అగ్గిబరాట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ముక్కామల నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 14:
 
== కథ ==
సేనాధిపతి గజపతి (రామదాసు) తన సైన్యంతో అడవిలో బందిపోటు దొంగలముఠా నాయకుడైన పులిదండు రంగరాజును బంధిస్తాడు. అయితే, తనతో చేతులు కలిపి మహారాజును అంతంచేసి యువరాణిని, రాజ్యాన్ని వశం చేసుకొమ్మని బందిపోటు రంగరాజు సలహాయిస్తాడు. సేనాని గజపతి మాత్రం తన నమ్మినబంటు సలహాతో రంగరాజును అంతం చేస్తాడు. అతని పేరుతో మారువేషంలో తానే దోపిడీలు సాగిస్తాడు. మహారాజు అమరసింహుడు (మిక్కిలినేని) అడవిలో కార్చిచ్చులో మరణించాడని యువరాణి వాసవి (రాజశ్రీ)ని నమ్మిస్తాడు. ఆ రాజ్యంలో రామాపురం గ్రామానికి చెందిన రాజా (ఎన్టీఆర్), ఆ ఏడాది జరిగే ఉత్సవాల్లో వీరుల పోటీలో గజపతిని ఓడించి వీరఖడ్గం చేజిక్కించుకుంటాడు. యువరాణి రాజాకు బహుమానం ఇస్తూ తొలి చూపులోనే అతన్ని ప్రేమిస్తుంది. నగరంలో జరిగిన వీరుని ఊరేగింపులో అంతఃపుర గవాక్షం నుంచి అతనిపైకి పూలబంతి విసురుతుంది. పక్క గవాక్షం నుంచి గజపతి, రాజాపైకి కత్తిని విసురుతాడు. అది రాకుమారే విసిరిందని భ్రమపడిన రాజా, ఆ రాత్రి అంతఃపురంలోకి ప్రవేశించి ఆమెను కత్తులతో బంధిస్తాడు. ఆపైన ఆమెనుంచి ఆమె తండ్రి గురించి, సేనాపతి గురించి తెలుసుకుంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. వీరుని గురించి, వారి ప్రణయం గురించి తెలుసుకున్న గజపతి, యువరాణితో బలవంతంగా పెళ్ళికి సిద్ధపడతాడు. రాజా తన స్నేహితులతో కలిసి మారువేషంలో వచ్చి యువరాణిని తీసుకెళ్తాడు. గజపతి, ఆమెను తిరిగి బంధించి రాజాను గాయపరుస్తాడు. గాయపడిన రాజా అడవిలో ఓ గుహలో మహారాజును, అతని విప్లవ సైన్యాన్ని కలుసుకుంటాడు. మహారాజుకు, యువరాణికి అండగా ఉంటానని మాట ఇచ్చి తిరిగి వెళతాడు. దారిలో రంగరాజు పేరుతో దోపిడీలు చేస్తున్నది గజపతేనని రాజా గ్రహిస్తాడు. కొండబూచాడు (ముక్కామల) సాయంతో రాజా కోటలోకి రాకుండా గజపతి కట్టడిచేయగా, గాలిపటం సాయంతో కోటలోకి ఎగిరి వెళ్ళి గజపతిని అంతం చేస్తాడు. మహారాజు అమరసింహుడు, రాజా యువరాణి వాసలిల వివాహం జరిపించి రాజ్యభారం అప్పగించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది<ref>[http://www.andhrabhoomi.net/content/others-266 అగ్గిబరాటా - ఫ్లాష్‌బ్యాక్ @ 50 - సివిఆర్ మాణిక్యేశ్వరి]</ref>.
సేనాధిపతి గజపతి దొంగలముఠా నాయకుడైన పులిదండు రంగరాజును బంధిస్తాడు. రంగరాజు సేనాధిపతిని లొంగదీసుకోవడానికి రాజద్రోహం చేయమంటాడు. కానీ గజపతి మాత్రం రంగరాజుని హత్య చేసి అటు దొంగలముఠాకి నాయకుడిగా, ఇటు సేనాధిపతిగా నటిస్తూ రాజును చంపిస్తాడు. రంగరాజు మహావీరుడిగా చలామణీ అవుతూ తనదగ్గరున్న వీరఖడ్గాన్ని చేజిక్కించుకోమని ప్రజలకి సవాలు విసురుతాడు. అప్పుడు అగ్గిబరాటా అనబడే రాజా అతన్ని ఓడించి వీరఖడ్గాన్ని చేజిక్కించుకుంటాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అగ్గిబరాట" నుండి వెలికితీశారు