"విన్నకోట రామన్న పంతులు" కూర్పుల మధ్య తేడాలు

 
==నాటకరంగం==
ఇతడు 1950 ప్రాంతంలో [[విజయవాడ]]<nowiki/>లో సుంకర కనకారావు, [[కొప్పరపు సుబ్బారావు]], [[డి.వి.నరసరాజు]], [[కె.వి.ఎస్‌.శర్మ]], [[నిర్మలమ్మ]] మొదలైనవారితో రామన్నపంతులుకలిసి [[గురజాడ అప్పారావు]] [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించేవాడు. ఇందులో అగ్నిహోత్రావధాన్లు పాత్రను రామన్నపంతులు గొప్పగా పోషించేవాడు. రాఘవ కళాకేంద్రం ప్రదర్శించిన విశ్వం పెళ్ళి, ఇనుప తెరలు మొదలైన నాటకాల్లో రామన్నపంతులు విలక్షణమైన పాత్రలను ధరించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
 
తరువాత [[డి.వి.నరసరాజు]] రచించిన "నాటకం" అనే నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించి తన కీర్తిని పెంచుకున్నాడు. ఈ నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీల్లో రచన మరియు ప్రదర్శనలకు బహుమతులు లభించాయి. ఇవే కాకుండా ఈనాడు, ఆసామి, శ్రీరంగనీతులు మొదలైన నాటకాలలో కూడా పాత్రలు ధరించాడు.
 
రామన్నపంతులు ఉత్తమ దర్శకుడిగా అనేక నాటకాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో ఎన్.జి.వో., నాటకం, లేపాక్షి, సంభవామి యుగే యుగే, దశమగ్రహాలు ముఖ్యమైనవి.
 
==సినిమా రంగం==
ఇతడు తెలుగు సినీరంగంలో ప్రవేశించి [[బి.యన్.రెడ్డి]] గారి [[బంగారు పాప]] (1954) చిత్రంలో మొదటిసారిగా జమిందారు పాత్రను పోషించాడు. తర్వాత వినోదా సంస్థ నిర్మించిన [[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]] (1955) చిత్రంలో కూడా అగ్నిహోత్రావధాన్లు పాత్రను పోషించి తన నటనకు ప్రశంసలందుకున్నాడు. బాపూరమణలు ఇతడిని పిలిచి తమ తొలిచిత్రం [[సాక్షి (సినిమా)|సాక్షి]] (1967) లో తడిగుడ్డతో గొంతులు కోసే ప్రతినాయకుడు మునసబు పాత్రను ధరింపజేశారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2485315" నుండి వెలికితీశారు