బంగారు పిచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
భర్త సన్యాసిరాజు పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేస్తుంది రాజేశ్వరీ దేవి. ఊరిలోని ధనవంతులు, వారి కుమార్తెలను ఆహ్వానించి వరహాలరాజుకు స్వయంవరం లాంటిది ఏర్పాటు చేస్తుంది. పార్టీకి వచ్చిన ధనవంతులు తనకంటే తల్లికి వత్తాసు పలకటం, తండ్రి నిస్సహాయంగా నిలబడటం రాజుకు కష్టంగాతోస్తుంది. పార్టీ అనంతరం రాత్రి స్వతంత్రంగా బ్రతికి, ఇష్టమైన పిల్లని పెళ్లాడమని తండ్రి ఇచ్చిన సలహాతో వరహాల రాజు ఇల్లొదిరి వెళ్తాడు. ఆ వూరిలో ఓ మధ్యతరగతి తండ్రి వడ్లమాని విశ్వనాథం, కూతురు రాధ (విజయనిర్మల). వాళ్ల ఇల్లు అప్పుల్లో ఉంటుంది. అప్పుల ఊబినుంచి బయటపడి ఇల్లు తిరిగి పొందాలంటే ధనవంతుడైన వరాహాల రాజును రాధ ప్రేమించి పెళ్లాడాలని పురోహితుడు కాకరాల, మరో మిత్రుడు సలహానిస్తారు. పథకం ప్రకారం వారిని ఒప్పించి, రాజును రాధ కలుసుకునే ఏర్పాటు చేస్తారు. అలా కలిసిన రాధ తాను జమీందారు బిడ్డనని రాజుకు చెబుతుంది. తాను పేదింటి కొడుకునని రాజు చెబుతాడు. అలా ఇద్దరూ కలిసి హైద్రాబాద్‌కు ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో ఒకరిపై ఒకరికి ప్రేమ పుడుతుంది. ఇదిలావుంటే, ఇంటినుంచి వెళ్లిపోయిన కొడుకును వెదకమని రాజేశ్వరి పంపిన నౌకర్లు జల్సాగా తిరగుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరీ దేవి, కొడుకును వెతికేందుకు స్వయంగా బయలు దేరుతుంది. జరిగినదంతా ఓ కుట్ర అని తెలుసుకుని, 50 వేలు చెల్లిస్తుంది. కుట్రకు కారకుడు తన మేనేజర్ మల్లయ్యేనని తెలుసుకుని, కొడుకును రాధనుండి దూరంగా తీసికెళ్లాలనుకుంటుంది. కాని రాధలోని నిజాయితీ తెలుసుకున్న వరహాలరాజు డబ్బు తీసుకున్న మల్లయ్య, బృందాన్ని చావతన్ని రాధను కలుసుకుంటాడు. ఆమెతో పెళ్లికి తల్లి అంగీకారం పొందటంతో చిత్రం ముగుస్తుంది.
==విశేషాలు==
* ఈ సినిమాకు 1967లో విడుదలైన [[:en:Three Bites of the Apple|Three Bites of the Apple]] అనే అమెరికన్ కామెడీ సినిమా ప్రేరణ.
* ఈ సినిమా ఎక్కువ భాగం అవుట్ డోర్ షూటింగులో నడిచింది. [[వికారాబాదు]] పరిసరాలలో సినిమాను చిత్రీకరించారు.
* అప్పట్లో ఈ చిత్రానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చయింది.
"https://te.wikipedia.org/wiki/బంగారు_పిచిక" నుండి వెలికితీశారు