కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రార్ధించా → ప్రార్థించా, మధ్యాన్ని → మద్యాన్ని, ) → ) using AWB
చి link ఐరావతం using Find link
పంక్తి 19:
శరీరవిస్తీర్ణాన్ని గురించి, నిద్ర గురించి, బలాన్ని గురించి వివిధ గాథలున్నాయి. కుంభ కర్ణుడు ఆరువందల ధనువుల పొడవు అనీ, వాని కైవారం నూటయాభై ధనువులంత అనీ రామాయణం [[యుద్ధ కాండం]]లో ఉంది. ''కుంభకర్ణుడి నిద్ర'' అనేది ఒక జాతీయంగా వాడుతారు. కుంభకర్ణుడు తపస్సు చేసి బ్రహ్మనుండి వరాన్ని పొందాలనుకొన్నాడు. కాని వాడి బలానికి భయపడిన దేవతలు ఆ సమయానికి వాడి నోటివెంట 'నిద్ర' అనే పదాన్ని వచ్చేలా చేశారనీ ఒక కథ ప్రచారంలో ఉంది. కాని రామాయణాతర్గతంగా చెప్పబడిన కథక్రింద ఉంది.
 
వాల్మీకి రామాయణం [[యుద్ధకాండ]]లో [[విభీషణుడు]] [[శ్రీరాముడు|రామునకు]] కుంభకర్ణుని గురించి ఇలా వివరించాడు -అతను విశ్రవసుని పుత్రుడు. అనేక దేవతలను, సమవర్తిను, సురపతిని కూడా జయించాడు. ఇంత భారీ ప్రమాణం గలవారు రాక్షసులలో మరొకరు లేరు. వాడు శూలం పుచ్చుకొస్తే మృత్యుదేవత స్వయంగా ముందు నిలచినట్లే. తక్కిన రాక్షసులంతా వరాలవలన గొప్పవాళ్ళయ్యారు. కాని వీడు సహజంగానే మహా తేజశ్శాలి, బలవంతుడు. పుట్టగానే ఆకలితో కనిపించిన జంతువునల్లా తినసాగాడు. లోకులు ఇంద్రుని శరణు వేడగా ఇంద్రుడు వాడిని వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు కోపంతో ఊగిపోతూ ఇంద్రుడు ఎక్కివున్న [[ఐరావతం]] దంతం వూడబెరికి దాంతోనే ఇంద్రుడిని తీవ్రంగా దండించాడు. భయపడిన ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు పోయి లోకాలు విపత్తులో ఉన్నాయని మొరపెట్టుకొన్నాడు. బ్రహ్మ కూడా భయపడి, అంతలోనే తేరుకొని "నువ్వు నేటినుండి చచ్చిపడినట్లు నిద్రపోతావు" అని శపించాడు. వెంటనే కుంభకర్ణుడు నిద్రలోకి జారుకున్నాడు. రావణుడు బ్రహ్మను ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ "ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు" అని శాపాన్ని సడలించాడు.
 
యుద్ధానికి ముందు [[రావణుడు]] తన మంత్రులతో రానున్న విపత్తు గురించి చర్చించాడు. ఆరోజు కుంభకర్ణుడు మేలుకొని వున్నరోజు. విషయం తెలుసుకొని కుంభకర్ణుడు రావణుడు [[సీత]]ను అపహరిండం పొరపాటని అభిప్రాయపడ్డాడు. అయినా జరిగిందేదో జరిగిపోయింది. సోదరప్రేమతో ఇలా చెబుతున్నాను. ఇక యుద్ధంలో నేను సమస్త వానరసేననూ, రామ లక్ష్మణులనూ తినేస్తాను. నువ్వు మధువు సేవించి నిశ్చింతగా వుండు అని ధైర్యం చెప్పాడు. తరువాత యధాప్రకారం నిద్రలోకి జారుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు