్తపోతన (1942). చిత్రానికి తొలిసారి దర్శకత్వం చేపట్టి, అది విజయం సాధించటంతో ఆపైన పలు చిత్రాలు ‘వాహిని, విజయా సంస్థలు రూపొందించిన వాటికి దర్శకత్వం వహించి వాసి గడించారు. నిర్మాతగా జయంతి పిక్చర్స్ పతాకంపై ‘పెళ్ళినాటి ప్రమాణాలు’ (తెలుగు/తమిళం) ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. 1968లో వీరు జయంతి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం భాగ్యచక్రము.’
 
1941లో జగన్నాథ్ నిర్మించిన భాలే పెళ్ళి’చిత్రం ద్వారా రచయితగా పరిచయమైన విశిష్ట వ్యక్తి శ్రీ పింగళి నాగేంద్రరావు. సాహిత్యంలో, సంభాషణలలో నూతన పలుకుబడులను, తమాషా పదాల ప్రయోగాలను, ఆవిష్కరించిన సాహితీబ్రహ్మ శ్రీ పింగళి నాగేంద్రరావు. కె.వి.రెడ్డి, పింగళి కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందాయి. తిరిగి అదే పంథాలో భాగ్యచక్రము చిత్రానికి కథ, మాటలు, పాటలు పింగళి వారే సమకూర్చటం విశేషం.
భాగ్యచక్రము చిత్రానికి కథ, రచన-పింగళి నాగేంద్రరావు, కూర్పు- వాసు, కళ- గోఖలే, స్టంట్స్-శ్యామసుందర్, ఛాయాగ్రహణం- కమల్‌ఘోష్, నృత్యం- పసుమర్తి కృష్ణమూర్తి, సంగీతం- పెండ్యాల నాగేశ్వరరావు, నిర్మాత-పి.సి.రెడ్డి, దర్శకత్వం- కె.వి.రెడ్డి, సహ దర్శకులు- సింగీతం శ్రీనివాసరావు, కె.ఎస్.రెడ్డి.
నరేంద్రపురి ప్రభువు లింగమూర్తి (్ధర్మపాలుడు). ఆ రాజ్యంపై ఆశలు పెంచుకున్న పాముల మాంత్రికుడు రాజనాల (సిద్దయోగి) తన చెల్లెలు నాగమ్మ (బాలసరస్వతి)ను మహారాణిని చేయాలనే తలంపుతో రాకుమారిపై సర్ప ప్రయోగంచేసి, ఆ పాప బతకాలంటే తన సోదరిని వివాహం చేసుకోవాలని, మహారాజుకు షరతుపెడతాడు. ఆ విధంగా నాగమ్మ మహారాణి కావటం, రాజనాల, కామకళిక ద్వారా మహారాజును మార్చివేసి, రాకుమారి పాపను, పిండారిలచే చంపించ ప్రయత్నించి, అధికారం చేజిక్కించుకొని స్వామిరాజు పేరుతో పాలన సాగిస్తూ అన్యాయాలు, అక్రమాలు చేస్తుంటాడు. యువరాణి పాపను అడవిలో గజదొంగ గంద్రగోళి (ముక్కామల) కాపాడి పెంచి పెద్దచేస్తాడు. నాగమ్మకు పుట్టిన కుమార్తె యువరాణి చిత్రవతి (గీతాంజలి)గా పెరిగి పెద్దదవుతుంది. ఆమెను ఉదయగిరి యువరాజు విక్రమ్ (యన్.టి.రామారావు)కిచ్చి వివాహం చేయాలని నాగమ్మ, స్వామిరాజు ఆశిస్తారు. విక్రముడు అంతకు మునుపే అడవిలో యువరాణి పాప వనజ (బి.సరోజాదేవి)ను కలుసుకోవటం ఇరువురూ ఒకరినొకరు ప్రేమించుకోవటం జరుగుతుంది. తల్లి (ఋష్యేంద్రమణి) కోరికపై విక్రముడు, స్నేహితుడు మిత్రలాభం (పద్మనాభం)ను యువరాజుగా, తాను మారువేషంలో ఆషాడభూతి పేరుతో నరేంద్రపురి వెళ్ళి, అక్కడ బందీయైన వనజను, మతిచలించిన, మహారాజు రక్షించి, స్వామిరాజాను అంతంచేయటం చిత్రావతికి మిత్రలాభంకు, విక్రమ్‌కు, వనజకు, మహారాజు చేతులమీదుగా వివాహం జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో ఇంకా కాకినాడ రాజరత్నం దాసిగా, సేనాపతిగా జగ్గారావు, మంత్రిగా వడ్లమాని విశ్వనాథం, స్వామిభక్తుడుగా కె.వి.చలం, స్వామిరాజా దాసురాలిగా కనకడ, ఇంకా పి.జె.శర్మ, మల్లాది ఇతర పాత్రలు పోషించారు.
దర్శకులు కె.వి.రెడ్డి సన్నివేశాలను ఆసక్తికరంగా కొన్నిటిని తీర్చిదిద్దారు. అవి తొలుత రాజనాల, చిన్న రాకుమారి పాదముద్రల ఇసుక సేకరించి, వాటిని పూజించి, పాము మంత్రం ప్రయోగించటం, మహారాజుపై బి.సరోజాదేవిలపై కామకళిక ప్రయోగంకోసం నూరే మందులో ఎవరి ఉపయోగంకోసమో వారి రక్తం కలపటం తొలుత నాగమ్మ రక్తం మహారాజుకోసం, స్వామిరాజా రక్తం యువరాణికోసం వివరంగా చూపటం - ఆషాడభూతి వేషంలో యువరాజు లేపనం తయారుచేసి, అతని జాడ కనుగొనటం, ఆత్మధ్యానం అనే మందిరంలో అనేక మలుపులు, వాటిలో సైన్యంతో యువరాజు పోరాటం. అక్కడ చిన్నవాడు రాకుమారుని అంతంచేయబూనిన పిండారులను అడవిలోకి యువరాజు తరిమి అక్కడ గండ్రగోళిచేత బంధింపచేసి, వనజా రాకుమారి అని నిజం తెలియచెప్పించటం, ప్రేక్షకులకు తెలిసిన నిజం, పాత్రలకు తెలియచేయించటం స్వామిరాజా తనను విమర్శించిన యువకుని సింహాల బోనులో వేయించటం, చివర వనజను బంధించి అందులో వేయబోవటం, అంతకుముందు యువరాజును బంధించిన తలుపులు యువరాజు ఆరు సార్లు వేగంగా పరిగెత్తి ఢీకొని, బ్రద్దలుచేసుకొని బయటకువచ్చి, వివిధరకాల పోరాటంతో స్వామిరాజాను సింహానికి ఎరవేయటం విపులంగా చిత్రీకరించారు. రాజనాల, ఎన్.టి.ఆర్‌లు చిత్రపరంగారి వయసు వ్యత్యాసంవున్నా దాన్ని పరిగణనలోకి తీసుకోక వారిరువురిమధ్య పోరాటం చూపటంలో కొంత అనౌచిత్యం కన్పించినా, చిత్రీకరణ పట్టుగాసాగటంతో అది అంతగా పరిగణనలోకి రాకపోవటం, స్టంట్ మాస్టర్, దర్శకుని ఆలోచనా విధానానికి నిదర్శనం.
ఇక పాటల చిత్రీకరణలో వనవిహారానికి వచ్చిన యువరాజు (ఎన్.టి.ఆర్) చిత్రం గీయబోయి బయటకుచూడడం, సన్నగా కురిసే వానలో వనజ (బి.సరోజాదేవి)ను, ఆమె పాటను చూసి, విని ఆనందించే సన్నివేశానికి తగ్గ పాట, నృత్యం అలరించేలా సాగటం ‘వానకాదు వానకాదు వరదారాజా’ (పి.సుశీల) దానికిప్రతిగా, ఆరామంలోకి వచ్చిన వనజ, అక్కడ ఎవరూ లేకపోవటంతో చేతిలో కుండ పగలగొట్టగా చాటునుంచి ఎన్.టి.ఆర్. పాడే పాట ‘కుండకాదు కుండ కాదు చినదానా’ (ఘంటసాల) వారిరువురూ ఒకరినొకరు ప్రేమించుకున్నాక, చక్కని అడవిలో గీతం ‘‘నీవులేక నిముసమైన నిలువజాలనే’ హృద్యమైన చిత్రీకరణతో సాగుతూ ప్రేమికుల అనుబంధానికి నిర్వచనంగా నిలిచింది. (ఘంటసాల, సుశీల) ఎన్.టి.ఆర్, బి.సరోజల అభినయం మరింత శోభను కూర్చింది. ప్రేయసి ఎడబాటుతో యువరాజు పాడే విరహగీతం ‘‘ఆశ నిరాశను చేసితివా రావా చెలియా రాలేవా (ఘంటసాల), ఎన్.టి.ఆర్, అభినయంతో చెలికోసం వేదన, కలవరం మరింతగా ప్రస్ఫుటమయిన గీతం మహారాజుగా లింగమూర్తి, సిద్దయోగి, స్వామిరాజాగా రాజనాల పాత్రోచితంగా హావభావాలు సున్నితంగా, ఒకరు, కపటంగా మోసపూరితంగా యోగి నటించి మెప్పించారు. మిగతా పాత్రధారుల్లో ముక్కామల చెప్పుకోదగ్గ నటన చూపారు. ఇక యువరాజు విక్రమసేనునిగా, ప్రణయం, మాతృభక్తి, పరాక్రమం, ఒక వంక మరొకవైపు ఆషాడభూతిగా, అణుకువగల శిష్యునిగా అమాయకత్వం రెండు పార్శ్వాలను ఎన్.టి.ఆర్. చక్కగా ప్రదర్శించారు. వనజగా బి.సరోజాదేవి, సన్నివేశానుగుణమైన చక్కని నటన, నృత్యంతో అలరించింది.
ఈ చిత్రంలోని ఇతర గీతాలు జ్యోతిలక్ష్మి, రాజనాలపై గీతం. ‘నీతోటి వేగలేను పోపోరా’ (ఎల్.ఆర్.ఈశ్వరి బృందం) భజన గీతం ‘అవతారమెత్తి నావా స్వామిరాజా’, మరో గీతం ‘మన స్వామి నామం పాడుడి’ (మాధవపెద్ది, పిఠాపురం) పద్మనాభం, గీతాంజలిపై యుగళగీతం ‘రాజకుమారి- బల్ సుకుమారి’ (పి.నాగేశ్వరరావు, స్వర్ణలత) క్లయిమాక్స్ ముందు బి.సరోజాదేవి, రాజనాలలపై గీతం ‘‘తాళలేని తాపమాయే సామీ నా సామీ’(పి.సుశీల). ఎన్.టి.ఆర్.పై చిత్రీకరించిన పద్యం ‘‘ఈవికి ఠీవికి ఎనలేని ఇంద్రుడు’’.
‘భాగ్యచక్రము’’ జానపద చిత్రం పింగళివారి, మాటల, పాటల మేళవింపునకు, పెండ్యాల నాగేశ్వరరావుగారి స్వరాలతోడుగా చిరస్మరణీయమైన గీతాలతో అలరించింది. నేటికి ‘వానకాదు వానకాదు, ‘నీవులేక నిముషమయిన’ పాటలు సంగీత కార్యక్రమాలలో శ్రోతలను అలరిస్తుండడం విశేషం.
==పాటలు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/భాగ్యచక్రం" నుండి వెలికితీశారు